Aug 30
ముంబై మేరి జాన్
Telugu పూర్ణిమ
మాములుగా నేను ఏదయినా సినిమాకెళ్ళాలంటే ఒక పది రివ్యూలు చదివి, ఆఫీస్ లో పదిమందిని వాళ్ళ అభిప్రాయాల్ని కనుక్కొని మరి చూస్తాను.అలాంటి నేను ఈ సినిమాకి ఎలాంటి రివ్యూస్ చదవకుండా,ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాను.అందుకే కాబోలు నేను మొదటిసారిగా ఒక సినిమాకి రివ్యూ రాస్తున్నాను.2006 జూలై 11వ తారిఖున ముంబైలోని ఒక లోకల్ ట్రైన్ లో జరిగిన పేలుళ్ళు ఇతివృత్తంగా సాగుతుంది ఈ సినిమా.అయిదుగురు సాధారణ వ్యక్తుల జీవితాల్లో ఈపేలుళ్ళు ఎలాంటి మార్పుల్ని తెచ్చాయి అన్నది కథాంశం.ప్రతి సంఘటనని కమర్షియలైజ్ చేసి రేటింగ్స్ పెంచుకోవాలని తాపత్రయపడే న్యూస్ ఛానల్స్ ని,అమెరికాలోనో,UK లోనో సెటిల్ అయితే ఇక భవిష్యత్తుకి ఢోకా ఉండదన్న భావనలో ఉన్న నేటి యువతరాన్ని చక్కగా ఆవిష్కరించారు ఈ సినిమాలో.స్వతహగా పరేష్ రావల్ అభిమానినయిన నేను ఈ సినిమాలో ఆయన నటనకి మరొక్కసారి జై కొడుతున్నాను.ఒకరకంగా ఈ సినిమాకి ఆయన హీరో అని చెప్పవచ్చు.రిటైర్ మెంటుకి చేరువలో ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్ తన ముప్పయ్ అయిదు సంవత్సరాల సర్వీసులో డిపార్ట్ మెంటులోని అధికారుల అలసత్వాన్ని,లంచగొండితనాన్ని ప్రశ్నించలేక తనకు తానుగా అసమర్ధునిగా,లంచగొండిగా మారి మధనపడే పాత్రలో ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి