*కోర్ట్ బోనులో నిలబడి నీలకంఠం భగవద్గీత పై ప్రమాణం చేసి,లాయర్ అడిగే ప్రశ్నలకు సమాధానంచెప్పటానికి తయారుగా ఉన్నాడు , కళ్ళముందు జరిగిన సంఘటన పై సాక్ష్యం చెప్పటానికి . జడ్జ్ గారు , అతని వంక చూసి అడిగారు ," నువ్వు బాగా ఇబ్బంది పడుతున్నట్లు గా అనిపిస్తోంది ,మొహం విచారంగా ఉంది , ఏమైనా సమస్యా ? "" నేను ఎప్పుడు నిజం చేబుదామనుకున్నా , ఎవరో ఒక లాయరు నాకు అడ్డం పడుతున్నారు,అదే నాకు పెద్ద ఇబ్బంది గా ఉంది సార్
పూర్తిగా చదవండి
-వెంపటి హేమ
చుట్టూ ఉన్న నేల బంగన బయలు కావడంతో, ఎండపడి బొగులు బొగులుమంటూ నిప్పులు చెరుగుతోంది అప్పుడే! ఆ ఎండలో దూరాన ఏదో తెల్లగా మెరుస్తూ తన దృష్టిని ఆకర్షించడంతో తాత చెయ్యి విడిపించుకుని సిద్దూ ముందుకు పరుగెత్తాడు. అలవాటుగా చెయ్యి ఓరజేసుకుని, తల పైకెత్తి ఆకాశాన్ని పరికించి చూసి, గాఢంగా నిట్టూర్చాడు బంగారప్ప.
అమ్మవారి గుడి పక్కనే ఉన్న గంగరావి చెట్టు కొమ్మ మీద కూర్చున్న ఒంటరి కాకి, కనిపించని దేవుణ్ణి కనికరించమని వేడుకుంటున్నదానిలా శక్తిగొద్దీ “కావు, [...]
పూర్తిగా చదవండి
-స్వాతి కుమారి
తాను చదివిన పుస్తకాల వివరాలూ, రివ్యూలు, నచ్చిన సినిమా పాటల విశేషాలే కాకుండా ఇతర భాషా కథల అనువాదాలూ, సొంత రచనా ప్రయోగాలూ అన్నిటినీ Sowmya writes అంటూ తన బ్లాగులోనూ, వెబ్ పత్రికల్లోనూ కుమ్మరించే వి.బి.సౌమ్య ఇప్పుడు కొన్ని సరదా కబుర్లని కూడా మనతో పంచుకుంటుంది.
అంటే, నాకు అప్పుడప్పుడూ తిక్కరేగుతూ ఉంటుంది. అప్పట్లో అంతా ఏం చేయాలో తోచేది కాదు. ఈ మధ్యే 2009 మొదట్లో ఓ మార్గం కనిపెట్టాను. అదే ఈ నిశ్యాలోచనాపథం. [...]
పూర్తిగా చదవండి
తూర్పు పడమర బ్లాగరి అయిన రెంటాల కల్పన కవి. అంతకంటే ముందు మంచి పాఠకులు. “నేను కనిపించే పదం” కవయిత్రి కల్పన వృత్తిరీత్యా జర్నలిస్ట్. నిరంతర సాహిత్య అధ్యయన, రచన తృష్ణ కలిగిన అతికొద్ది మంది తెలుగు సాహితీపరులలో ఈమె ఒకరు. (ఇటీవల ఈమె రాసిన ‘అయిదో గోడ’ కథ మీద జరగవలసినంత సమ్యక్ దృక్పథంలో చర్చ జరగకపోవడం వల్ల ఒక మంచి సాహిత్య సృజన తెలుగు పాఠకలోకానికి చేరలేకపోయిందని నా వ్యక్తిగత ఫిర్యాదు.) ఈమె చదువు [...]
పూర్తిగా చదవండి
నిన్నటి అనుభూతులను పాతర తీసి పాతిపెట్టు
మళ్లీ మొలకెత్తకుండా అరచేతులతో అదిమిపట్టు
మరుపు నిన్నావరించనీ
పాతజ్ఞాపకాలేవో గుర్తుకొచ్చి
నీ కాళ్లకు అడ్డంపడొచ్చు
ప్రేమ చొరబడని కవచమేదో
గుండెనిండా కప్పుకో
వలపు తెమ్మర తాకి నీవులిక్కిపడొచ్చు
అనవసర ద్వేషంతోనైనా సరే
నువ్వెప్పుడూ రగిలిపోతుండాలి
మనసెప్పుడన్నా వెనక్కి తిరిగి గింజుకోవచ్చు
నీవు నడిచే దారి నీకు నచ్చాలంటే
చూపులెప్పుడు అంబరానికే అంటుకోనివ్వు
దుమ్ముకమ్ముకుంటున్నమర్మమేమిటో నీమతినికెలకవచ్చు
నీ ఆలోచనలు ఎటు పరుగెడితే
నీఅస్థిత్వాన్ని అటే పరుగెత్తనివ్వు
వెనక్కితిరిగి చూడకు
నీ సహచరుడెప్పుడూ నీ వెనకే వుండి నీకు అశాంతినిస్తాడు…
పూర్తిగా చదవండి
ఆ రాత్రివేళ ఆరుబయట
మనం కలిసివిన్న రేడియో నాటకం
మహాశ్వేతాదేవి ‘ ఒక తల్లి’
అచ్చంగా ఆఖరి కొడుకు
ప్రతీ ఛటర్జీ పోలికలతో
నిత్యం పొంచివున్న ఆపదలో
దేశదిమ్మరిలా తిరుగాడిన నేను
మాటిమాటికీ నీ తలపుకొచ్చిన
ఓ యావజ్జీవిత గర్భస్థ వ్యథని
అన్యజగతిలోని
ఏ అంతిమశాంతి
నిన్ను రమ్మని పిలిచేనని
హఠాత్తుగా మాయమయేవు
కన్నీటిబొట్టులాగ మట్టిల ఇంకిపోయేవు
ఏదో ఒకరోజున
అమ్మ మరణం అనివార్యమని
ఎరుకలేని తప్త జాగరణలో
ఎన్నటికీ తల్లడిల్లే పిల్లవాడిన్నేను
ప్రాణప్రదాయినీ
జన్మాంతర పెనుతుపాను
అల్లకల్లోలంలో కనుగొనలేకున్నాను నిన్ను
పూర్తిగా చదవండి
ప్రశ్నించండి ప్రశ్నించండి
ఆదిమానవుడు ప్రకృతి ఒడిలోని
వేసిన పెనుకేకలా
ప్రశ్నించడం నేర్చుకోండి
యుద్ధం ప్రారంభానికి ముందు
ద్రౌపదిలా ప్రశ్నించండి
యుద్ధం మొదలయ్యేదే
ప్రశ్నతోనే కదా
ప్రశ్నించకపోతే
ఇంతదూరం ప్రయాణించేవాళ్ళమా?
ప్రశ్న ప్రవాహ వురవడితోనే
రాపిడితోనే నేటి
మన ఆకృతి దాల్చాం
మనిషి ఎప్పటికీ ఆదిమతత్వంతోనే
మొదలవ్వాలి
తనకనులపై కమ్ముకునే
మాయ పొరలను
తన నాభినుండి తన్నుకు వచ్చే
ప్రశ్న మాత్రమే తొలగించగలదు. .
ప్రశ్న మాత్రమే ఎప్పటికీ
నిజమైన నేస్తం
పూర్తిగా చదవండి
నీదాకా చేరడానికి,
నీముందు… ఎన్ని రకాలుగా వివర్ణమైనాను
నలుపన్నావు, సరె.. కుంచె మార్చుకున్నా
పూర్తి తెలుపయ్యాను…దేహంపై
ఉతికిన చొక్కాను మార్చుకున్నట్లు
మనసునీ మార్చుకున్నా….
అయీనా …. ఎక్కడో ఏ మూలో
ఇంత మచ్చ చూపిస్తావేం…?
నిద్ర లేని రాత్రిళ్ళు… ఏడ్చి ఏడ్చి
చారలు తేలిన నా ముఖపు చిత్రపటం…
నేల మీద… అదృశ్యంగా నువ్వు గీసావా?
నా కళ్ళ కది నీ బొమ్మ గానే కనిపిస్తుందేం?
నిశిరాత్రి.. ఆకాశంలో నక్షత్రాలను కలుపుతూ
పోతే..అది నువ్వేఅవుతావు
తెల్లారాక .. ఆకాశం ఖాళీ అవుతుంది
నా హృదయంలా…
అయినా హృదయం ఖాళీ అవటం వుంటుందా?
నువ్వెప్పుడు రక్తంలా ఊరుతూనే
వుంటావు
అడవిలోకి ఎర్రెర్రెగా ప్రవహించినా
నీ గూటిలోకి మళ్ళిమళ్ళి [...]
పూర్తిగా చదవండి
ఎక్కడో ఎందుకో…. ఎలాగనో
దృశ్యం ఒకటి తప్పిపోయింది
ఒక్కొక్కటిగా పేర్చుకున్న జ్ఞాపకాలలోంచి
అది చాలా సున్నితంగా జారి
దాని జాడల తడిని మాత్రమే మిగిల్చి
దారి తెలిసో తెలియకోమరి
ఒక దృశ్యం తప్పిపోయింది
నాలోకి నేను ఒదిగిపోయి
నన్ను నేను ఓదార్చుకుంటున్నప్పుడు
అది నా ముందు దోషిలా నిలబడేది
ఈ దేహంలోంచి దుఃఖాన్ని
బరువుగా కిందికి దించుకుంటున్నప్పుడు
ఎవరివో కలల్ని తీసుకువచ్చి
నా కళ్లముందు కుమ్మరించేది
ఎక్కడ పారేసుకున్నానో తెలియదుకానీ
నా నుంచి
చాలాఅలవోకగా అదెక్కడో జారిపోయింది
నీకేం తెల్సు
పోనీ అంటావు నువ్వు
అది నా కళ్ళలోని ఆఖరిబిందువు
నేను ముక్కలు ముక్కలుగా నరకబడినప్పుడూ
నన్ను పునర్జీవిగ చేసిన పదార్థం అది
చివరిసారిగా దాన్ని
నా గుండె అంచునే [...]
పూర్తిగా చదవండి