తక్కువేమి మనకు - శ్రీ దత్తుండొక్కడుండు వరకు (పల్లవి)

1. చాకలినే నరపతిగ చేసిన
శ్రీ పాద వల్లభ శ్రీ కృప యుండగ

2. శూలపాణియై దొంగల చంపిన
శ్రీపాద శివుడు అండగనుండగ ||

3.. వట్టి గేదెను క్షీరదాయిగ చేసిన
శ్రీ నరహరి మనకుండగ ||

4. పిడికెడు బియ్యము వేలభోజనముగ
వండిన శ్రీ నరసింహుడుండగ ||

5. తన మలమునే హేమముగ మార్చిన
శ్రీ మాణిక్య ప్రభువు మనకుండగ ||

6. పాముల బంగారు కడ్డీలు చేసిన
శ్రీ స్వామి సమర్ధుల కరుణే వుండగ ||

7. సటకా కొట్టుచు యమునే తరిమిన
శ్రీ షిరిడి సాయి మన వెంట నుండగ ||

8. వేలాది మహిమలు చూపుచు
బోధక శ్రీ సత్యసాయి చెంతనుండగ ||

9. త్రిలోక దుర్లభ బ్రహ్మ ఙ్ఞానదుడు
శ్రీ దత్తస్వామి మనతోనుండగ ||

ఫలశ్రుతి : నిరాశ దూరమై, ఉత్సాహం కలుగుతుంది.
పూర్తిగా చదవండి