జ్ఞాపకాల దొంతర – కానా
Telugu July 22nd, 2009
కానా అంటే కంత, బొక్క అని.
నేను పుట్టింది దాచేపల్లిలో, మా తాతయ్యిగారి ఇంటో. దచ్చినం గదిలో దాన్నే టవర్ గది అనేవాళ్ళం, పొద్దున్నే పుట్టా కాబట్టి ఉదయ భాస్కర్ అని పేరు పెట్టారు నాకు.
ఆ ఇల్లు భలే గమ్మత్తుగా ఉండేది. ఇంత ఎత్తున పునాదులు లేపి నాపరాయితో కట్టిన ఇల్లు. రాళ్ళు పేర్చిన ప్రహరి. నే పుట్టిన టవర్ గది కిటికీ తీస్తే ఓ పెద్ద పున్నాగ పూల చెట్టు. టవర్ గదికి ఎనకమాల ఇంకోగది. తలుపు తీస్తే బైటికి. కిందకి మెట్లు. ఆడ ఓ పెద్ద తొట్టి. ఆణ్ణుంచి కొంచెం ముందున్న బావికి దారి. తొట్టి పక్కనే ఓ జామ చెట్టు. ఇంటెనకమాల వంటగది. గదిలో అటకలు.
పొగపట్టిన చూరు. పొట్టు పొయ్యిలు. రోకలిబండ డ్రమ్ములాంటి దాని మధ్యలో పెట్టి పొట్టు కూరి, రోకలి బండ తీసేసి, కింద కానాలోంచి చెయ్యి పెట్టి బొక్కపెట్టి, అప్పుడు ఎలిగిత్తారు పొయ్యిని. వరండాలో ఈ అయిపు గోడకి ఓ పెద్ద కానా.

దాచేపల్లి ఎళ్ళినప్పుడల్లా ఈ కానా లో కూర్చుని వచ్చేపొయ్యే రైళ్ళని జూస్తూ, గూడ్సు బళ్ళని జూస్తూ ఉండేవాళ్ళం. గూడ్సుబళ్ల పెట్టెల్ని లెక్కబెట్టం మహా సరదా. ఈ కానాలో ఇద్దరు పిల్లలు పక్క పక్కన పడుకునేంత స్థలం ఉండేది. అన్నయ్యా నేను, దాంట్లోకిజేరి ఆడుకునే వాళ్ళం. మా చిన్న మేనత్త దాంట్లో గిల్లాలు ఆడేది. నాకు పేయింట్ వేసేంత సీను లేదుగానీ, దాంట్లోంచి నే చూసిన ప్రపంచాన్ని వెయ్యాలి అని నా కోరిక.
రాత్రుళ్ళు అక్కడ కూచూటానికి భయం. కారణం, ఈ కానాలోంచి చూస్తే పక్కన ఉన్న ఖాళీ స్థలంతో బాటు దానిపక్కనున్న ఓ గుడిశె, దానిముందు రెండు సమాధులు కనిపిస్తాయ్. సమాధులు అంటె మరి భయం ఉండదా?
పగలు, దృష్టి సారిస్తే, ఆ గుడిశె దాటినాక కూసింత దూరంలో రైలుపట్టాలు. ఆటికటైపు ఓ షెడ్డు. అదేందంటే, సచ్చిపోయిన ఎద్దులు అట్టాంటివి ఆడికిదెచ్చి, తోలుతీసి దట్టాలు పడేసే షెడ్దు. ఆటిల్లోని కొన్ని ఎముకల్ని పందార ఫ్యాక్టరీకి పంపిత్తారు, పందారలో ఎముకల పొడికలుపుతారు అని చెప్పుకునేవాళ్ళు. ఇక ఆ షేడ్దు దాటితే దూరాన సిమెంటు క్వారి. ఎ.సి.సి వాళ్ళు ముందు దాచేపల్లిలో సిమెంటు ఫ్యాక్టరీ బెట్టారు. ఆ తర్వాత పిడుగురాళ్ళకి దగ్గర్లో బెట్టారు. దానిపేరు సీతారాంపురం క్వారి అనేవాళ్ళు. సరే ఇక, తలకాయ ఇటు తిప్పితే దూరంగా "నడికుడి" అనే పచ్చ బోర్డు కనిపించేది. అదే నడికుడి రైల్వే స్టేషన్. తల తొంభైడిగ్రీలు ఇటు తిప్పితే నాగులేరుపైన కట్టిన రైల్వే బ్రిడ్జి కనిపించేది.
మా ఇల్లు దాదాపు చివర, మా ఇల్లు దాటినాక రెండు ఇళ్ళే. అవి దాటితే కొంత ఖాళీ దాటితే రైలుపట్టాలు. మరి మా వైపు అన్నీ రాళ్ళేగా. ఎక్కడ చూసినా, రాళ్ళు బయటికి పొడుచుకుని కనపడేవి. వానపడితే ఆ రాళ్ళెంబట నీళ్ళూజేరేవి. ఆటిల్లోకి కప్పలు. కప్పల్ని పట్టుకోడం, రాళ్ళుపెట్టికొట్టటం ఇలాంటివిజేసేవాళ్ళం.
అప్పుడప్పుడు నడికుడి స్టేషన్ కి వెళ్ళేవాళ్ళం. స్టేషన్ కి రెండోవైపున ఓ పెద్ద పార్కు ఉండేది. అక్కడ జారుడుబండ, అవి ఇవి ఉండేవి. ఇక పున్నాగ పూలు రాలి కిందపడినవి తెచ్చి ఒకదాంట్లో ఇంకోటి గుచ్చి మలలు చేసేవాళ్ళం. పున్నాగ పూల వాసన భలే ఉండేది.
ఇప్పుడు ఆ తాతా బొయ్యాడు, ఇల్లూ బోయింది, జ్ఞాపకాలు మాత్రం మిగిల్నై.
పూర్తిగా చదవండి