ప్రస్తుతం మేము అద్దెకు ఉంటున్న ఇల్లు కొంచం పెద్దది. (Double Bed Room Flat).కాని ఇంట్లో ఉండేది నేను, మావారు మాత్రమే. పెల్లైన తర్వాతా కాపురం పెట్టడానికి, మావారు ఈ ఇల్లు తీసుకున్నారు.చుట్టాలు ఎవరన్న వచ్చిన లేక, చిన్న,చిన్న Functions ఏవన్నా జరిగినా సౌకర్యంగా ఉంటుందని, పెద్ద ఇల్లు తీసుకున్నాం.ఈ రొజుల్లో ఎవరి పనులు వారివి. ఒకరిని మన ఇంటికి పిలవడానికి కాని ,మనం ఇంకొకరి ఇంటికి వెళ్ళడానికి కాని సమయం ఉండటం లేదు.ఉదయంనిద్ర లేస్తూనే హడావిడిగా పనులు చక్కబెట్టుకుని, ఉద్యోగరిచ్చా అందరు బయటకి వెళ్ళిపొయేవారె.పెల్లైన కొత్తలో ఎవరోఒకరు మా ఇంటికి వచ్చిపొతూ ఉండేవారు.ఒక్కోసారి ఈ ఇల్లు కూడా సరిపొయేది కాదు.అప్పుడు నేను ఇంట్లోనే ఉండటం వల్ల పిలిచిన, పిలవకపొయినా ఎవరో ఒకరు నన్ను పలకరించి వెళ్ళేవారు.ఇప్పుడు ఉద్యోగరిత్యా నేను కూడా ఇంట్లో ఉండటం లేదు.ఎవరినన్నా ఇంటికి రమ్మని అంటే వారిచ్చే సమాధానం "వచ్చినా నువ్వు ఉండవుకదే,ఒక్కరకి ఎమి తొస్తుంది, అని అంటున్నారు.వచ్చిపొయే జనాభా తగ్గడం వల్ల రొజు ఇల్లు మా ఇద్దరికి పెద్దదైపొయింది.అంతేకాక రొజు ఇంతిని శుభ్రం చేయడానికి నాకు ఎక్కువ సమయం పడుతొంది.అందువల్ల చిన్న ఇంట్లోకి మారితే బాగుంటుంది అనిపించింది.(ఆ ప్రయత్నంలొనే ఉన్నామనుకొండి.)ఈమధ్యే కొత్తగా వాడని గదిని ఎవరికన్న ఒకరిద్దరికి అద్దెకి ఇస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా వచ్చింది.
 
ఇంతకి ఈ సుత్తి దేనికి? అని అనుకుంటున్నారా!అక్కడికే వస్తున్నా!మావారు కొంచం పొదుపరి(అలా అని నేను దుబారా మనిషిని కాదు లేండి.)కొత్త వస్తువు ఏదన్నా కొనాలంటే ఆ వస్తువువల్ల మనకి ఎంతవరకు ఉపయోగం అని ముందుగా ఆలొచిస్తారు. దానిని కొసం ఎంత ఖర్చ అయినా పెడతారు.చాలా తక్కువ సామాన్లతో మొదలైనా మా కాపురం ఈ రొజున వటవ్రుక్షం లాగా పెరిగింది.అవసరం వస్తుందేమో అని కొని ఫెట్టుకున్న సామానులు ఈ రొజు ఇంటినిండా చెత్తలాగా పేరుకు పొయాయి.పాత సామానులు,వాడని బట్టలు, వార్తాపత్రికలు ఇలా ఈంతి నిండా చెత్తపేరుకుపొయి ఉంది.ఎప్పటికప్పుడు, శుభ్రం చేద్దాం అనుకుంటూనే మళ్ళీ ఎలాగో ఇల్లు మారతాం కాదా మారే ముందు ఒకేసారి మొత్తం చెత్త తీసేయచ్చు అని ఎప్పటికప్పుడు ఊరుకుంటున్నా!.కాని మావారు వాడని వస్తువులు ఎందుకు ఇంట్లో లేని వారికి ఎవరికన్నా ఇస్తే వాళ్ళాన్నా వాడుకుంటారు కాదా అని వారానికి ఒకసారి అంటునే ఉంటారు. ఒక్కోసారి కొపం వస్తే వాడని సామాను నువ్వు బయటా పడేస్తావా,లేకా నేను పడేయానా అని అంటారు.
దేవుడి దయవల్ల మేము ఇంకొకరికి సాయం చేసే స్తితిలొనే ఉన్నాం.కొత్త సంవత్సరం సందర్భంగా ఈ రొజు నేను ఇంట్లో వాడని వస్తువుల ప్ర్రక్షాళన మొదలుపెట్టా!పాత వార్తాపత్రికలు, ప్లాస్టిక్ సామానులు, నాకు ఉపయోగంలేని(తనకు అవసరం అయ్యే)స్టీలు సామానులు మా Watchaman కి వాడుకోమని ఇచ్చా.10రూపాయలు వచ్చినా వచ్చినట్టే కదా!మిగిలినవారికి ఆ 10రూపాయలు పెద్దమొత్తం కాకపోవచ్చు. కాని ఆ 10రూపాయలతో వారు ఒకరొజన్నా కూర వేసుకుని అన్నం తినవచ్చు కదా?ఇంక పాతబట్టల గురించి అలోచించాలి.
 నూతన సం"లొకి అడుగుబెట్టబోతున్న సంధర్బంగా మొదలు పెట్టిన మంచిపని ఎలాఉంది?

పూర్తిగా చదవండి