ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలద్వారా ఓటు
Telugu March 31st, 2009 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలద్వారా ఓటు వెయ్యాలంటే...అసలు పోలింగ్ బూత్ లో యెమేమి వుంటయో ముందు తెలుసుకోవాలి. ఇది రెండు భాగాలుగా వుంటుంది. ఒకటికంట్రోల్ యూనిట్ రెండవది బాలట్ యునిట్.కంట్రోల్ యూనిట్ ప్రిసై డింగ్ ఆఫిసర్ దగ్గర అతని కంట్రోల్లో వుంటుంది.ఓటు వెయ్యడానికి వీలుగా కంట్రొలింగ్ ఆఫిసర్ దానిని రేడి చేస్తారు.
ఇంక మనం ఓటు యెలా వెయ్యాలంటే ... ఓటర్ గుర్తింపు పొందినతరువాత పోలింగ్ ఆఫిసర్ దగ్గరున్న రిజిస్టర్ లో సంతకం చెయ్యాలి. అప్పుడు ఒక పోలింగ్ ఆఫిసరు ఓటర్ వేలిపైన చెరిగిపోవని ఇంకుతో గుర్తు వేస్తారు.ఇంకోక అధికారి పార్లమెంటుకు తెల్ల రంగు అసేంబ్లికి గులాబిరంగు స్లిప్ ఇస్తారు.ఆ స్లిప్పు లో ఓటరు సంతకంచేసిన రెజిస్టరు లోని సిరియల్ నంబరు ఓటర్ లిస్ట్ లోని సిరియల్ నంబరు వుంటాయి. ఓటరు తెల్ల రంగు స్లిప్ ఇవ్వగనే తనబల్ల మీద వున్న కంట్రొల్ యునిట్ లో బటన్ నొక్కి బాలట్ మిషన్ ని రేడి చేస్తారు. ఓటింగ్ కంపార్ట్ మెంట్ లొ వున్న బాలట్ మిషన్ పైన ఆకుపచ్చ బల్బ్ వెలుగుతూ వుంటే మిషన్ రేడిగా వుందని అర్ధం. ఇప్పుడు ఓటరు తనకు నచ్చిన అభ్యర్ధికి గుర్తు యెదురుగా వున్న నీలం రంగు బటన్ నొక్కాలి. గుర్తుకి నీలం రంగు బటన్ కి మధ్యలో ఒక బాణం లాగ యెరుపురంగులో వెలుగుతుంది. అంటే వేసిన ఓటు ఆమోదించబడినట్లు. వెంటనే యెరుపురంగుతోపాటు మిషన్ పైభాగాన వున్న ఆకుపచ్చ బల్బ్ కూడా ఆగిపొయి కంట్రొల్ యూనిట్ లొంచి బీప్ అనే శబ్దం వస్తుంది. అంటే ఓటు వెయ్యడం పూర్తి అయిందన్న మాట. ఇదే విధంగా అసేంబ్లీ ఓటు కూడా వెయ్యాలి.
పూర్తిగా చదవండి