Can't see Telugu? Learn here. More Questions? Ask here.

చావా కిరణ్, నీకు జన్మదిన శుభాకాంక్షలు

అభిప్రాయం gsnaveen
కిరణ్, ఆ దేవుడు నీకు మరియు నీ కుటుంబానికి సదా ఆనందారోగ్యైశ్వర్యాలు కలుగజెయ్యాలని కోరుకొంటున్నాను. —— నాకు తెలుగాభిమానం మెండు. స్నేహితులకు 2002 నుంచే తెలుగుకు సంబంధిచిన మెయిల్స్ పంపేవాడిని. అవన్నీ దినపత్రికల బొమ్మలు (Screen Shots). అది తప్ప నాకు వేరే మార్గం తెలియదు. తరువాత ప్రవీణ్ గార్లపాటి పరిచయం చేసిన PrimoPDF ఉపయోగించి తెలుగు పి.డి.యెఫ్ లు పంపడం మొదలు పెట్టాను. ఏమి పంపినా, ఎంత పంపినా జవాబులు రావు…స్నేహితులు నేను పంపేవి చదువుతారో లేదో తెలియదు. [...]
పూర్తిగా చదవండి

మన జాతి ఆత్మపై దాడి

అభిప్రాయం gsnaveen
మీరు కొత్త్గాగా విడుదల ఐన (2006) రెండు రూపాయల నాణేన్ని చూశారా? ఇది 2000 సంవత్సరంలో విడుదలైన రెండు రూపాయల నాణెం కంటే చాలా భిన్నంగా ఉంది. ప్రస్పుటంగా కనిపించే రెండు మార్పులు ఏమిటంటే.. 1) పెద్దగా ఉన్న అశోకుని సింహం గుర్తు చిన్నబోయింది. “సత్యం ఏవ జయతే” అన్న వాక్యాన్ని చదవటానికి మీకు భూతద్దం అవసరం. 2) భారతదేశం చిత్రం మాయం అయ్యింది. దాని స్థానంలో “శిలువ” వచ్చింది. ఎక్కువగా కలవరపెట్టేది రెండవ అంశమే. పూర్తి వ్యాసాన్ని ఇక్కడ చదవండి: http://www.newstodaynet.com/2007sud/mar07/210307.htm కొన్ని [...]
పూర్తిగా చదవండి

ర్యాగింగ్ భూతమా?

అభిప్రాయం gsnaveen
ర్యాగింగ్ భూతమా? కానే కాదు, అదో వరం (సీనియర్లకు). ర్యాగింగ్ నిరోధించడానికి ప్రభుత్యం / కోర్టులు ఇంతలా చర్యలు తీసుకోవడం విచారకరం. దీనికి బదులుగా ఎంత మేరకు ర్యాగింగ్ చేసుకోవచ్చో కాలేజీ వాళ్ళే నియమ నిబంధనలను ఏర్పర్చాలి. సీనియర్లు మొదటి రోజే “సున్నిత మనస్కులని” గుర్తించి వారిని ర్యాగింగ్ చెయ్యకుండా బహిష్కరించాలి. ఇలా చేస్తే ఏ ఇబ్బంది లేకుండా ర్యాగింగ్ హాయిగా సాగిపోతుంది.
పూర్తిగా చదవండి

ఆర్వరీ నదీ పార్లమెంటు

అభిప్రాయం gsnaveen
నీటి విలువ తెలిసిన మరియు తెలియని ప్రతి ఒక్కరు చదవ వలసిన వ్యాసం ఇది.  ఆదివారం స్పెషల్ గా కాకుండా, దీన్ని అన్ని పత్రికల మొదటి పేజీలో ప్రచురించి ఉంటే ఇంకా సంతోష పడేవాణ్ణి. కష్టపడి ఒక జీవనదిని సృష్టించుకొన్న పల్లెవాసుల మీద అభినందనల మాలలు వెయ్యాల్సింది పోయి…కర్కశంగా కష్టాలపాలు చేసిన రాజెస్థాన్ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ నిరశించాలి.
పూర్తిగా చదవండి

రజనీ ”’శివాజి”’

అభిప్రాయం gsnaveen
ఈ రోజే మన సూపర్ స్టార్ (తప్పు తప్పు…తమిళ సూపర్ స్టార్) రజనీ ”’శివాజి”’ పాటలు విన్నాను (http://nonstopcinema.com/audio/sivaji/). వింటూంటే రెహమాన్ ను చెట్టుకు కట్టేసి కొడదామనిపించింది. తరువాత పాటల సాహిత్యాన్ని ఏ మాత్రం అర్థం అయ్యే అవకాశం లేకుండా అత్యంత చండాలంగా వ్రాసిన ప్రభావమేమో అనిపించింది. ఏంటో ఈ తమిళ డబ్బింగ్ సినిమాలలోని పాటల సాహిత్యం విచిత్రంగా ఉంటుంది. మొత్తానికి ఈ సినిమా డిస్టిబ్యూటర్ల క్రింద, 60యేళ్ళు పూర్తి చేసుకొంటున్న ఏ.వి.ఎం సంస్థ క్రింద పెద్ద [...]
పూర్తిగా చదవండి

ఆట సినిమాలోని పాట

అభిప్రాయం gsnaveen
…………… ఆ కన్నుల్లో కొలువయ్యేందుకు నీలాకాశం వాలదా!!! ఆ గుండెలల్లో లోతు కొలిచేందుకు సంద్రం సెలయేరైందిరా!! …………. ”’ఆట”’ సినిమాలో పాట ఇది…… వ్రాసింది [[సీతారామశాస్త్రి]].. ఆయన ప్రతిభ, ఊహా శక్తి గురించి వ్రాసేందుకు నా భాష చాలడం లేదు మొత్తానికి ఈ సినిమాలో పాటలు చాలా బాగున్నాయి .
పూర్తిగా చదవండి

లలితగారి వ్యాఖ్యకు నా ప్రతి వ్యాఖ్య

అభిప్రాయం gsnaveen
ముందు ఈ టాపా చదవండి. ప్రతివ్యాఖ్య: మన వేదాలలో చెప్పిన వాటికీ ఎందుకు సామ్యాలు చూపించెయ్యడం? లలితగారు, వేదాల్లో (ఆ మాటకొస్తే పురాతన పుస్తాకాలు కూడా) ఉన్న మాటల్ని అంత తేలిగ్గా కొట్టి పారెయ్యకండి. ఇది “మనం అప్పట్లోనే ఇంతకన్నా గొప్పగా ఉండే వాళ్ళమన్నమాట” అని రుజువు చేసుకొనే ప్రయత్నం కాదు. ఆ వ్రాతల్నిబట్టి అప్పటి నాగరికత పరిపక్వత గురించి తెలుసుకొనే ప్రయత్నం. ఉదాహరణకు ఒక శ్లోకంలో “భూగోళం” అని వ్రాసుందనుకొందాము. అంటే…ఆ శ్లోకం వ్రాసిన సమయంలోనే వారికి భూమి గోళాకారంలో [...]
పూర్తిగా చదవండి

ఇది ఫార్వర్డ్ చెయ్యండి డబ్బులొస్తాయి (?)

అభిప్రాయం gsnaveen
రాధికగారు తెలియని తెలుగు బ్లాగర్లు ఉండరేమో. ఉత్తమ బ్లాగర్ల పోటీ ఉన్నట్టే…ఉత్తమ వ్యాఖ్య అనో లేక ఉత్తమ కవిత అనో పోటీ ఉంటే తప్పకుండా రాధిక గారు ఆ అవార్డు గెలుచుకొంటారు. రాధిక గారి వ్యాఖ్యకు నోచుకోని తెలుగు బ్లాగున్నదా? నాకు తెలిసి లేదు. ఇప్పుడు అసలు విషయానికొస్తా…అదేదో బ్లాగులో రాధిక గారు ఈ విషయాన్ని అడిగినట్లు గుర్తు. “నాకు కళ్ళు పోయాయి….నాకు కిడ్నీలు పాడయిపోయాయి …ఇది ఫార్వర్డ్ చెయ్యండి డబ్బులొస్తాయి. ఒక్కొక్క మెయిల్ ఫార్వర్డ్ కు ఒక్కొక్క [...]
పూర్తిగా చదవండి

రేపు రాష్ట్ర బంద్‌ అంట

అభిప్రాయం gsnaveen
వార్త: కోటాపై స్టేకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర బంద్‌ వ్యాఖ్య: యెదవలకు పనీ పాటా లేకపోతే సరి. కుల ప్రాతిపదికన రిజర్వేషన్ అనే ముండ మోపి బిల్లును సుప్రీమ్ కోర్టైనా ఆపిందిరా (స్టే) అనుకొంటే….ఈ బేవార్సు రాజకీయ నాయకులు బంద్ అని ఇదని తెగ గోల పెడుతున్నారు. ధర్మాసనమిచ్చిన తీర్పును గౌరవించలేని వీళ్ళు నాయకులేనా? నా స్నేహితుడికి EAMCETలో 200లోపల ర్యాంకు వచ్చింది. వాడి మెరిట్ కు తగిన విధంగా RECలో Electronics & Communications శాఖలో సీటు వచ్చింది. [...]
పూర్తిగా చదవండి

పీడా వదిలిపోయింది!!

అభిప్రాయం gsnaveen
నాకు క్రికెట్ బొత్తిగా ఇష్టం లేదు….నేను చూడను కూడా………కాకుంటే మా రూమ్ మేట్స్ రోజూ అర్థ రాత్రి దాటేంత వరకు టీ.వీ పెట్టి నన్ను నిద్రపోనీకుండా…ఇతర తెలుగు ఛానెల్స్ చూడనీకుండా చేసేవారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూసి వికటాట్టహాసం చేయాలనుంది………………. హ్హ హ్హహ హ్హ్హహ హ్హహ్హహ్హ్హహ హ్హ్హ పొద్దున్నే అందరూ “రేపు ప్రపంచం అంతం కాబోతోందట” అని వార్త విన్న వాళ్ళ మాదిరి ముఖాలు వేలాడదీసుకొని ఉంటే భలే నవ్వొచ్చింది :) ఏ ఇద్దరు కలిసినా చాలు …”మామా దారుణం [...]
పూర్తిగా చదవండి

వృద్దాప్యం?

అభిప్రాయం gsnaveen
వృద్దాప్యం కూడా అచ్చు బాల్యం లాంటిదే….కాకుంటే దశలన్నీ వ్యతిరేకంగా ఉంటాయి. చిన్న బిడ్డ, తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తే.. వృద్దుడు పుడమి తల్లి గర్భానికి చేరుకొంటాడు చిన్న బిడ్డకి మాటలు రావు వృద్దునితో ఎవ్వరూ మాట్లాడరు చిన్న బిడ్డకి రోగాలు తేలిగా వస్తాయి వృద్దునికి ఓ పట్టన రోగాలు వదలవు చిన్న బిడ్డను లాలిస్తుంన్నప్పుడు ఉచ్చ పోస్తే ఛీ ఛీ..కుట్టీ అంటారు వృద్దుడు మంచంపై ఉచ్చ పోస్తే..ఇదేమి ఖర్మమో అనుకొంటారు చిన్న బిడ్డతో మాట్లాడటానికి, ఆటాడుకోవటానికి అందరూ పోటీ పడతారు వృద్దుడు ఎప్పుడూ ఒంటరే…మాట్లాడితే చాదస్తం అంటారు చిన్న బిడ్డను గుండెలపై తన్నించుకొంటూ [...]
పూర్తిగా చదవండి

మీకు ఎన్ని పన్నులున్నాయో తెలుసా (32 కన్నా ఎక్కువే)

అభిప్రాయం gsnaveen
రాచరిక కాలంలో… పన్నులతో జేబులు ఖాళీ చేయడంలో ఔరంగజేబు చరిత్ర సృష్టించాడు. సృజనాత్మకతకు పదునుపెట్టి కొత్తకొత్త పన్నులు వేశాడు. జుట్టు పెంచితే పన్ను… గర్భిణిలపై పన్ను! ఆ సృజనాత్మకత ఆయనతోనే ఆగిందా! ప్రజలే ప్రభువులుగా, నేతలు సేవకులుగా కీర్తినొందిన మన ప్రజాస్వామ్యంలో సేవకులు, ప్రభువులకు చేసే వడ్డింపుల్లోనూ ఎంతో సృజనాత్మకత! పన్ను, సుంకం, ఛార్జీ, రుసుము, డ్యూటీ, సెస్‌.. పేరేదైతేనేం పిండుకోవడమే పరమార్థం. సొంత డబ్బుతో మోటర్‌ సైకిల్‌ కొంటే… దానిపై జీవితకాల పన్ను. బయట తిప్పినందుకు రోడ్డు పన్ను. [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS