నా మనసు చెబుతోంది ఓ మనోగతం – 18
Telugu January 31st, 2009
----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా
ఈ సమయాన సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-----------------------------------------------------------
కాలమే గాయమై మౌనంగా నిలుచున్నా
భారమైన మనసుతో ముందుకు సాగిపొతున్నా
ఎక్కడైనా తారసపడుతావేమోనని
అటు ఇటు చూస్తున్నా
గాయల గాలంలో కదలలేక మిగిలున్నా
తలపులన్నీ గతకాలపు చిరునామాగా
మిగిలిపోయేనే నీటిమీద రాతలుగా!
కరువు నిండిన సీమను
దాహర్తిని తీర్చీ తుఫాను హోరులా
వేదన నిండిన నా మనసుని
తాకదా ప్రేమ నింపే ఓ పరిమళ పుష్పం ఒకటీ
నీ సాహచర్యం నాలో పరవశం
నింపెనేమొ తెలియదు కానీ
నీ ఎడబాటు నా ఎదలో అంతులేని అగాధం నింపనే
ఆ అగాధంలో కన్నిటి జలధారలు నింపినా
అంతులేని విషాధం ప్రతిబింబమై కళ్ళెదుట నిలిచెలే
--మేఘ
పూర్తిగా చదవండి
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా
ఈ సమయాన సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-----------------------------------------------------------
కాలమే గాయమై మౌనంగా నిలుచున్నా
భారమైన మనసుతో ముందుకు సాగిపొతున్నా
ఎక్కడైనా తారసపడుతావేమోనని
అటు ఇటు చూస్తున్నా
గాయల గాలంలో కదలలేక మిగిలున్నా
తలపులన్నీ గతకాలపు చిరునామాగా
మిగిలిపోయేనే నీటిమీద రాతలుగా!
కరువు నిండిన సీమను
దాహర్తిని తీర్చీ తుఫాను హోరులా
వేదన నిండిన నా మనసుని
తాకదా ప్రేమ నింపే ఓ పరిమళ పుష్పం ఒకటీ
నీ సాహచర్యం నాలో పరవశం
నింపెనేమొ తెలియదు కానీ
నీ ఎడబాటు నా ఎదలో అంతులేని అగాధం నింపనే
ఆ అగాధంలో కన్నిటి జలధారలు నింపినా
అంతులేని విషాధం ప్రతిబింబమై కళ్ళెదుట నిలిచెలే
--మేఘ
పూర్తిగా చదవండి