Can't see Telugu? Learn here. More Questions? Ask here.

Obama!

English పద్యం, ఉత్పలమాల, పద్యం Giri
ఉ. Clinton made a lot many carefully crafted plans, and very intelligently gave her entry an aura that of victory meant to be "scare-away every winner wannabe" move; not to be! enter a young man* with an endearing message : "change, hope" ఉ. క్లింటను మేడె లాటు మెని కేర్ఫులి క్రాఫ్టెడు ప్లాన్సు, అండ్వెరీ ఇంటలిజెంట్లి గేవు హరు ఎంట్రి ఎనార దటాఫు విక్టరీ మెంటుబి “స్కైరెవే ఎవిరి విన్నరు వానబి” మూవు,
పూర్తిగా చదవండి

Obama!

English పద్యం, ఉత్పలమాల, పద్యం Giri
ఉ. Clinton made a lot many carefully crafted plans, and very intelligently gave her entry an aura that of victory meant to be "scare-away every winner wannabe" move; not to be! enter a young man* with an endearing message : "change, hope" ఉ. క్లింటను మేడె లాటు మెని కేర్ఫులి క్రాఫ్టెడు ప్లాన్సు, అండ్వెరీ ఇంటలిజెంట్లి గేవు హరు ఎంట్రి ఎనార దటాఫు విక్టరీ మెంటుబి “స్కైరెవే ఎవిరి విన్నరు వానబి” మూవు,
పూర్తిగా చదవండి

చెత్త పాటలు రాసే తెలుగు సినిమా కవీ.. -2

Movies, ఉత్పలమాల, పద్యం Giri
ఉ. దుష్ట సమాసముల్, తగని తుఛ్ఛపు సంకర జాడ్య మౌఢ్య భూ యిష్ట ప్రయోగముల్, అతిశయించిన దుష్పదజాల వెల్లవల్ తిష్టలు వేసె నీ కలము తెచ్చిన పోకడవల్ల మూర్ఖుడా, భ్రష్టవు భాష నీ చలువ వల్ల, నరాధమ ఓ సినీకవీ!
పూర్తిగా చదవండి

Don? Don’t!

Movies, ఉత్పలమాల, తెలుగు, పద్యం Giri
ఉ. దండిగ డబ్బుచేసుకొని నవ్వుతు బాంకుకి పోవుటెంత బా గుండు కదా? ఇలాంటి చిరుకోరికలుండని వారి జీవితాల్ దండగలవ్వవా? పొగిడి నాకుతు పెద్దల కాళ్ళనీడనే పండగ చేసుకొన్న, భలె బాగుగ కోర్కెలు సాధ్యమవ్వవా? ==== ఉ. డాన్సులవీ అదో రకపు స్టైలు, అలాగని ఊరుకోని లా రెన్సు ఎడాపెడా పటిమలేని కధాంశములెంచుకొన్ననూ ఛాన్సులెలాగొలా దొరకసాగెను ప్రేక్షకమూకలో సినీ ఫాన్సు మెదళ్ళమోదుటకు పైత్యపు దర్శకుడై తలెత్తగా (పాపము ప్రేక్షక
పూర్తిగా చదవండి

తేట తెలుగు పలుకు - 3

ఆటవెలది, ఉత్పలమాల, తెలుగు భాష, పద్యం Giri
ఉ. వెడ్డికి crazy, కోపమదె పెచ్చిన madవు,నీరు wateరే, గడ్డికి graసు చెడ్డికి నిఖార్సుగ knickeరు, దొడ్డి yardయే, ముడ్డికి bum butt, మలమూత్రము poopలు pissలయ్యెనే, foodన భోజనంబు పడు బొంతలు mattress bedలయ్యెనే, ఆ.వె. సిగ్గువల్ల కొన్ని, ఛెంగున ఆంగ్లము పల్కి గొప్పకొట్టవచ్చు పక్క వారి ఎదుటనుకొను వారివల్ల మరిన్ని తెలుగు పదములు పలు తెరమరుగవు == పై పద్యంలో గణాలు సరిగా పడాలంటే ఇలా చదువుకోమని మనవి. ఉ.
పూర్తిగా చదవండి

Black Friday

ఉత్పలమాల, పద్యం Giri
ఉ. రాతిరి నిద్రమానుకొని లైనులలో నిలుచుండి సాహసో పేతముగా పరాయిల సమేతులుగా పడి మంచి డీళ్ళకై చూతురు చౌక బేరములు సొంతము చేసుకొనంగ చేయరే ఖాతరు -దండుకొంచు పలు గాడిద మోతలు- పక్కవారలన్ (తైతకలాటలాడుదురు థాంక్సుగివింగని బేరమాటలో) That's precisely the response marketers want from the customers year after year. Just for a few throw-away deals hundreds of people flock the stores, jostling and elbowing each
పూర్తిగా చదవండి

Ratatouille

Hollywood, Movies, ఉత్పలమాల, పద్యం Giri
ఉ. లొట్టలు వేసి జిహ్వ చవులూరెడి పాకము చేయబూనెనో చిట్టెలుకెన్నొ వంటలవిశేషములన్ పిడికొట్టి, పూటకూ ళ్ళట్టి ప్రదేశముల్ వెతికె; “రాటటుయీ” యను వంటకంబు చే బట్టె ప్రభంజనమ్ముగ అమాంతము వీచె పరంగు మెప్పుకై పరంగుల (French) మెప్పించింది కాని, నాకు పెద్దగా నచ్చలేదు Ratatouille.
పూర్తిగా చదవండి

గుండమ్మపై సీసము

Movies, ఆటవెలది, ఉత్పలమాల, తెలుగు, తేటగీతి, పద్యం, సీస పద్యం Giri
సీ. కన్నబిడ్డను చేయ కడుపార గారము పెంకిదయ్యెనది ఆ పెంపకాన సవతి కూతిరినెల్ల సాధింప వేధింప పనిమంతురాలయ్యె పసితనాన గారాల పట్టికి మారాజు కావలె ఘనమైన పెళ్ళికి, ఘనిడె వరుడు సరితూగు పనివాడు సవతి కూతురికి ఇ ల్లరికము వచ్చి, ఇల్లంటి మనగ ఆ. వె. అని తలచుచు ఇద్దరప్పచెల్లెళ్ళకు వరుల వేటజేయబట్టె తానె, మగని తోడులేని బండమ్మ, గుండమ్మ అన్న గారి సాయమందు కొంచు కానీ, ఆ అన్నగారు ఎలాంటి వాడయ్యా అంటే.. ఆ. వె. పైకి
పూర్తిగా చదవండి

తేట తెలుగు పలుకు - 2

ఉత్పలమాల, తెలుగు, తెలుగు భాష, పద్యం Giri
ఈ పద్యానికి స్పూర్తి - ఊకదంపుడు గారి టంగు తెగుట, దానిపై రాఘవ గారి కొనసాగింపు ఉ. తేనెలనూరు పల్కులని, తీయని తేటతెలుంగు మాటలే వీనులవిందులవ్వునని భేషజమాడుట వట్టిమాటలే యౌను, నరాలలో ఇమిడినట్టి గులాముల బుద్దికింక స మ్మానితయౌ విధాన తలమానికమవ్వగ ఆంగ్లమాంధ్రలో
పూర్తిగా చదవండి

ఓ గణాధిపా నీకు మ్రొక్కెదన్

ఉత్పలమాల, గణపతి, పద్యం, బాపు బొమ్మ Giri
ఉ. వ్యాస మహామునీశ్వరుని వాక్కులు వేగగతిన్ సుధాశును ద్భాసితమైన పద్యముల పార ఘనామృత సారమంతయూ వ్రాసితివయ్య విఘ్నగణరాయ అచంచల దీక్షబూని; సం తోసముతో మునే పలికెనో, పలికించిన వాడవీవెనో? (వాసిగ విద్యలన్ ఒసగు పార్వతి పుత్ర మహాగణాధిపా)
పూర్తిగా చదవండి

అప్పుల తిప్పలు

Finance, ఉత్పలమాల, పద్యం, మత్తకోకిల Giri
నిన్న రాయడానికి ఏదీ తట్టక, రాయాలను కోరిక చావక మ.కో. చిన్న పద్యము అల్లుదామని చెడ్డకోరిక కల్గగా పెన్నుపేపరు చేతబట్టుకు పెట్టసాగితి బుఱ్ఱలో ఉన్న గుజ్జుకు తానతందన*; ఒక్కటైనను తట్టదే మన్నుమిన్నులు ఏకమైనను మంచి పద్యము బుఱ్ఱకూ (* సాన పెట్టుట అని కూడా అంటారు లెండి) అంటూ మత్తకోకిలతో బుఱ్ఱగోక్కుంటున్న నాకు, మా కంపెనీ సీఈఓ గద్దె దిగిపోయాడనే వేగు కనిపించింది. సబ్-ప్రైం ఋణాల గురించి ఇదివరకు రాసానుగా, వాటి
పూర్తిగా చదవండి

Selling a car

ఆటవెలది, ఉత్పలమాల, పద్యం Giri
కారుల అమ్మకానికని ఖర్చులు ఎక్కువ చేయడాలు బే కారని ఎంచి నేను పలు కారుల సైటులు చూడబట్టి* ఏ కారుకి ఎంతపైకమడగాలను మత్లబు తెల్సివచ్చె నా కారు (ఒకింత కొత్తటి ఎకార్డుని) పెట్టితి క్రేగ్సులిస్టులో మీకు తెల్సినట్టి వేరేవి, అక్కర కొచ్చు మంచి సాలె గూళ్ళు ఉన్న చో తెలియపరచిన, ఎంతో సహాయము నాకు; మీకు తెలుపు కృతజ్ఞతలివె == *పడిగాపులు మస్తుగ చేయబట్టి
పూర్తిగా చదవండి

అమెరికా, ఉంటా మరిక..

ఆటవెలది, ఉత్పలమాల, తరలము, తెలుగు, పద్యం Giri
ఉ. మోజిక తీరిపోయెను అమోఘ ధనార్తులదేశరాజమై రాజిలు "శాము మామ"కు పలాయన చిత్తుడనై ఎడంబడే రోజిక వచ్చెగావున పొలోమని - కట్టితి మూటముల్లెలూ బూజుని దుల్పివేసి అలవోకగ- వేగిరమే బయల్పడన్ త. కదలి రా ఇటవచ్చి చేరగ కాసుకాన్కలు భత్యముల్ బదిలి ఖర్చులు అద్దెకొంపకు బాడుగాదులు ఇచ్చెదమ్ వదలివచ్చిన చోటయుండిన మంచిసౌఖ్యపు భోగముల్ సదరుచోటుననుండు తప్పక సావకాశపు భోగ్యముల్ ఆ. వె. అనుచు నాకు మంచి అవకాశమొక్కటి చేతికందజేయ,
పూర్తిగా చదవండి

తేట తెలుగు పలుకు

Movies, Music, ఆటవెలది, ఉత్పలమాల, తెలుగు, తెలుగు భాష, పద్యం Giri
కొత్తపాళీ గారు,. రానారె గారు వ్రాసిన తెలుగులో బీభత్సానికి నా జోడింపు. ఉ. వాళ్ళకి వాల్లు; కళ్ళకట మారును కల్లుగ; హవ్వ! వాణియా నోళ్ళబడంగ వానియగు; నోళ్ళిక నోల్లయినిల్వ నిట్టి యా రళ్ళవె కర్ణభేరులకు ఱంపపుకోతల కూతలవ్వ, యె న్నాళ్ళు భరించుటంచు చెడునాల్కెలనెల్లను చీరివేతువా? ఆ.వె. సల్పవచ్చునట్టి సాహసము తెగించి తప్పులేదు కాని తరచి చూడ మూగవారు తప్ప మిగలరెవ్వరు మరి చివరకు మన చిత్రసీమలోన* చిత్రసీమ అని
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS