ఏదో సాధించాలన్న తపన మనసు లోతుల్లో జ్వలించకపోతే దేహం నిర్జీవమైపోతుంది. కాంక్ష మనసుకూ, శరీరానికీ జీవశక్తినిస్తుంది. కాంక్షే ఆవిరైపోతే అన్ని శక్తులూ హరించుకుపోతాయి. కొందరి కాంక్షలు సామాజికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించడం చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. మరికొందరివి ఆధ్యాత్మికత ఉన్నతి, కళారాధన చుట్టూ, ఇంకొందరివి ధన సంపాదన చుట్టూనూ పరిభ్రమిస్తుంటాయి. విలాసాలు, భోగాల పట్ల ఏర్పడే మోహం కొన్ని కాంక్షలను ప్రజ్వలింపజేస్తుంది. భుజించే ఆహారం శక్తినీ.. శక్తి కాంక్షనీ.. కాంక్ష అగ్నినీ రగిలించడం సహజ ప్రక్రియే. అయితే ఆ అగ్నిని ఏ దిశగా నిమగ్నం చేయాలన్నది మన ఇచ్ఛ పైనే ఆధారపడి ఉంటుంది. మనలోని శక్తికేంద్రం నుండి ఉద్భవించే శక్తిని ఏ పనులకై వినియోగిస్తున్నామన్న దాన్నిబట్టే 'ఈ క్షణం మనం' ఉన్నాం. ఎంసెట్ ర్యాంక్ తెచ్చుకోవాలనో, మంచి జాబ్‌లో సెటిల్ అవాలనో, ఆర్థికంగా, సామాజికంగా బాగా స్థిరపడాలనో, జగమెరిగే కళాకారుడిగా మిగిలిపోవాలనో, జీవితాన్ని అపురూపంగా చక్కబెట్టుకోవాలనో.. ఏదో లక్ష్యం నిరంతరం మనల్ని నడిపిస్తూనే ఉంటుంది. లక్ష్యం నిర్దేశించుకోవడం తెలియకపోతే లోపల ఊరకుండని అగ్ని.. కోరికలుగా పరివర్తన చెందుతుంది. ఆ అగ్నికుండే తత్వమే ఏదో ఒక దాన్ని జ్వలింపజేయడం! అది లక్ష్యం ...
పూర్తిగా చదవండి