Can't see Telugu? Learn here. More Questions? Ask here.

అక్షరం ‘అ’

అచ్చులు పదకోశం
అంకులు = అక్షరాలు, అంకెలు అంగట్ల అమ్ముకచ్చుడు = ఒక వ్యక్తిని, అతని ప్రవర్తనను పూర్తిగా బహిరంగపరచడం, చులకన చేయడం, నిందించడం. అంగడి = సంత అంగడి అంగడి అవుడు, అంగడి జేసుడు = ఇంట్లోని సామాన్లను చిందరవందర చేయడం అంగడి పెట్టుడు = ఇంట్లోని సామాన్లను బయట వేయడం అంగవడుడు = ఒల్లు వంచి శ్రమించడం అంగామ (హంగామా) (ప) = హడావుడి, ఆడంబరం అంగి, అంగీ = చొక్కా అంగి రైకె పెట్టుడు = పిల్లలకు చొక్కా, తల్లికి రవిక పెట్టడం (సాధారణంగా కట్నాలు [...]
పూర్తిగా చదవండి

అక్షరం ‘ఆ’

అచ్చులు పదకోశం
అ అంటె ఓ రాడు ఓ అంటె నా రాదు = ఏమి తెలియదని అర్థం (ఒనమాలు రావనీ, అక్షరజ్ఞానం లేదనీ) ఆ సందుల = ఆ మధ్య, అప్పట్లో ఆం, ఆము = అన్నము (చిన్నపిల్లల్ని ఉద్దేశించి ‘ఆం’ తిన్నావా అంటాము) అవము ఆందాక = అక్కడిదాకా, అప్పటివరకు ఆందెం = ఆముదం ఆంబుక్క పెట్టుడు = అన్నపు ముద్ద ఒకేసారి పెట్టుకోవడం, మరచిపోవడం ఆంబోతు = బలిష్టమైన ఎద్దు ఆంరస్త = జనసంచారం, రద్దీ గల రోడ్డు ఆకరిచూపులు = అంతిమదర్శనం ఆకలైతుంది అంటె రోకలి మింగుడు [...]
పూర్తిగా చదవండి

అక్షరం ‘ఇ’

అచ్చులు పదకోశం
ఇంగటుకులు = ఇంగువతో తాలింపు వేసిన అటుకులు ఇంగిల్ పీసు = ఇంగ్లీషు ఇంగిలీకం = ఒక చేప ఇంగులం = నిప్పు ఇంటామె = ఇంటావిడ, ఇల్లాలు ఇంటాయన = మావారు ఇంటి ఇల్లాదులు = ఇంటిల్లి పాదీ ఇంటి నక్ష = ఇల్లు ప్లాన్ ఇంటి పట్టున = ఇంటి దగ్గర ఇంటిమీద ఉండుడు = భర్తపోయిన మొ||న స్త్రీలు పుట్టింటిలోనే వుండడం ఇంటి మొకం పట్టుడు = తిరుగు ముఖం పట్టడం ఇంటింటి మారాజులు = ఇంటిల్లిపాదీ ఇంటింటికి మంటి పొయ్యి = గృహచ్చిద్రాలు అని, ప్రతి యింటి దోసేకూ [...]
పూర్తిగా చదవండి

అక్షరం ‘ఈ’

అచ్చులు పదకోశం
ఈంచు = ఇంచ్, అంగుళం ఈందాక = ఇక్కడిదాక ఈకగాదు తోకగాదు = లెక్కలోకిరాదు ఈకలేదు తోకలేదు = తలాతోకాలేనిది ఈకుడు = కొట్టడం ఈగలు జోపుకునుడు = గోళ్ళు గిల్లుకోవడం (పనిలేని సమయంలో) ఈగుడు = చొరడం ఈడ = ఇక్కడ ఈడిగ = గవుండ్ల ఈడిగిల్ల పడుడు = ప్రాధేయపడడం, అడిగింది ఇచ్చేదాక పట్టుబట్టడం
పూర్తిగా చదవండి

అక్షరం ‘ఉ’

అచ్చులు పదకోశం
ఉంకుచెండి = మేలైన బంతి ? ఉంకో, ఊకో = ఊరుకో, ఇంకా, ఇంకొక ఉంకోపాలి = ఇంకొక పర్యాయం ఉంగుటం = చెప్పు ఉంగుటం ఉంటి(ని) = ఉన్నాను ఉండ = దారపుండ, ఊబ్దుండ ఉండమాను = కట్నకానుకలు ఉండి = హుండీ ఉండుట్ల = ఉండడం వల్ల, ఉండుట వల్ల (మీరక్కడ ఉండుట్ల మేం రావలసి వచ్చింది) ఉండె = ఉన్నది, ఉండింది
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS