Can't see Telugu? Learn here. More Questions? Ask here.

District 9 (2009)

featured, lead, అమెరికా, ప్రపంచ సినిమా, సమీక్ష నాగరాజా
పీటెర్ జాక్సొన్(Lord of Rings fame) నిర్మాణంలో, నీల్ బ్లొకెంప్ మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన సినిమా District 9. ఇది ఒక socio-political message తొ కూడుకున్న కథాంశం. కథ లోకి వెళ్తే ఒక స్పేస్ షిప్ దక్షిణాఫ్రికా లోని జొహన్స్ బర్గ్ కి రావడం తో కథ ప్రారంభం అవుతుంది. ఇందు లో ప్రాన్స్ అనబడే గ్రహాంతరవాసులు చాలా దుర్భర పరిస్థితుల్లో చిక్కుకుని వుంటారు. ప్రపంచ దేశాక ఒత్తిడికి లొంగి దక్షిణాఫ్రికా ప్రభుత్వం గ్రహాంతరవాసులకి ఒక షెల్టెర్ [...]
పూర్తిగా చదవండి

Inglourious Basterds – మరోసారి

featured, lead, అమెరికా, ప్రపంచ సినిమా, సమీక్ష సౌమ్య
టరంటినో గురించి వినడమే కానీ ఎప్పుడూ అతని సినిమాలు చూడలేదు ఇప్పుడు మొదటిసారి చూసిన సినిమా – “Inglourious Basterds”. సినిమా మొత్తంగా బానే ఉంది. నిజానికి నాకు నచ్చింది. అయితే, హైపెక్కువవడం వల్ల నేను కాస్త నిరాశపడ్డాను అనే చెప్పాలి. నన్ను అడిగితే మంచి సినిమా అని చెప్తాను కానీ, అద్భుతమైన సినిమా అనను. (స్పాయిలర్లు కలవు) కథ: హిట్లర్ కాలం నాటి కథ. మొదటి సీనులో – “Jew Hunter” గా ముద్రపడ్డ నాజీ – Hans [...]
పూర్తిగా చదవండి

Inglourious Basterds రివ్యూ

featured, lead, అమెరికా, ప్రపంచ సినిమా, సమీక్ష నాగరాజా
Chapter 1 – The Jew Hunter బ్రాడ్ పిట్ కథానాయకుడయినా అమితంగా ఆకట్టుకునేది Christoph Waltz. జర్మనీ పాలిత ఫ్రాన్సులోని యూదులను మట్టుపెట్టే ఈ డిటెక్టివ్ పాత్రకు తగిన నటుడు దొరక్కపోతే సినిమా తీయకూడదు అనుకున్నానని టరంటినో ఎందుకన్నాడో సినిమా చూస్తే తెలుస్తుంది. స్వతహాగా ఇంగ్లీషు, జర్మన్, ఫ్రెంచ్ భాషలు అనర్గళంగా మాట్లాడే వాల్ట్జ్ మొదటి చాప్టర్లో నవ్వుతూ పెద్దమనిషి తరహాలో మాట్లాడుతూ నెమ్మదిగా తన విశ్వరూపం చూపుతాడు. తర్వాతి చాప్టర్లలో వాల్ట్జ్ కనిపించాడంటే ఇప్పుడు ఏమి [...]
పూర్తిగా చదవండి

Inherit the wind (1960)

featured, lead, అభిప్రాయాలు, అమెరికా, ప్రపంచ సినిమా, సమీక్ష సౌమ్య
మొదట నాకు ఈ సినిమా కథతో పరిచయమైన సందర్భంతో మొదలుపెడతాను. లాంగ్ వీకెండ్, హోమ్ అలోన్ – అలాంటప్పుడే జైఅర్జున్ అనబడు jabberwock బ్లాగును చూస్తూ ఉంటే ఈ టపా కనిపించింది. ఈ సినిమా స్కోప్స్ ట్రయల్ (Scope’s trial of 1925) ఆధారంగా తీశారని తెలిసి, కుతూహలం పెరిగింది. ఆమధ్య ఓరోజు కార్టూనింగ్ ఎవల్యూషన్ వెబ్సైట్లో డార్విన్ సిద్ధాంతంపై కార్టూన్లు చూస్తూ ఉంటే, స్కోప్స్ ట్రయల్ గురించి తెలిసింది. అలా ఓ రెండ్రోజులు ఆ ఉదంతానికి [...]
పూర్తిగా చదవండి

అమెరికా లో రైతు బజార్లు

Uncategorized, అమెరికా, రైతు బజార్లు నాగరాజా
ఆర్థిక మాంద్యం పుణ్యమా అని అమెరికా,కెనడా దేశాల్లో రైతు బజార్లు కళకళలాడుతున్నాయట. చేతిలో కాసులు గల గల లాడుతుంటే మాల్స్, సూపర్ మార్కెట్ల వైపు పరుగులెత్తిన అమెరికా జనం పొదుపు తప్పని సరి కావడంతో వీటి వైపు మళ్ళుతున్నారట. ఎంతో మంది మేథావులు ఎన్నో సమస్యల మీద అధ్యయనం చేస్తున్నారు. వ్యాపారంలో మధ్యవర్తుల  మూలంగా ఎంత మంది రైతులు నష్టపోతున్నారో వారికి తెలియంది కాదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎవరు పూనుకుంటారో? మనదేశంలో రైతులకు అలా మంచి రోజులెప్పుడొస్తాయో? అలా వస్తే మాత్రం [...]
పూర్తిగా చదవండి

స్వచ్చమైన ప్రేమ (మీ హృదయాన్ని కదిలించే కథ)

stories, అమెరికా ravichandrae
అమెరికాకు చెందిన ఒక సైనికుడు వియత్నాంలో యుద్ధం ముగించుకుని తన స్వస్థలానికి  తిరిగి వస్తున్నాడు.దారిలో   వస్తూ వస్తూ  తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. “అమ్మా, నేను ఇంటికి వస్తున్నాను.ఈ సందర్భంగా మిమ్మల్ని ఒక కోరిక కోరాలనుకుంటున్నాను్.” “ఏంటి బాబూ అది?” ” నా కొక  స్నేహితుడున్నాడు. వాడిని నాతో పాటు తీసుకురావచ్చా?” “దానికేం భాగ్యం. అలాగే తీసుకుని రా బాబూ. నేనూ మీ నాన్న నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాం” “కానీ మీరు ఇంకొక విషయం కూడా తప్పకుండా తెలుసుకోవాలి. నా [...]
పూర్తిగా చదవండి

హారీ పాటర్ చూశాక నాతో నేను.

Harry Potter and the half blood prince, Harry potter, english movie, featured, lead, అమెరికా, ఇంగ్లండ్, ప్రపంచ సినిమా, సమీక్ష నాగరాజా
హారీ పాటర్ మరియు అర్ద కులీన రాజకుమారుడు సినిమా చూశాను. అవునా? ఆలాంటి పేరెప్పుడూ వినలేదే? అదేలేవోయ్, హారీ పాటర్ అండ్ హాఫ్ బ్లడ్ ప్రిన్స్ కు నా తెలుగు సేత ఏడ్సినట్టుంది. ఏంటి సినిమానా ? కాదు, నీ తెలుగు సేత. అయినా సినిమా చూసింది నువ్వు కదా, ఏడ్సినట్టుందో, నవ్వినట్టుందో నువ్వే చెప్పాలి కదా. అవునూ ఇంతకీ సినిమా తెలుగులో చూశావా ? ఇంగ్లీషులోనే చూశా! మరి తెలుగులో సేతడమెందుకో? తెల్దా? స్టైలు. అవునా? ఎక్కడ? బ్లాగుల్లో! హ హ హ . ఇంతకీ సినిమా తెలుగులో ఎందుకు [...]
పూర్తిగా చదవండి

Transformers 2 రివ్యూ

featured, lead, అమెరికా, ప్రపంచ సినిమా, సమీక్ష నాగరాజా
చక్కని కథనం, అప్పటివరకు చూసిన గ్రాఫిక్స్ కంటే విభిన్నమయిన గ్రాఫిక్స్ లతో తీసిన Transformers చూసిన వెంటనే ఈ సినిమా సీక్వల్ తప్పక చూడాలి అని నిర్ణయించుకున్నాను. రెండవ పార్టు విడుదలయి కేవలం ఒక్క రోజులో 60 మిలియన్ డాలర్లు, వారాంతానికల్లా $112 మిలియన్ల కలెక్షన్ రాబట్టింది. ఈ వివరాలు చూసి ఈ సినిమా పైన మరిన్ని ఎక్కువ అంచనాలతో వెళ్ళాను. మొదటి పార్టు హిట్ అయింది కాబట్టి రెండవ పార్టుకు కాస్త ఫ్లాష్‌బ్యాక్ కలపాలన్న ప్రాథమిక సూత్రాన్ని [...]
పూర్తిగా చదవండి

Definitely, May be (2008)

featured, lead, అమెరికా, ప్రపంచ సినిమా, సమీక్ష సౌమ్య
ఇప్పుడీ సినిమా కథ చెప్పాలంటే, అదో పెద్ద కథ. చూసేటప్పుడు కూడా నాకు కాస్త కన్ఫ్యూజింగ్ గానే అనిపించింది. విషయానికొస్తే, మన కథ వర్తమానంలో మొదలౌతుంది. విల్ హేస్ తన భార్య నుండి విడాకులు కోరి ఉంటాడు. ఈ ప్రయత్నాలు నడుస్తూ ఉండగా, విల్ పదేళ్ళ కూతురు మాయ తన తల్లిదండ్రుల వివాహానికి ముందు జరిగిన కథను తెలుసుకోవాలనుకుంటుంది. విల్ ఈ కథని యదాతథంగా చెప్పక – పాత్రల పేర్లు మార్చి, కాస్త నాటకీయంగా చెప్పడం [...]
పూర్తిగా చదవండి

Father of the bride

featured, lead, అభిప్రాయాలు, అమెరికా, ఆకాశమంత, ప్రకాశ్ రాజ్, ప్రపంచ సినిమా, ఫాదర్ ఆఫ్ ది బ్రైడ్, సమీక్ష, స్టీవ్ మార్టిన్ సౌమ్య
Father of the bride 1991లో వచ్చిన ఇంగ్లీషు సినిమా. అప్పుడెప్పుడో “ఆకాశమంత” చూసినప్పుడు ఎవరో అన్నారు ఈ సినిమా, ఆ సినిమా ఒకే థీం అని. విని ఊరుకున్నాను. ఆ తరువాత ఓ పదిరోజుల క్రితం అనుకోకుండా ఈ సినిమా చూశాను. పనిగట్టుకుని ఆలోచించకపోయినా కూడా రెండింటినీ పోల్చడం మొదలుపెట్టాను కాసేపు. ఇప్పుడీ వ్యాసం దాని పర్యవసానమే… కథ విషయానికొస్తే, జార్జ్ బ్యాంక్స్ అన్న పెద్దాయన కూతురు Annie ఆర్థికంగా తమకంటే పై అంతస్థులో ఉన్న అబ్బాయిని [...]
పూర్తిగా చదవండి

డిఫాయన్స్

featured, lead, అమెరికా, ప్రపంచ సినిమా, సమీక్ష నాగరాజా
కొన్ని కొన్ని సినిమాలు చూసినప్పుడు, ఆ సినిమా కథాగమనంతో భౌగోళికంగానూ కాలమాన పరిస్థితులతోనూ నాకెటువంటి సంబంధం లేకపోయినా కూడా ఒక్కోసారి అందులోని పాత్రలమధ్యలో నేను కూడా దూరిపోయి వాళ్ళతో పాటే అష్టకష్టాలు పడి వాళ్ళతోపాటుగా ఓడుతూ గెలుస్తూ సినిమాలోని అన్ని ఎమోషన్స్ ని అనుభవించి సినిమా అయ్యేటప్పటికి ఏదో ఒక సుదీర్ఘ ప్రయాణం చేసిన ఉద్విగ్నతకు లోనవుతుంటాను. ముఖ్యంగా వార్ మూవీస్ చూసినప్పుడు. అలాంటిదే ఈ సినిమా – డిఫాయన్స్(Defiance). టైటిల్ చూసి, పోస్టర్ మీద మన సరికొత్త [...]
పూర్తిగా చదవండి

Music & Lyrics

featured, lead, అమెరికా, ప్రపంచ సినిమా, సమీక్ష సౌమ్య
Music & Lyrics – 2007 హాలీవుడ్ చిత్రం. తారాగణం: హూగ్ గ్రాంట్, డ్రూ బారిమూర్. కథ: ఎనభైల్లో ప్రచారం పొందిన్ పాప్! అన్న సంగీతకారుల గుంపు (కల్పితం) ను చిత్రిస్తూ మొదలౌతుంది సినిమా. టైటిల్స్ గట్రా అయిపోయి వర్తమానానికి వస్తే, పాప్! ఆ తరువాత విడిపోతుంది. దానిలో ప్రధాన సభ్యులైన కాలిన్, అలెక్స్ ఫ్లెచర్ (హూగ్ గ్రాంట్) లలో కాలిన్ సోలోగా చాలా పేరు తెచ్చుకుంటాడు. అలెక్స్ అదృష్టం బాగోక – చిన్నా చితకా ప్రోగ్రాం లు [...]
పూర్తిగా చదవండి

అమెరికా దేశంలో ఆంధ్రా రాజకీయం!

అమెరికా, ఆంద్ర, రాజకీయాలు Dr.Ismail
మొత్తానికి 'తానా' మహాసభలు రంజుగా సాగాయి. మన తోటి బ్లాగరులైన ప్రసాద్, విహారిల పుణ్యమా అని ఖచ్చి...
పూర్తిగా చదవండి

ఇద్దరు మహానుభావులు, ఓ దురదృష్టవంతుడు

అమెరికా, మహానుభావులు, సాంఘిక రాక్. ఆ.
చాలా మంచి పట్టాలో రెండు, చేతిలో పెట్టుకొని, మూడు నెలలుగా ఉద్యోగం లేక, కొత్తగా ఏదో 'వీసా' వ్యనస్థ...
పూర్తిగా చదవండి

ప్రతిజ్ఞ

Telugu, అమెరికా, ఆలోచనలు, తెలుగు వైజాసత్య
I pledge allegiance to the Flag of the United States of America, and to the Republic for which it stands: one Nation under God, indivisible, With Liberty and Justice for all. ఈ ప్రతినలో నాకు నచ్చిన విషయం: one nation under GOD (దేవుని నేతృత్వములో సమైక దేశం). ఇక్కడ దేవుడు అన్నారు కానీ జీసస్ అనో, [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS