మీకేం మీరేమైనా తీర్పులు చెప్పగలరు మీరు గెలిచిన రాజపక్షే నేను చంపినా లొంగని ఈలం పక్షం అయినా నేను తీర్పులు చెప్పడానికి రాలేదు ఓడిపోలేదని చెప్పడానికి వచ్చాను రాజపక్షాలు యుద్ధాలు గెలవొచ్చు ప్రజల్ని గెలవలేవు గాయపడిన ప్రజా హృదయాల్ని ససేమిరా గెలవలేవు ప్రభాకరన్ చచ్చిపోవచ్చు అతని కొడుకూ చచ్చిపోవచ్చు ఎన్నికల ప్రజాస్వామ్యానికి కదా కుటుంబ పాలన అవసరం ఈలం ఏర్పడడానికి జాతి బతికి ఉంటే చాలు జాఫ్నా బతికి ఉంటే చాలు అక్కడి గాలీ నేలా నీళ్లూ బతికుంటే చాలు నెత్తురోడుతూ గాయాలు తడుముకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ కలలు కంటూ తమ దేశంలోనే నిర్వాసితులుగానైనా సరే ప్రవాసంలోనైనా సరే ప్రజలు బతికుంటే చాలు జాతి ఆకాంక్ష బతికున్నా చాలు - వరవరరావు సౌజన్యం: ఆంధ్రజ్యోతి తేది: 30 మే [...]
పూర్తిగా చదవండి