Can't see Telugu? Learn here. More Questions? Ask here.

అజ్నబీ షాయర్

Telugu నాగరాజా
ఎవరస్తారనో ఇంత విరగ కాస్తోందీ వెన్నెల ఎంత సంబర పడుతుందో ఇప్పపూల వింత వాసన ఎవరస్తారనో నీటి చెలమల్లో - పులకిస్తున్న ఊటలు ఎన్ని సాహస ఊహలో ఇసుక మీద పొర్లి తీయగా పరుగులు తీస్తున్న మనసులాంటి జలాలు ఎవరస్తారనో బాటల వెంట- పూల తోరణాల్లా చేరిన పిల్లల గుంపులు ఏమి తెస్తారనో దీపాలు వెలిగించిన పండగలా నిర్మల నిశ్చల చూపుల్లో మెరుపులు ఎవరస్తారనో వర్షంలో తడిసిన ముత్యంలా తెల్లవారు జాములో నిరీక్షించే విప్పారిన ముఖాలు ఎప్పుడొస్తారనో కురులు దులిపి- సవ్వడులు లేపినట్టు నదిమీది తెప్పలకు నిలకడలేని అలలకలలు ఎవరస్తారనో ఎన్ని ఆటంకాలనైనా ఎదుర్కొని స్వాగతించటానికి ప్రాణాల్ని వీణలుగా చేసిన బతుకుపోరు తన్మయత్వాలు ఎవరస్తారనో …………………….?! ఎవరస్తారనో …………………….?!
పూర్తిగా చదవండి

కొన్ని మరణాల్లోంచి

Telugu నాగరాజా
మరణాల్ని కీర్తించడం కొత్తేమీ కాదు మణికర్ణికా ఘాట్ లో రగిలే ఆరని చితిమంటల్లో నిత్యం నన్ను నేను దహించుకొంటున్నవాడ్నే చరిత్రలో స్వర్ణ యుగాలంటూ ఉండవు రాజు దైవాంశ సంభూతుడూ కాదు పాలించే వాడెవడైనా పదఘట్టనల కింద నలిగిన ఆత్మలు మౌనంగా రోదిస్తూనే ఉంటాయి చార్మినార్ ల సాక్షిగా ఆకాశంలో నిలబడి జరుగుతున్న తంతును వీక్షిస్తూనే వుంటాయి నన్ను నేను మొలకెత్తించుకుంటున్న చారెడు నేలపై మోపిన రాక్షస పాదపు జాడలు మనసులోంచి తొలగిపోలేదు పురుగుల మందు సేవిస్తూనో దూలానికి వేలాడుతూనో నన్ను ఆక్రమించిన పాదాలను మోస్తున్న బోయిలను గమనిస్తూనే ఉన్నాను పెదాల చిరునవ్వులపై విరిసిన కత్తుల్ని ఆస్వాదించిన వాడ్ని నువ్వు నడిచెళ్ళిన దారుల్లొ తెగిపడిన శిరస్సుల్ని పోగుచేసుకొంటున్న వాడ్ని తారీఖులు దస్తావేజులతో పనిలేని యుద్ధాలలో చెల్లాచెదరైన [...]
పూర్తిగా చదవండి

నాగలికర్రొకటి తీసుకునిరా

Telugu నాగరాజా
సమూహంలొ నిన్ను నువ్వు తప్పిపోవటం నిన్ను నువ్వే వెతుక్కోవటమంటే అల్లుకున్న బురద తీవెకింద మాయమైన బతుకుపిందెల్ని వెతుక్కోవటమే బెదిరిన ఆబోతు మీదికి ఒరికినట్లు కట్టలు తెంచుకుంది, ఈ ప్రాణ జలమేనా ! రెప్పలే లేనట్లు కాచుకున్నా మట్టికట్ట ఉప్పై కరిగిందేమిటీ?   కడుపులో పెట్టుకుని చూచుకున్న నదికి కడుపు చించితే కాళ్లమీదేమిటి, కాటిమీదాపడుతుంది ఊరుపోయింది, వాడపోయింది బువ్వజాడపొయింది, పుస్తెల తాడూ పొయింది పిల్ల పెళ్ళి కోసం తెచ్చిన అరివేణికుండలో ఆకలి మేటేసింది నువ్వు బురద సముద్రాన్ని ఈదుతున్నపుడు   గంజిపెట్టి ఇస్త్రీ చేసిన తెల్లటి చీకటిని తొడుక్కుని   బతుకు పుట్టిని నట్టేట ముంచేసే సరంగులు పంట పొలాల లేజర్ షో నిర్వహించేసి ఆహారపు పొట్లాల కింద [...]
పూర్తిగా చదవండి

నీకెలా నమస్కరించను?

