Can't see Telugu? Learn here. More Questions? Ask here.

అమెరికన్ కవిత్వంలో ఒక దక్షిణం గాలి… కాజిం అలి

అనువాదాలు, దర్వాజ నాగరాజా
“తెలుగు” అన్న మూడక్షరాలు వినగానే కాజిం అలి హృదయం పసిపిల్లాడిలా కేరింతలు కొట్టింది, అతని హైదరాబాదీ బాల్య జ్ఞాపకాలు గుర్తుకొచ్చి. వొక ఆదివారం మధ్యాన్నం ఆస్టిన్ లోని “బార్న్స్ అండ్ నోబల్స్” పుస్తకాల షాపులో నాకు ఎంతో ఇష్టమయిన కొబ్బరి ముక్కలు తురిమిన కాఫీ తాగుతూ మొదటి సారి కాజిం అలి కవిత్వం చదివాను. ఆ కాఫీ రుచికీ, కాజిం అలి కవిత్వానికి కాస్త చుట్టరికం వుంది. కొబ్బరి ముక్కా, కాఫీ రెండూ భిన్నమయిన రుచులు. కొబ్బరి ముక్క [...]
పూర్తిగా చదవండి

ప్రవక్త లేని ప్రపంచం

అనువాదాలు, కవితలు ఎన్.వేణుగోపాల్
ఉర్దూ మూలం : మజర్ మెహదీ ఈ ప్రపంచం ఇతర ప్రపంచాల కన్నా భిన్నంగా ఎప్పుడుంది? అవే జలపాతాలు అవే ఆకుపచ్చని లోయలు అవే భుజాలవంటి కొమ్మలున్న చెట్లు భూమిలోపలి నుంచి ఉబికి ఉబికి ఉవ్వెత్తున చిమ్ముకొని వచ్చే ఊటలు పర్వతాలు అవును వీటికి కూదా దిశానిర్దేశం కావాలి రుచీపచీలెని నీళ్ళు ఈదప్పిని తీర్చలేనని నీటికి తెలుసా! ఒకయాంత్రిక సంప్రదాయానికి అలవాటుపడ్డాం ఈ పిల్ల తెమ్మరలకు పూలను ముద్దాడె వయ్యారం తెలియదు ఈ పూలు గాలి నిర్దేశించినట్లు తలూపుతాయి అడవుల్లో పూలచెట్ల మొదళ్ళన్నీ టెంటు స్తంభాలుగా నిలిచి వుంటాయి అంతే కాదు వాటికి తమ సుగంధాల సంగతీ తెలియదు ఈ పర్వతాలు తమ విలువలేని [...]
పూర్తిగా చదవండి

పాలస్తీనా

అనువాదాలు, కవితలు నాగరాజా
మూలం: లీసా సుహైర్ మజాజ్ మీ కళ్ళు నేల మీదే ఉండాలి సుమా నేల మీది రాళ్ళను మాత్రం చేతుల్లోకి తీసుకోకండి జట్లు కట్టి గెంతులాడి రాళ్ళందుకోవద్దందామె పక్కవాళ్ళను గురించి పట్టించుకోవద్దు వాళ్ళబ్బాయిని నిన్న రాత్రి అరెస్ట్ చేశారు చాకలి కొట్టును దాటొద్దు, పక్కలను చక్కబెట్టండి గోడ మీది రాతల పై సైనికుల దృష్టి పడకముందే తుడిచేయండందామె అయ్యో ! బూట్లూ బిగ్గరయి పోయాయా! మన దగ్గర డబ్బులు లేవు మడమలను కోసేయండి ఈ పూటకు మనం తినేదే తిండి మళ్ళీ రేపటి దాక తినడానికి ఇంకేం దొరకదు నారింజలా ? మన దగ్గర నారింజ [...]
పూర్తిగా చదవండి

