- 2009-10 పూర్తిస్థాయి రైల్వే బడ్జెట్‌ను లోకసభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు--3 జూన్ 2009.
- 3 జూన్ 2009న రైల్వేబడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రైల్వే శాఖామంత్రి--మమతా బెనర్జీ.
- మమతాబెనర్జీ రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది ఎన్నవ పర్యాయం--మూడవసారి.
- ప్రపంచస్థాయి రైల్వేస్టేషన్లుగా తీర్చిదిద్దడానికి బడ్జెట్‌లో ఎంపికచేసిన రైల్వేస్టేషన్లలో ఆంధ్రప్రదేశ్ లోని రైల్వేస్టేషన్లు--సికింద్రాబాదు, తిరుపతి.
- కొత్త రైల్వే బడ్జెట్‌లో డబ్లింగ్‌కు అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్‌లోని మార్గాలు--సికింద్రాబాదు-మహబూబ్‌నగర్, బీబీనగర్-నల్లపాడు.
- బోగీల తయారీ కర్మాగారం ఎచ్చట స్థాపించాలని ప్రతిపాదించారు--కాంచ్‌రపారా-హలీషహర్ రైల్వే కాంప్లెక్స్.
- కొత్త రైల్వే బడ్జెట్‌లో ఏ రాష్ట్రానికి అధిక ప్రయోజనం కలిగింది--పశ్చిమబెంగాల్.
- కొత్త రైల్వే బడ్జెట్‌లో తత్కాల్ కనీస చార్జీని ఎంతకు తగ్గించారు--రూ.100కు.
- కొత్త రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కిన కొత్త రైల్వే లైన్లు--మెదక్-అక్కన్నపేట, నాందేడ్-బీదర్, విష్ణుపురి-వినుకొండ.
- కొత్తగా ఎన్ని నాన్-స్టాప్ రైళ్ళను కొత్త బడ్జెట్‌లో ప్రతిపాదించారు--12.
|