చాన్నాళ్ళకు వికీపెడియా చూస్తున్నా. మడ్డిగా ఉన్న మొదటి పేజీ కాస్తా మొహం కడుక్కొని చక్కగా ముస్తాబయ్యింది..మీరే చూడండి ఒక్క సారి: http://te.wikipedia.org/wiki/మొదటి_పేజీ
ఈ వర్గీకరణ కొత్తవారికి సులభంగా మార్గనిర్దేశనం చేస్తుందని అనిపిస్తోంది.
ఇలా వర్గీకరణ చేసి మొదటి పేజీ తయారు చేసిన ధీరులు, శూరులెవ్వరో నాకు వెంటనే తెలియాలి, ఎందుకంటే వెంటనే వారికి వీరతాళ్ళు వేసుకోవాలిగా మరి. (వైజా సత్య..ఈ ఘనకార్యం తమరిదేనా?)
పూర్తిగా చదవండి
చిన్నప్పుడు రెండవ తరగతిలో ఉండంగా బడి వార్షికోత్సవానికి మా చేత కొన్ని పాటలు పాడించి, నాటకం వేయించాలనుకున్నారు. దాని కోసం నేను, ప్రసాదు, ప్రశాంతు, రెడ్డెప్ప, వెంకటేశ్వర రెడ్డి, సునిత, ఇంకొందరు ఐవోర్లు, మిద్దె పైకి వెళ్ళి సాధన చేస్తున్నాము. ఇంతలో ఎందుకో మిద్దె పైన నుంచి క్రిందకు చూచాను. మా అమ్మ నాన్న కలసి బడి లోపలికి వస్తున్నారు. ఇద్దరినీ బడిలో చూడటం అదే మొదటి సారి. ఆనందమో..ఆశ్చర్యమో….వెంటనే కళ్లలో నుంచి నీళ్ళు వచ్చేశాయి. [...]
పూర్తిగా చదవండి
ఆశ్చర్యం..ఇప్పుడే వేమన మీద ఒక వ్యాసం వ్రాస్తున్నాను. అనుకోకుండా తెలుగుపీపుల్ లో ఈ వ్యాసం తగిలింది. అందుకే ఆలస్యం చెయ్యకుండా బ్లాగేస్తున్నా.
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=62493&page=1
మాటలను కొరడా చేసి కొట్టడమంటే ఏమిటో వేమన పద్యాలను చదివితే అర్థమయ్యింది. కులం, మతం, ఆచారాలు, పురుషులు, స్త్రీలు, యోగులు, మూఢులు, దుర్జనులు ఇలా ఒకటేమిటి …అన్నింటినీ ఏకిపారేశాడు.
_________________________________________________________________
35% తాజాదనం ( ఏమిటిది? )
పూర్తిగా చదవండి
ప్ర) నవీన్ గారు ఏమిటి ఈ రోజు విశేషం?
జ) నేను కూడా 10,000 క్లబ్బులో చేరానోచ్…..అంతే కాదు ఈ రోజు అత్యధికంగా 200 మంది పైన దర్శించారు నా బ్లాగుని
ప్ర) ఆ …ఐతే ఏంటట..దేశానికి సెలవప్పించమంటారా?
జ) అంత ఎటకారం ఎందులే…ఏదో సినిమాలు వంద రోజుల పండగ చేసుకొన్నట్టు మనమూ పండగలా కాకపోయినా….ఈ 10,000ల నంబరు నేను బ్లాగారంభ శూరుణ్ణి కానని చెబుతుందిన్న మాట..అర్థమైందా?
ప్ర) సంతోషం..అర్థమైంది…ఈ తొమ్మిది నెలలు బ్లాగి ఏమి పీగ్గలిగారు?? అదే ఏమి [...]
పూర్తిగా చదవండి