పరిచయం

అనువాదాలు, కవితలు నాగరాజా
మూలం: కమలా(దాస్‌) సురయ్యా తెలుగుసేత: పసుపులేటి గీత నాకు రాజకీయాల గురించి ఏమీ తెలీదు, కానీ గద్దెనెక్కిన వాళ్ళ పేర్లు తెలుసు వారాల పేర్లు చెప్పినట్టు, నెలల పేర్లు చెప్పినట్టు, నెహ్రూ నుంచి మొదలుపెట్టి అందరి పేర్లనీ అప్పజెప్పగలను నేను భారతీయురాల్ని, మలబార్లో పుట్టాను, మేనిరంగు చామనఛాయ, మూడుభాషలు మాట్లాడగలను అందులో ఒకటి కలల భాష, మిగతా రెండింట్లో రాయగలను నన్ను ఇంగ్లిష్‌లో రాయవద్దన్నారు, అది నా మాతృభాష కాదన్నారు బంధుమిత్రులు, విమర్శకులు, ఆ మాటకొస్తే మీలో ప్రతి ఒక్కళ్ళూ… నా మానాన నన్నెందుకు బతకనివ్వరు? నాకిష్టమైన భాషలో నన్నెందుకు మాట్లాడనివ్వరు నేనేది మాట్లాడితే అదే [...]
పూర్తిగా చదవండి

మంచీ-చెడూ

అనువాదాలు, కవితలు ఎన్.వేణుగోపాల్
మూలం: వైరముత్తు, అనువాదం: ఆర్‌. శాంతసుందరి నీతి వాక్యాలు వల్లించిన తొలిభాష ఏది? తమిళమా? చైనీసా?? లాటినా? గ్రీకా? కాదు…అవేవికావు… ప్రకృతి తన నుదుటిబాధ.. కనుబొమల మీద కళ్లలో…బుగ్గల్లో ఛాతిమీద…బాహుమూలాలలో రాసి ఉంచిన నీతినే తన భాషలోకి అనువదించాడు మనిషి పైకెగబాకుతూ మండుతోంది జ్వాల- పైకిమొలకెత్తుతుంది విత్తనం- పైపైకే ఎగసిపోతుంది మబ్బు- పైకే పెరుగుతాడు మనిషి- అంతా పైపైకే… కాని కిందికి పడుతుంది అది……..కందిలి కురియకపోతే మరి పైకి పెరిగేది ఈభూమిలో ఏది? వాన అన్నది- “కరుణ కలిగినవాడే ప్రాణులన్నిటికే నాయకుడిగా ఉంటాడు.” తీరం మేలుకుని ఉందా? నిద్రపోతుందా ? తెలీదు. పాడడం తెలిసినపక్షులు తమ పాటలకి తామే చప్పట్లుకొడుతాయా?తాళం వేస్తాయా? తెలీదు. మాతృభాషే రానిమనుషులకి తమ పాట అర్థం అవుతుందా?అవదా? తెలీదు. కానీ గులకరాళ్లని నోట్లో వేసుకుని నది పాడుతూనే ప్రవహిస్తుంది నది కూడా ఒక గీతావాక్యం చెప్పింది “కర్తవ్యాన్ని నిర్వహించు ఫలితం కోసం [...]
పూర్తిగా చదవండి

ప్రారంభం (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

అనువాదాలు, ప్రారంభం (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం) కవిత్వం, సాహిత్యం... నాగరాజా
"నేనెక్కడి నుండి వచ్చాను? నేను నీకు ఎక్కడ దొరికానూ?" పాపాయి అమ్మనడిగింది.పాపాయిని గుండెలకదుముకొని" నీవు నా హృదయంలో దాని వాంఛై ఉండినావు చిన్నారీ"నవ్వుతూ, కనులనీరు నించుకుంటో అమ్మ బదులిచ్చింది.నీవు నా బాల్యపు ఆటలలో బొమ్మవై ఉండే దానవు.ప్రతి ఉదయమూ నా దేవుని ప్రతి రూపాన్ని మట్టితో చేసే దానిని.అపుడే నిన్ను కూడా తయారు చేసి చేజార్చుకొనే దానిని.మా కులదైవంతో సమానంగా నీకు కొలువుండేది.ఆతని పూజలో నిను సేవించే దానిని.నా అన్ని ఆశలలో, ప్రేమలలో, జీవితంలో, నా తల్లి జీవితంలో నీవు సంచరించావు.మా ఇంటిని పాలించే అమృతమూర్తి ఒడిలో నీవు అనాదిగా సాకబడుతున్నావు.కౌమార్యంలో నాహృదయం తన రేకలు విచ్చుకొన్నప్పుడునీవు దాని సుగంధానివై పరిమళించావు.నీ సౌకుమార్యం నా యవ్వనాంగాలలో వేకువవెలుగులా వికసించింది.స్వర్లోకపు ఆదిమ సఖి, ఉదయకాంతికి సహోదరివి అయిన నీవుఈ ప్రపంచ జీవన వాహినిపై తేలియాడ దిగివచ్చావు,చివరకు నాహృదయానికి చిక్కావు.నిన్నలా తేరిపార చూస్తే రహస్యమేదో ముంచెత్తుతుంది.అందరకూ చెందిన నీవు నాకే సొంతమైనావు.ఏ ఇంద్రజాలం ...
పూర్తిగా చదవండి

