మాటలు రాని – మాటలు వినిపించని హీరోయిన్
featured, lead, అభినయ, అభిప్రాయాలు, నాడోడిగళ్, పరిచయం, వార్తలు-ప్రకటనలు, శశికుమార్ July 31st, 2009
అందమైన ముఖారవిందం. అంతకన్నా అత్మవిశ్వాసంగల నటన. ఇవి చాలు హీరోయిన్ అవడానికి, అని నిరూపించిన హీరోయిన్ ‘అభినయ’. పేరుకు తగ్గట్లే నిజంగా అభినయ.
‘నాడోడిగళ్’ అనే తమిళ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన ఈ ముగ్ధ, బధిర యువతి అనే నిజం చాలా మందికి తెలీదు. సినిమా చూసిన తరువాత ఎవరికైనా చెప్పినా వారు నమ్మకపోవచ్చు. అంతటి పరిణితి చెందిన ప్రతిభ కనబరిచింది.
భారతీయ సినీ చరిత్రలోనే ఇదొక విన్నూత్నమైన ప్రయత్నం. ఇదివరకూ తెలుగులో ‘మయూరి’ సినిమా కోసం సుధాచంద్రన్ తెరపైకి వచ్చినా, కథాపరంగా పాత్రపరంగా సినిమా అంగవైకల్యం గురించే కాబట్టి అర్థం చెసుకోతగ్గ పరిణామమే. కానీ ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో ఒక మూగ-చెవిటి నాయికను తన ప్రతిభను గుర్తించి ఎన్నుకోవడం నిర్మాత,దర్శకుల అభిరుచికి నిదర్శనం. ఇంత సాహసం చేసికూడా, “అదేమీ పెద్ద విషయం కాదు. తనలో ప్రతిభ ఉంది. తన అవసరం మా సినిమాకు ఉంది. అంతే!” అని అంటున్న దర్శకుడు ‘సముద్రకని’ అభినందనీయుడు. ఈ విషయం గురించి ఎక్కడా పబ్లిసిటీ చెయ్యకపోవడం అతని నిబద్ధతకు చిహ్నం.
‘అంగవైకల్యం పెద్ద సమస్యకాదు. అంగవైకల్యంపై మనలాంటి సాధారణమైన మనుషులు చూపే వివక్ష అన్నిటికన్నా పెద్ద అంగవైకల్యం’ అని ఋజువు చెయ్యడానికి ఇలాంటి ప్రతిభావంతులు, ఆ ప్రతిభని గుర్తించి ప్ర్రోత్సహించే మనుషులూ తారసపడుతుంటారేమో!
పూర్తిగా చదవండి