Jan 25
సహదేవోపాఖ్యానం-2
Telugu profashok
సాయంత్రం ఆరయ్యేప్పటికి అందరమూ మా రూము ముందున్న ఎంక్లోజర్ లో కూచున్నాము. సినిమా ఆరింటికవుతుంది. సహదేవుడు బస్సెక్కడానికి మరో అరగంట తీసుకున్నా యేడింటికల్లా రావాలి. వాడికి మెస్సు తెరవగానే తిండికి తయారవడం[ క్రీం బాచి] అలవాటు కనుక వీలయినంత తొందరగా వచ్చేయాలి. ఈ లో గా అవుట్ గేటు నించి మిరపకాయ బజ్జీలు తెచుకుని తింటూ వాడి అనుభవం వినడం కోసం వేచిచూస్తున్నాం. యేడయినా వాడి జాడ లేదు.మెస్సుకి వెళిపోయుంటాదని మేం కూడా వెళ్ళాం. మా భోజనాలు పూర్తిచేసినా వాడు రాలేదు. వాడి కోసం చూద్దామన్నా సీట్లు ఖాళీ చెయ్యాలి. మెస్సు ముందే కుర్చీలు తెప్పించి వేసుకుని కూర్చున్నాం తొమ్మిదిన్నరయినా వాడు కనబడలేదు.[శనివారం పదిన్నర దాకా మెస్సుంటుంది.] తప్పిపోయాడేమో అని అనుమానం వచ్చింది. అయితే రావలసింది యూనివర్సిటీ కి కనుక యెలాగైనా వచ్చేస్తాడు పరవాలేదని యెవరి రూముకి వాళ్ళు వెళిపోయాం . రాత్రి యెప్పుడొచ్చాడో యేమోకాని పొద్దున్న లేచి చూసేప్పటికి గదిలో ముసుగు కప్పుకుని నిద్రపోతున్నాడు. లేపి యేమయిందని అడిగితే యేమీ మాట్లాడలేదు. సైలెంట్ గా మెస్సుకి వెళ్ళి టిఫిన్ తిని వచ్చేశాడు. తరవాత కొంచెంసేపటికి ఇంతకీ ఆ సరస్వతీ ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి