అజ్నబీ షాయర్
Telugu February 6th, 2010
ఎవరస్తారనో
ఇంత విరగ కాస్తోందీ వెన్నెల
ఎంత సంబర పడుతుందో
ఇప్పపూల వింత వాసన
ఎవరస్తారనో
నీటి చెలమల్లో -
పులకిస్తున్న ఊటలు
ఎన్ని సాహస ఊహలో
ఇసుక మీద పొర్లి
తీయగా పరుగులు తీస్తున్న
మనసులాంటి జలాలు
ఎవరస్తారనో
బాటల వెంట-
పూల తోరణాల్లా
చేరిన పిల్లల గుంపులు
ఏమి తెస్తారనో
దీపాలు వెలిగించిన పండగలా
నిర్మల నిశ్చల చూపుల్లో మెరుపులు
ఎవరస్తారనో
వర్షంలో తడిసిన ముత్యంలా
తెల్లవారు జాములో
నిరీక్షించే విప్పారిన ముఖాలు
ఎప్పుడొస్తారనో
కురులు దులిపి-
సవ్వడులు లేపినట్టు
నదిమీది తెప్పలకు
నిలకడలేని అలలకలలు
ఎవరస్తారనో
ఎన్ని ఆటంకాలనైనా
ఎదుర్కొని స్వాగతించటానికి
ప్రాణాల్ని వీణలుగా చేసిన
బతుకుపోరు తన్మయత్వాలు
ఎవరస్తారనో …………………….?!
ఎవరస్తారనో …………………….?!
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి