నీ దారెప్పుడూ ఇంతే…
Telugu February 6th, 2010
మర్రి చెట్టు ఊడల్లా నువ్వూ నేను అల్లుకుంటూ పోతామా
నీడల్ని పరుచుకుంటూ గలగలలు లేకుండా ప్రవహిస్తామా
ఐనా- చిరిగిన పేజీని ఇష్టంగా చదివించి ముగింపు తెలియకుండా తెలియనితనం లోకి నెట్టివేసినట్లు
సంగమం తరువాత ఎడారి మొక్కను చేస్తావు !
నీ దారెప్పుడూ ఇంతే – విందు పంక్తిలో చివరి విస్తరిలా…
బండికింద కుక్కపిల్లల్లా తోకలూపుకుంటూ
వెనక కాళ్లతో ప్రపంచాన్ని తన్నుకుంటూ వెళ్లిపోతుంటామా
దించిన తల ఎత్తకుండా గుండెమీద శిశిర సంధ్యలను మోస్తూ ఉంటామా
ఐనా- పుస్తకంలోని అక్షరాలు ఒలికిపోకుండా జాగ్రత్త పడలేని అమాయకత్వాన్ని
గానుగలో నలిగే విత్తనాన్ని చేస్తావు!
నీదారెప్పుడూ ఇంతే [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి