నాకు పెద్దగా లెక్కలు రావుఎన్నివందల స్మశానాలోఎన్ని లక్షల శవాలోఎన్నికోట్ల వెలుతురు గింజలోనే చెప్పలేను. రెండు కొండల మధ్య సూర్యుని చూపిఅది ఏ సంధ్యంటే ఎవరుమాత్రంఏం చెప్పగలరు!లక్షల సంవత్సరాలకన్నీళ్లు, నెత్తురులుఇంకించుకొన్న ఈ నేలఇకపై తన పరిమళాల తూనీగల్నిఎగరేయదంటే, ఎందుకోహృదయంలో ఇసుక నింపినట్టుంది.ఇంకా తవ్వబడని ఓ నాగరికతనుజల సమాధి చేసేస్తుందీ నేల.ఏడుతరాల అన్వేషణలో ఎవరోఓ మానవుడు ఇక్కడకు వస్తేఇక ఈ నేల ఏమిచూపగలదూనిలువెత్తు అంధకార జలస్థంభాన్ని తప్ప.ఈ మట్టినే నమ్ముకొన్నచెట్టు ఇకపై పాడదు.పిట్ట ఇకపై పూయదు.మనిషి మాత్రంఇక్కడ తన్ను తాను నరుక్కొనిమరెక్కడో పాతుకొంటున్నాడు.ఆ రక్తరహిత జననం కోసంతట్టా బుట్టా సర్ధుకొంటూ, ఈ నేలతోతన అనుబంధాల్ని, అనుభవాల్నిఎలా తీసుకెళ్లాలో తెలీకఅలా వానలో తడుస్తున్నాడు.సుళ్లుతిరిగే మౌనంపైశూన్యంలోంచి కురిసే వానసూదులతో ...
పూర్తిగా చదవండి