తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది, హుషారుగా పాట వినిపిస్తోంది బాత్రూం లోంచి..ఏంటండీ చాలా హుషారుగా ఉన్నారు..ఈపూట........ వంటింట్లోంచి భార్యామణి కేక..(పాట భరించలేక ఆర్తనాదం అనుకోవచ్చేమో !)ఇవాళ ఉగాది కదోయ్! ఇవ్వాళ సంతోషంగా ఉంటే, సంవత్సరమంతా సంతోషంగా ఉండొచ్చు అందుకని .........నా సమాధానం..ఇంకా నయం ఇవ్వాళ తింటే సంవత్సరమంతా తిన్నట్టే, అని, ఇంక మాకు కూడు అదీ పెట్టరా ఏంటి భార్యా మణి రుస రుస...అది కాదోయ్, అది.... చిన్న చిన్న వాటికే..... రోజూ చేసే పనులకి కాదు, కనీసం ఈ రోజైన ఆనందంగా ఉంటామని.... పెద్దవాళ్ళు పెట్టిన ఒక విధమైన 'ఇది'.... ఏం పేరు పెట్టాలో తెలియక తికమక..అంతేలేండి ఈ పండక్కి ఒక చీర నామొహం మీద పడేసి, ఇక సంవత్సరమంతా పండగ చేసుకో అనచ్చనేగా మీ ఆలోచన..మళ్ళీ భార్యామణి లా పాయింటు..అబ్బ అదికాదే..అర్ధం లేకుండా మాట్లాడకు..ప్రతీది రాద్ధాంతం చేస్తావ్ ...పొద్దున్నే తలకాయ నొప్పి..కాస్త కాఫీ నీళ్ళు ...
పూర్తిగా చదవండి