గాలిలో జవాబు తేలివస్తోంది విను!

అనువాదాలు, కవితలు ప్రాణహిత
- బాబ్ డిలాన్ ఎన్నెన్ని బాటలు నడవాలి మనిషి మనిషిగా నిలిచేందుకు? అవును, మరెన్ని సముద్రాలీదాలి గువ్వలు ఇసుక తిన్నెలమీద రెక్క వాల్చేందుకు? అవును, ఎన్ని సార్లు పేలాలి మరఫిరంగులు అవి ఇంక శాశ్వతంగా రద్దయిపోవడానికి?
పూర్తిగా చదవండి

ద పోస్ట్ మాన్

అనువాదాలు, ద పోస్ట్ మాన్, ప్రపంచ సాహిత్యం ఎన్. వేణుగోపాల్
- ఆంటోనియో స్కార్మెటా (తెలుగు: ఎన్ వేణుగోపాల్) కావడానికి అవి అంత ప్రాముఖ్యం లేని సంగతులే గాని వాటి ఫలితంగా మారియో హిమేనెజ్ జీవితం కొత్త పుంతలు తొక్కింది. అదృష్టం కొద్దీ ఆ పరిస్థితులవల్లనే జూన్ 1969లోమారియో కొత్త ఉద్యోగంలో కుదురుకోవలసి వచ్చింది. మారియోకు చేపలుపట్టడం అంటే మాచెడ్డ చిరాకు. నిజం చెప్పాలంటే తెల్లవారకముందే పక్కమీదినుంచి లేవడమంటే మరీ చిరాకు. అవును గదా, తెలతెలవారేటప్పుడు నిద్ర ఎంత మజాగా ఉంటుంది! అప్పుడేగదా శాన్ ఆంటోనియో మూవీ థియేటర్ లో తెరమీద [...]
పూర్తిగా చదవండి

అపరాజిత 7: కన్నీటి జాడల్లో

అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం మేరీ బ్రేవ్ బర్డ్; అనువాదం: మమత
1972 వేసవి చివరలో రోజ్ బడ్ లో సూర్యనృత్యం (సన్ డాన్స్) నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎ.ఐ.ఎమ్. లీడర్లు చాలా మంది సూర్యనృత్యంలో పాల్గొనడానికి క్రౌడాగ్ దగ్గరికి వచ్చారు. పవిత్ర పొగ గొట్టంతో ప్రార్థనలు చేస్తూ, గద్ద ఎముకతో చేసిన ఈల  వూదుతూ, సూర్యుడి వైపు చూస్తూ, ఆచారం ప్రకారం తమకు తాము నొప్పి కలిగించుకుంటూ మా జాతి చాల పవిత్రం అని భావించే సూర్య నృత్యంలో మమేకమయి పాల్గొన్నారు అందరూ.
పూర్తిగా చదవండి

అపరాజిత 6: జీవితానికి అర్థాన్నిచ్చిన ఎ.ఐ.మ్

అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం మేరీ బ్రేవ్ బర్డ్; అనువాదం: మమత
వాళ్లు మమ్మల్ని కొత్త ఇండియన్లంటున్నారు. కానీ, మేము పాత ఇండియన్లమే. ఈ ఖంఢానికి అసలు సిసలు వారసులం. అద్దె వసూలు చేసుకోవడానికి వచ్చాం. - డెనిస్ బ్యాంక్స్ (ఏ. ఐ. ఎమ్ నాయకుడు) అమెరికన్ ఇండియన్ ఉద్యమం మా రిజర్వేషన్ ను పెద్ద గాలి దుమారంలా చుట్టుముట్టింది, ఎక్కడి నుంచో కొత్త గాలిలా మమ్మల్ని స్పృశించింది. రాను రాను దగ్గరవుతున్న డప్పు మోతలా మమ్మల్ని తాకింది.
పూర్తిగా చదవండి

వెచ్చని మనసులు

అనువాదాలు, మార్చి 2008 కొల్లూరి సోమ శంకర్
అలా ఒకరికొకరు దగ్గరగా కూర్చుని ఆ స్పర్శలోని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ చాలా సేపు మౌనంగా ఉండిపోయారిద్దరూ.
పూర్తిగా చదవండి

అనువాద శంకరుడు

2008, అనువాదాలు, గడి admin
కతల్జెప్పినంత తేలిగ్గాదు కథలు అనువదించడం. మూలంలోని అర్థం పోకుండా, భావం చెడకుండా, “నేను మా ఆవిడ చేత కొట్టబడ్డాను” లాంటి అవకతవక మాటలు రానీకుండా ఇంపుగా సొంపుగా అనువాదం చెయ్యడమంటే మాటలు కాదు.అనువాదపు కిటుకులు తెలిసిన రచయిత కొల్లూరి సోమశంకర్ గారు. 44 అనువాద కథలు రచించిన అనుభవంతో అనువాదాలు చెయ్యడంలోని <a href=”http://poddu.net/?p=480″>సాధక బాధకాలను</a> వివరిస్తున్నారు. ఒక నెల తరువాత మళ్ళీ <a href=”http://poddu.net/gadi/crossword.php”>గడిని</a> మీముందుకు తెస్తున్నాం. సమయానికి గడి తీసుకురాకపోయినా, తెచ్చిన గడి మెచ్చేలా [...]
పూర్తిగా చదవండి

ప్రజాస్వామ్యం

అనువాదాలు, కవితలు ప్రాణహిత
- లాం గ్స్టన్ హ్యూస్ ఇవాళ్ళ గానీ రేపు గానీ ప్రజాస్వామ్యం భయమూ రాజీల ద్వారా రాదు
పూర్తిగా చదవండి

తోడేలు

అనువాదాలు, కథలు, ప్రపంచ సాహిత్యం ఫారుఖ్ సర్వర్-అను:డా||దేవరాజు మహారాజు
కొంతకాలంగా నేనొక చెట్టుమీద తలదాచుకున్నాను. అక్కడ అలా ఉండి ఉండి విసిగిపోయాను. ఇప్పుడిక కిందికి దిగి రావాలని ఉంది. కాని నేల మీద నాకోసం తోడేలు కూచుని ఉంది. నా వైపు గుర్రుగా చూస్తూ ఉంది. నేనెప్పుడు కిందికి దిగుతానా నా మీద పడి ఎప్పుడు చీల్చి చెండాడుదామా అని, అది ఎదురు చూస్తోంది. ఈ చెట్టు విచిత్రమైనంది.
పూర్తిగా చదవండి

అద్యాయం5: గమ్యం లేని ప్రయాణాల కాలం

అనువాదాలు, ప్రపంచ సాహిత్యం మేరీ బ్రేవ్ బర్డ్ - అనుసృజన - మమత
నేను చాలావరకు ఒంటరిగా వుండేదాన్ని. బట్టలు , మేకప్ , పర్ఫ్యూమ్ వంటి వస్తువులు  చాలామంది అమ్మాయిలు ఇష్టపడినంతగా నన్ను ఆకర్షించేవి కావు. తెల్లవాళ్లంటే భయంవల్ల , జంకువల్ల వారితో ఎక్కువగా కలిసేదాన్ని కాదు. సంకరజాతి వాళ్లతో నూ  బాగా కలువలేక  పోయేదాన్ని. ఫుల్ బ్లడ్స్ నన్ను ఇష్టపడరేమోనని భయపడేదాన్ని. అమ్మ అభిప్రాయాలతో ఏకీభవించలేకపోయేదాన్ని.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS