ప్రతిరోజు నేను ఆఫీసుకి బస్సులో వెళతాను. ఎక్కడంటే అక్కడ ఆపుతాడని నేను ఎక్కువగా సెట్విన్ బస్సులకు ప్రాముఖ్యత ఇస్తాను.కాని ఒక్కసారి కూడా నా స్టాపుల దగ్గర తప్ప దిగను.ఇతే ఈ రోజు ఆఫీసుకు ఆలస్యం అవుతుండటంతోసెట్విన్ బస్సు ఎక్కి స్టాపుకంటే కొంచం ముందర ఆపమని అడిగాను. మొదటిసారి నేను అడిగినది కండక్టర్ కి వినిపించలేదు. అందుకని మళ్ళి అడిగాను కొంచం ఇక్కడ ఆపండి అని, కండక్టర్ చెప్పిన సమాధానం నన్ను కాదు అడగవలసినది అని, మళ్ళీ వెంటనే ఇక్కడ ఆపరు అని సమాధానం ఇఛ్చాడు. అసలే ఆఫీసుకు లేట్ అవుతొందని కంగారు పడుతుంటే వాడి సమాధానానికి అరికాలి మంట నషాలానికి ఎక్కింది.మరి బస్సు ఎక్కేవాళ్ళు ఉన్నప్పుడు ఎక్కడపడితే అక్కడ ఎలా ఆపుతున్నారు అని నేను అడిగాను. వాడు ఏమి అనాలో తెలియక ఎదురు నన్ను మంచిగా అడగద్దా అని నామీదా దాడికి దిగాడు.ఇంతలో బస్సు స్టాపు రావడంతో నేను దిగిపోయాను.వాడికి డబ్బులు రావాలి కాబట్టి అవసరం ఉన్న చోటల్లా ఆపి ఎక్కించుకుంటున్నాడు,అని అనిపించింది.
అందుకనే పెద్దలన్నారు "ధనమేరా అన్నిటికి మూలం" అని.
పూర్తిగా చదవండి