వర్షం లో తడిచి ఇంటికొచ్చానొక రోజు.
నన్ను చూడగానే అన్నయ్య ‘ఏరా! ఆ గొడుగు తీసుకెళ్ళొచ్చు కదా?’ అన్నాడు.
అక్కేమో ‘వర్షం తగ్గే వరకు ఆగొచ్చు కదా. తడిచొచ్చావేంటి?’ అంది.
నాన్న ‘నీకు జలుబు చేసి జ్వరం వస్తే గాని బుద్ధి రాదు ‘ అన్నాడు.
మా అమ్మని చూద్దును కదా…
నా తలని తన చీర కొంగుతో తుడుస్తు గట్టిగా తిడుతోంది.
నన్ను కాదు…
…
…
…
…
…
వానని.
(ఒక ఆంగ్ల వేగు అనువాదం)
పూర్తిగా చదవండి