ఈ మధ్య విధి నిర్వహణ లో భాగంగా ఒక మారుమూల కుగ్రామానికి వెళ్ళాను. ఆ ఊరిలొ తిరనాళ్ళు (జాతర) జరుగుతున్నాయి. బాగా ఆస్వదించాను. ఇంతలో నా కర్ణపుటాల్లోకి నాలుగు మంచి మాటలు దూరాయి. ఆ నాలుగు మాటలు (నాకు మాటలంటే పాటలే
నని మీకు వేరే చెప్పనక్కర లేదని నా భావన) మీతో పంచుకోవాలనే ఈ టపా.
పూలలో ఉన్నాయి వేల రకాలు
పక్షుల్లో ఉన్నాయి లక్ష విధాలు
రేకులు ఉంటేనే పువ్వంటాము
రెక్కలు ఉంటేనే పక్షంటాము
కులాలు వేరైనా మతాలు
పూర్తిగా చదవండి
మీకు తెలుసు నేను నా పాటల టపాలు బ్లాగులో పాటల సాహిత్యం (దీన్ని సాహిత్యం అనకూడదేమో) ఉంచుతున్నాను. అవన్నీ నా మనసును అమితంగా కదలించే పాటలే. కొన్ని కొందరిని, మరికొన్ని అందరిన్నీ అలరిస్తున్నాయి. అయితే, ఇటీవల శ్రీ రఘురాం శేఖర్ గారు ఒక అభ్యర్ధన చేసారు. చదువుకుంటూనే వినడానికి గాని, డౌన్లోడ్ చేసుకోడానికి లంకెలు కూడా ఉంటే బాగుంటుందని. ఇటువంటి అభ్యర్ధనే మరికొందరు మిత్రులు చేసారు. మొన్న రాత్రి (24-11-06)
పూర్తిగా చదవండి