Telugu నాగరాజా
చందమామను జేబులోకి తెచ్చుకున్నవాడా మబ్బుల గిన్నెలో వెన్నెలని జీవితం చేసుకున్నవాడా ఉద్యమ సముద్రంలో అలుపు లేకుండా ఈదినవాడా వీరుడా నీకు జోహార్ ఇది స్వప్నమో జీవితమో ఇది నిజంగా నిజమో లేక అబద్దమో అర్థ రాత్రి ఇలా సూర్యుడు పొడుస్తాడా పగిలిన మృదంగం ఎంత బాగా నాదించింది వీరుడా ఒక్క చిరునవ్వు నవ్వు భాగోతం తైతక్కలాడింది డప్పు గొంతు విప్పింది అర్థరాత్రి తుపాకి దెబ్బ విని అరిచే ఖడ్గ మృగం ఉలిక్కి పడింది వీరుడా నిన్నెలా ప్రశంసించను ఆకాశం నిండా ఆత్మగౌరవం జండా రెపరెప లాడిన క్షణం ఇది వర్షపు చినుకులకు దున్నపోతు చలించిన క్షణం ఇది మూడున్నర కోట్ల ఊపిరి దీపాల [...]
పూర్తిగా చదవండి

నీ దారెప్పుడూ ఇంతే…

Telugu ఎన్.వేణుగోపాల్
మర్రి చెట్టు ఊడల్లా నువ్వూ నేను అల్లుకుంటూ పోతామా నీడల్ని పరుచుకుంటూ గలగలలు లేకుండా ప్రవహిస్తామా ఐనా- చిరిగిన పేజీని ఇష్టంగా చదివించి ముగింపు తెలియకుండా తెలియనితనం లోకి నెట్టివేసినట్లు సంగమం తరువాత ఎడారి మొక్కను చేస్తావు ! నీ దారెప్పుడూ ఇంతే – విందు పంక్తిలో చివరి విస్తరిలా… బండికింద కుక్కపిల్లల్లా తోకలూపుకుంటూ వెనక కాళ్లతో ప్రపంచాన్ని తన్నుకుంటూ వెళ్లిపోతుంటామా దించిన తల ఎత్తకుండా గుండెమీద శిశిర సంధ్యలను మోస్తూ ఉంటామా ఐనా- పుస్తకంలోని అక్షరాలు ఒలికిపోకుండా జాగ్రత్త పడలేని అమాయకత్వాన్ని గానుగలో నలిగే విత్తనాన్ని చేస్తావు! నీదారెప్పుడూ ఇంతే [...]
పూర్తిగా చదవండి

అలిసిన అలలు

Telugu నాగరాజా
ఒరియా మూలం – రాజకిషోర్ దాస్ ఏమవుతుందిట అలలు పొంగి పొరలకపోతే సాగరం నీరవమైపోతే శ్మశాన భయ కంపనలు యావత్తు శరీరాన్నీ ఆవహిస్తే హఠాత్తుగా ట్రైన్ అరణ్యపు టన్నల్ మధ్య కీచుమని ఆగిపోతే మాఘమాసపు సంజె వేళ ఎవరు పట్టించుకుంటారు సాగరాన్ని అడుగుతారు ఎవరు ఉత్తుంగ తరంగాలు ఎక్కడని ఛిన్నా భిన్నం చేసారు ఎవరు నిశ్చల నిర్లక్ష్య నడతను తుడిచి వేసారు ఎవరు గాఢ నీల వర్ణాన్ని పులిమి పట్టించారు ఎవరు నల్ల మట్టిని నల్ల తారు రంగుని సరుగుడు తోటల్లో కదలిక లేదు చడీ చప్పుడు లేదు స్పందన అన్న మాటే లేదు ఉంది సముద్ర తీరం శుష్క దారువులా స్థిరంగా ఒంటరి ఒంటరిగా ఆకాశంలోకి లేచి పొడుగ్గా తాటి చెట్లు పశ్చిమ దిశలో మెరుస్తూ కనబడుతూ ఆరుతూ మాయమవుతూ తాటి మాటున గుడ్లగూబ కళ్ళు నత్తలా ముడుచుకుపోతూ ముడుచుకుపోతుంది నత్తలా నా [...]
పూర్తిగా చదవండి

నిప్పు రాజుకుంది…

Telugu నాగరాజా
రచయిత: యస్. గణేశ లింగం “అమ్మా …! అని కొడుకు సుగంతన్ పిలిచినట్లై తంగమ్మ మూతపడుతున్న కళ్ళను ఉలిక్కిపడి తెరిచింది. కొడుకొచ్చాడన్న ఆరాటంతో బైటికొచ్చిన తంగమ్మకి ఎవరూ కనిపించలేదు. ‘ఏదో కల గని వుంటనులే’ అనుకుంటూ తిరిగొచ్చి పడుకుంది.. ఇంత రాత్రయినా సుగంతన్ జాడలేదు. అతని పక్క దుప్పట్లు నిన్న చుట్ట చుట్టిపెట్టినవి అలాగే వున్నాయి. రాత్రి పూట వూళ్ళో కర్ఫ్యూ అమల్లో వుంది. జాఫ్నాలొ తమిళ ప్రాంతాలన్నిటా ఇదే పరిస్థితి. పది దాటిన తర్వాత ఎవరూ బైట [...]
పూర్తిగా చదవండి

రెక్కల హరివిల్లులు

Telugu నాగరాజా
దసరా పండక్కి నాలుగు రోజులు శెలవిస్తారని విన్న క్షణం నుంచీ నా మనసుకి రెక్కలు మొలిచాయి. ఎపుడెపుడు యింటికెళ్ళిపోతానా అన్న ఆరాటం. అమ్మా నాన్నల్తోపాటు అస్తమానం గుర్తొచ్చే మా తోటలోని పూలని పలకరించి ఎన్నాళ్ళయిందో . . . పూలరెక్కల సీతాకోక చిలుకల్ని పరామర్శించాలన్న తహతహ . . . జైల్లాంటి మా హాస్టల్ చుట్టూతా ఉన్న ఎత్తైన ప్రహరీగోడ మీంచి ఎగిరెళ్ళి మా తోటలో వాలిపోవాలన్న కోరిక . . . సీతాకోక చిలుక . . [...]
పూర్తిగా చదవండి

పొక్కిలి

Telugu నాగరాజా
అగ్గిపెట్టె గుగ్గిపెట్టె లవ్వో లాటో చెంచో బైటో ఠాంగు ఠీంగు తమ్మళ్ళ పెద్దవ్వ తసుక్కు… తుసుక్కు వాడకట్టు పిల్లలు ముగ్గురు నల్గురు కలిసి ఇంటి ముంగటి గచ్చుమీద అర్సేతులు బోర్లేసి ఆడుకుంటుండ్రు. ఒక చెయ్యి అగ్గిపెట్టె గుగ్గిపెట్టె… అనుకుంట బోర్లేసిన వేళ్ళను తాకుకుంట పోతంది.. దానితోనే మిగిలినోళ్ళ కండ్లూ పోతున్నాయి… తుసుక్కుమన్న దగ్గర వేలు లోపలికి ముడుసుక పోతంది. ముడుసుకపోయిన వేలు పానం పోయినంత తల్లడిల్లుతంది. అగ్గిపెట్టె గుగ్గిపెట్టె… మళ్ళా మొదలైతంది… మళ్ళా వేలు ముడుసుకుపోతంది… పొద్దు గూట్లెవడ్డది. దేవయ్య సైకిల్ మీద మందు బస్తాలు తీసుకుని [...]
పూర్తిగా చదవండి

నల్ల నినాదం అతని కవిత్వం!

Telugu నాగరాజా
చాలా కాలంగా వెంటాడుతున్న కవి లాంగ్స్టన్ హ్యూస్! ఎప్పుడో 1902లో పుట్టి, ఏ 1967లోనో కన్నుమూసిన ఈ కవి ఇప్పుడు నా లోకంలో ఎలా కన్ను తెరుచుకున్నాడు?! అతని కవిత్వ పాదాల్లోని ఏ శక్తి నన్ను అటు వైపు జర జరా ఈడ్చుకెళ్ళింది? ఇటీవల హార్వర్డ్ విశ్వ విద్యాలయంలో హెన్రీ గేట్స్ అనే వొక నల్ల ప్రొఫెసర్ మీద పోలీసు దాడికి నిరసనగా “తోలు మందం” అనే శీర్షికతో (ఈ కవిత నా కొత్త సంపుటి “వూరి చివర” [...]
పూర్తిగా చదవండి

రాయలసీమ జానపద సాహిత్య సౌరభం

Telugu ఎన్.వేణుగోపాల్
రాయలసీమ రతనాలసీమ. రతనాలకంటే విలువైన జానపద సాహిత్యానికి కూడా ఈ సీమే ప్రసిద్ధి. జానపద సాహిత్యం అక్షర ఙ్ఞానం లేని పల్లీయుల సాహిత్యం. మనదేశంలో నూటికి 75 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్తూ పల్లెల్లోనే జీవిస్తున్నారు. శిష్ట సాహిత్యాన్ని మనమెంత చదువుకున్నా మన తెలుగు సాహిత్యంలోని సౌరభాల్ని, స్వచ్ఛతను, తియ్యదనాలను రుచి చూడాలంటే జానపద సాహిత్యాన్ని పరిశీలించక తప్పదు. జానపద సాహిత్యం రోజురోజుకు అంతరించిపోతోంది. దీనిని కనీసం భద్రపరచాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఆంధ్ర [...]
పూర్తిగా చదవండి

