May 01
శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా…….
కవిత్వం, శ్రీశ్రీ శతజయంతి, సాహిత్యం... నాగరాజా
అక్షరాలనిండా నమ్మకాన్నిజనుల అగాధ గాధల్నీ నింపిన కవీనీవు లోహ స్వరంతో చేసినజయగీతాలాపన ఇప్పటికీఓ అమృతవర్షిణియే.పాదముద్రలూ, పనిముట్లూరక్తపుచుక్కా, రొట్టెముక్కా,గద్దరెక్కా, చమట చుక్కామానవత్వం, కరుణలతోజలజలలాడిన నీ కవిత్వంమరో వందేళ్లయినానిత్యనూతనమే.విరహ సుఖాలు, జ్ఞాపకాల శోకాలూప్రణయవేదనలు, సానుభూతి ప్రవచనాలూలేకుండా నీవు చేసిన కొత్త టానిక్జీవనయానపు జాడీలో ఊరే కొద్దీదాని విలువ పెరుగుతూనే ఉంది.ఉదయాస్తమయాలను పొదువుకొన్ననీ కవిత్వం కాలమున్నంత కాలమూజనహృదయాల మధ్యప్రవహిస్తూనే ఉంటుంది.చుట్టూ దగా ఉందని హెచ్చరించిప్రజకు ముందూవెనుకా కవిత్వాన్ని నిలిపినఓ కవీ, రవీ, నీకివే మా జోతలు.బొల్లోజు బాబా
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి