చల్లగా సాగిపోతున్న నాజీవితంలోకి ఒకసారి ఎండాకాలం వచ్చింది.ఎండాకాలం అంటే రోజంతా ఇంట్లోనే ఉండాలి.కనీసం రెండు గంటలయినా లెక్కలు చేసుకోవాలి లేదా ఎక్కాలు చదవాలి.ఇంతకన్నా పెద్ద శిక్ష ఉంటుందని నేను అనుకోను.నేనయితే నాపిల్లల్ని ఎండాకాలంలో చదివించను.ఊరిమీద పడి ఊరేగండ్రా! అని బయటకి పంపిస్తా.అయినా క్యాలిక్యులేటర్లు,కంప్యూటర్లు కనుక్కున్నాక కూడ ఎక్కాలు చదవడం ఏంటో చాదస్తం కాకపోతే!అందుకే ఒకరోజు ధైర్యం చేసి నాన్నని అడిగా సినిమాకి తీసుకెళ్ళమని.ఒక చూపు చూసారు నన్ను."సినిమాలో ఏముంది?మూడుగంటలు టైమ్ వేస్టు.అదే ఒక మంచి పుస్తకం చదివితే తెలియని విషయాలు తెలుస్తాయి,నిద్రపోతే రెస్టుగా ఉంటుంది,లేకపోతే ఇంటిపనిలో అమ్మకి హెల్ప్ చెయ్యొచ్చు కదా!" అని నాకే క్లాస్ పడింది.అదేంటి నాన్న అలా అంటారు? "అమ్మాయి-అబ్బాయి-ప్రేమ" అనే ఒకేఒక్క కాన్సెప్ట్ మీద ఎన్ని వందల సినిమాలు తీయ్యొచ్చో తెలుగు సినిమాలు చూసి తెలుసుకోవచ్చుకదా అని అందామనుకొని ఎందుకో నాకుడి కన్ను అదురుతుంటే ఎందుకొచ్చిన గోలలే అని నోరుమూసుకున్నాను.సినిమాల విషయంలో మాఅమ్మ కూడ మాకే సపోర్టు.ఎప్పుడు సినిమాకి తీసుకెళ్ళరని నాన్నతో నిష్ఠూరమాడుతుంది.కాని మానాన్న సినిమాకి తీసుకెళ్ళక పోవటానికి ఒక కారణముంది.మాకాలనీలో థియేటర్లు లేవు కాబట్టి సినిమా అంటే గోదావరిఖనికి ...
పూర్తిగా చదవండి