ఊసరవెల్లి వై.యస్. రాజశేఖర్ రెడ్డి
Telugu April 17th, 2009
నయవంచకుడు, రెండు నాల్కల మనిషి, జిత్తులమారి నక్క, నమ్మక ద్రోహి, ఏరుదాటి తెప్ప తగలేసే రకం, అవకాశవాది, ఏ ఎండకా గొడుగు పట్టే రకం, నీతి నియమాలు లేని వ్యక్తి, కుటిల నీతి మంతుడు, సోనియా చెంచా... నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో అర్దం అయే ఉంటుంది. అవును వై.యస్. రాజశేఖర్ రెడ్డి గురించే. తెలంగాణా ఇస్తా అనిచెప్పి ఎన్నికల్లో నెగ్గి, తాత్సారం చేస్తూ ఐదు సంవత్సరాలు ఒక సైకో నవ్వు మొఖానికి తగిలించుకొని ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అని ప్రజల్ని మోసంచేసాడు. మొన్నటివరకూ తెలంగాణా ఇస్తాం మరో ఐదు సంవత్సరాలు మీ నెత్తినెక్కి ఊరేగే చాన్సు ఇవ్వండని తెలంగాణా ప్రజలను ముష్టి ఎత్తుకుని, మొదటి దశ ఎన్నికలు అయిపోగానే (ఇక తెలంగాణా లో గెలవననుకున్నాడో ఏమో) రాయలసీమ మీటింగులో రాయల సీమ ప్రజలతో తెలంగాణా ఇస్తే తెలంగాణా లో ప్రైవేటు కాలేజీలు కట్టనివ్వరని, వ్యాపారం చేయనివ్వరని (ఏం వ్యాపారం రాజకీయ వ్యాపారమా), ప్రాజెక్టులకు నీళ్ళు రానివ్వరని చాలా విపులంగా వివరించి చెప్తున్నారు. తెలంగాణాలో మిగతా ప్రాంతాలవారు విదేశీయుల్లా బ్రతకాల్సి వస్తుందని రాయలసీమ ప్రజల చెవులో పూలు పెట్టి వారి మనసుల్ని విషపూరితం చేసి, వారికి లేనిపోని అపోహల్ని స్రుష్టిస్తున్నాడు. వై.యస్. రాజశేఖర్ రెడ్డి కి తెలియదేమో.... తెలంగాణా ప్రజలు కోరేది ప్రత్యేక దేశం కాదని, ప్రత్యేక రాష్ట్రం మాత్రమే అని. స్వాతంత్ర్యం తరువాత ఎన్నో క్రొత్త రాష్ర్టాలు ఏర్పడ్డాయి. తెలంగాణానే మొదటి రాష్ర్టం కాదు.
చంద్రబాబు నాయుడు గార్ని అసెంబ్లీ లోనే నీ అమ్మకడుపులో ఎందుకు పుట్టాను అని నువ్వు బాధపడేలా చేస్తానని అసెంబ్లీ మర్యాదని మరచి ఫ్యాక్షనిస్టు బుద్దిచూపించాడు.
శ్రీధర్ కార్టూన్లపై కూడా అసెంబ్లీలో ప్రస్తావించాడు. శ్రీధర్ ఎన్టీఆర్ మీద కూడా కార్టూన్లు వేసారు ఆయనెప్పుడూ ఇలా పగపట్టలేదు శ్రీధర్ పై.
వై.యస్. రాజశేఖర్ రెడ్డి మాట్లాడిన మాటలు పక్కా అవకాశవాద రాజకీయుని మాటలు. అవి ఒక రాష్ట్ర ముఖ్యం మంత్రి మాట్లాడాల్ససిన మాటలు కావు. ఆయన కేవలం రాయలసీమకే ముఖ్యమంత్రి కాడు. మెత్తం ఆంద్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి. ఆసంగతి మరిచారనుకుంటా... అయినా ఈయన కాలంలో తెలంగాణాలో రాయలసీమ ఫ్యాక్షన్ మనుషులతో ఎన్ని కబ్జాలు చేయించారో హైదరాబాదు వాళ్ళందరికీ తెలుసు.గవర్నమెంటు ఉద్యోగాలు అమ్ముకోవడం, కబ్జాలు, హత్యలు. మంచి ముఖ్యమంత్రే దొరికాడు మనకు. ఇప్పడికైనా అసలు రంగు బయట పెట్టుకున్నాడు ఊసరవెల్లి.
http://www.telugudesam.org/tdpcms/scams/bhoomulu/sakshiscam.php
http://ihateysr.blogspot.com
పూర్తిగా చదవండి