బోల్షెవిక్ విప్లవ పొలికేక “బ్యాటిల్‌షిప్ పొటెంకిన్”

Telugu నాగరాజా
దాదాపు పాతికేళ్ల క్రితం ఎస్వీ యూనివర్శిటీలో పీజీ చేస్తున్న రోజుల్లో దూరదర్శన్‌లో ఒక మూకీ చిత్రం చూపించారు. నాటి సోవియట్ యూనియన్ అధ్యక్షుడు గోర్బచేవ్ భారత్‌ను సందర్శించిన సందర్భంగా చిత్రమేళా రూపొందించి రష్యన్ సినిమాలను వరుసగా చూపించారు. ఓ రాత్రి పది గంటల తర్వాత దూరదర్శన్‌లో చూసిన ఆ సినిమా వీక్షణ అనుభూతులు ఇప్పటికీ నాలో చెక్కుచెదరకుండా ఉన్నాయి. అప్పటికే యుద్దనౌక పొటెంకిన్‌లోతిరుగుబాటు గురించి పుస్తకాల్లో, పేపర్లలో చదివి తెలుసుకోవడం వల్ల కూడా ఈ సినిమా అంటే [...]
పూర్తిగా చదవండి

పడమటి నీడ – సమీక్ష

Telugu నాగరాజా
లోకంలో రెండు రకాల కథకులు ఉంటారు. “నిరుపహతు స్థలము, బంగరు టూగుటుయ్యల, రమణీప్రియ దూతిక, కప్పురపు ఇడెము”లాంటి హంగులు సమకూర్చుకుని, ఊహాలోకాల్లో తేలిపోతూ, పడవల్లాంటికార్లు, ఇంద్ర భవనాలు, అరడజను నౌకర్లు సృష్టించి, పాఠకులను గాల్లో తేల్చేస్తారు కొందరు. ఇక రెండవ రకం కథకులుంటారు. వీరు తమ చుట్టూ ఉన్నఆకలినీ, శోకాన్నీ, చావునీ, దుఃఖాన్నీ, చిన్నచిన్న సంతోషాల్నీ సృష్టిస్తారు. వీరి కథల్లోని పాత్రలు మనకు రోజూ ఏదో ఒక రూపంలో కనపడుతూనే ఉంటారు. ఒక్కోసారి, ఈ రకం కథలు [...]
పూర్తిగా చదవండి

నవలను చదివించే విమర్శ ‘అతడు – ఆమె : మనం’

Telugu నాగరాజా
మంచి సాహిత్య విమర్శ మంచి సాహిత్యాన్ని చదివేట్టు పాఠకుల్ని ప్రోత్సహిస్తుంది. సాహిత్య పఠనను ప్రోత్సహించడం మాత్రమే గాక, పాఠకులలో సాహిత్యంపట్ల, సమాజంపట్ల ఆలోచనల్ని రేకెత్తించి వాళ్ళ సంస్కారంలో మార్పు తీసుకొని వస్తుంది. రచయితలు సమాజం ఎలా ఉంది, అలా ఎందుకుందో చెబితే; విమర్శకులు సాహిత్యం ఎలా ఉందో, అలా ఎందుకుందో చెబుతారు. ఇద్దరి ప్రయత్నమూ పాఠకులలో ఆలోచనలు రేకెత్తించి కర్తవ్యోన్ముఖులను చేయడమే. గాంధీజీ నాయకత్వంలోనే నడిచిన భారత జాతీయోద్యమాన్ని విమర్శనాత్మక దృక్పథంలో విశ్లేషిస్తూ లక్ష్మణరావు దినచర్య కథనంలో రాసిన [...]
పూర్తిగా చదవండి

స్వేచ్ఛకోసం మత(ఠ) సంకెళ్ళను తెంచుకున్న “ఆమె”న్ !

Telugu నాగరాజా
క్రైస్తవ మత(ఠ) ప్రతినిధులైన ఇరువురు మహిళలు క్రైస్తవ ప్రపంచాన్ని సందిగ్ధంలో పడవేసిన సంవత్సరం 2009. సిస్టర్ ఆల్ఫోన్స్ చర్చి చేత పునీతురాలిగా ప్రకటింపబడింది. క్రైస్తవ విలువలుగా ప్రకటింపబడిన వాటిని, అధికార వర్గాల దురాగతాలను, దుశ్చర్యలను ధిక్కార స్వరంతో ప్రశ్నిస్తూ వచ్చిన సిస్టర్ ‘జెస్మ్’ చర్చి నుండి బయటకు నెట్టి వేయబడింది. అదే సమయంలో కేరళకు చెందిన సిస్టర్ ‘అభయ’ హత్య ఉదంతంలో ఇద్దరు ఫాదర్స్ ను, ఒక నన్ ను సిబిఐ అరెస్టు చేయడం, సిస్టర్ అనూప [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS