Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఒకోసారి…

కవితలు నాగరాజా
ఒకోసారి......గెలుపు కన్నా ఓటమే స్ఫూర్తినిస్తుంది...ప్రశంస కన్నా విమర్శే ఉత్తేజాన్నిస్తుంది...వెల...
పూర్తిగా చదవండి

బ్రైడల్ వైల్ జ్ఞాపకంలోకి-

కవితలు రాక్. ఆ.
దూరం నించి నిన్ను చూసి కుంచెదిద్దిన చిత్రపటాని వనుకున్నాను దగ్గరికి రాగానే ఆకాశం నక్షత్రాలన్నీ ఒక్కసారి రాల్చినట్టు నీ మేలి ముసుగు తుంపరై దూకే జలపాతమైంది ఒళ్ళు గగుర్పొడిచే సౌందర్యం వెనక్కి అడుగేయలేని సంభ్రమం బ్రైడల్ వైల్ ! ఎంత ఉత్సాహం నీకు! యూసోమిటీ లోయలోకి దభాలున దుముకడానికి! నిన్ను చూస్తే ఉవ్వెత్తున రకం విస్తరించి నీతో పాటూ ఎగిరి గంతేయాలనిపిస్తుంది జారే నీటి ప్రవాహమ్మీద జారుడు బల్లాడాలనిపిస్తుంది బ్రైడల్ వైల్ ! నీ నీటి పాయల్ని కొప్పుగా ముడిచి ఆశగా పూలు తురమాలనుంది అడవి ముంగిట్లో తీగెలై పాకే వెన్నెలంతా తీసి నీకు నలుగులద్దాలనుంది నీ జల్లుల [...]
పూర్తిగా చదవండి

దేవిప్రియ కవితలు – మూడు

కవితలు ప్రాణహిత
అమూర్తగానం అల్లకల్లోలంగా వున్న హృదయం కంటే బరువుగా వుంటుంది నీ కన్నీటి చుక్క సౌగంధికా పరిమళాలను తరలించుకువచ్చే పిల్ల తెమ్మెర కంటే మృదువుగా వుంటుంది నీ మేనిస్పర్శ తాకితే జలదరించే సితారు తీగవవుతావో మంచుముక్కల రాపిడిలో పుట్టిన అగ్నికీలవవుతావో.. పొంగుతున్న ఏటి మధ్య చేతులు కట్టుకుని అడుగందని లోతుల ఆరా తీస్తున్న నాకూ ఒడ్డున ఒకే ఒక్క ఆకు మిగిలిన అమృత వృక్షంలాంటి నీకూ మధ్య రాయబారం నడుపుతోంది మార్మిక కోయిల ఎక్కడినుంచి ఏతెంచావో తెలియదు నీకు ఏ సీమకి ఎగిరిపోవాలో తోచదు నాకు ఓ నా శిలాచేలాంచల ఆచ్చాదిత నీటి శిల్పమా ఓ నా అనూహ్య ఊహాలోకవిహార అమూర్తగానమా, ప్రాణమా, ఏమి నీకోరిక…? (3.8.09) కరువొచ్చినప్పుడు పాలకడలిలో పాముపడక మీద చిద్విలాసంగా శయనించే అఖిలాండబ్రహ్మాండకోటి ఆపద్బంధవుడి కొండకోనేరు కూడా కరువొస్తే ఎండిపోతుంది కడుపు [...]
పూర్తిగా చదవండి

పురాకృతం

కవితలు ప్రాణహిత
- శ్రీకాంత్ తేలికగా ఉండడమంటే ఏమిటి? బహుశా నాకు తెలీదు. అది సాయంకాలపు ఎండ కావొచ్చు,దేహంలోకి చొచ్చుకుపోయే గాలే కావొచ్చు.ఒక అద్భుతం.నీరులానూ.తుంపరలానూ వుండటం. అది ప్రేమ కూడా.తేలికగా వుండటం అదే కావొచ్చును. ప్రేమించడం నిర్మలంగా నవ్వడం మృదువుగా మాట్లాడటం నాకు తెలీదు.ప్రతిక్షణం ముక్కలుగా రాలిపడటం యితరులను గాయపరచటం నాకు తెలిసిన జీవితం. అది యీ పద్యం కూడా. మరెప్పుడో మొదలయ్యింది సంఘర్షణతోనే.యిక్కడే అంతమవుతుంది సంఘర్షణతోనే.కానీ, పాదాల చుట్టూ చుట్టుకొనే నీడా దేహంపై కదులాడే ఎండా? యివి కూడా వాస్తవాలు. ప్రేమ కూడా వాస్తవం. యీ [...]
పూర్తిగా చదవండి

రెండు నాలుకల రాచ వ్యాధి

కవితలు నాగరాజా
ఎప్పుడూ తల లేని వికృత జంతువొకటి జనం మధ్య తిరుగుతూ వుంటుంది ఐదేండ్లకోసారి తల మాత్రం మార్చుకుంటుంది ప్రజలు ఇంకెన్నో ముఖాలతో మోసగింపబడుతూనే వుంటారు. ఐతే ఒంటికి కొవ్వెక్కితే చికిత్స చేయవచ్చు నోరు కొవ్వితే ఏం చేస్తాం ? *** ఆ వేషమేయాలన్న వూహెంత సుందరం ముఖం నిండా ఎప్పుడూ రాజ దరహాసమే రాచ నగర మార్గం వెంట రాజు వెడలె రైతు తేజములలరగ వాన్ని జూసిన కొన్ని తలరుమాళ్ళు తమ మధ్య నుండి నడచి వెళ్ళిన వాడని తననే పోలి వున్నాడని తనివిదీర సంబుర పడ్డయ్ తమ పంటలో కలుపు మొక్కలు మొలవనియ్యడనుకున్నయిగని తనే కలుపు మొక్కవు తడనుకోలే చెమటకూ, [...]
పూర్తిగా చదవండి

ప్రవక్త లేని ప్రపంచం

అనువాదాలు, కవితలు ఎన్.వేణుగోపాల్
ఉర్దూ మూలం : మజర్ మెహదీ ఈ ప్రపంచం ఇతర ప్రపంచాల కన్నా భిన్నంగా ఎప్పుడుంది? అవే జలపాతాలు అవే ఆకుపచ్చని లోయలు అవే భుజాలవంటి కొమ్మలున్న చెట్లు భూమిలోపలి నుంచి ఉబికి ఉబికి ఉవ్వెత్తున చిమ్ముకొని వచ్చే ఊటలు పర్వతాలు అవును వీటికి కూదా దిశానిర్దేశం కావాలి రుచీపచీలెని నీళ్ళు ఈదప్పిని తీర్చలేనని నీటికి తెలుసా! ఒకయాంత్రిక సంప్రదాయానికి అలవాటుపడ్డాం ఈ పిల్ల తెమ్మరలకు పూలను ముద్దాడె వయ్యారం తెలియదు ఈ పూలు గాలి నిర్దేశించినట్లు తలూపుతాయి అడవుల్లో పూలచెట్ల మొదళ్ళన్నీ టెంటు స్తంభాలుగా నిలిచి వుంటాయి అంతే కాదు వాటికి తమ సుగంధాల సంగతీ తెలియదు ఈ పర్వతాలు తమ విలువలేని [...]
పూర్తిగా చదవండి

శ్రీ శ్రీ అంటే ఒక సంకల్పం

కవితలు ప్రాణహిత
- శివలక్ష్మి శ్రీ శ్రీ రెండు అక్షరాల  ఉద్వేగం పెల్లుబికే జీవన కాంక్ష ఎందుకు ఇష్టం శ్రీ శ్రీ అంటే- జీవితం ఎందుకు ఇష్టమో అందుకే ఊగించే శక్తి,ఉద్వేగంగా అల్లుకునే నడక కవిత్వం అంటే శ్రీ శ్రీ సదా నిత్యనూతనం, సదా స్నేహితుడిలా ధైర్యం చెప్పే భరోసాతనం పదే పదే పెదవుల మీదకు ప్రసరించి పలకరించే ప్రతీక శ్రీశ్రీ నిరాసక్తంగా సాగిపోతున్నప్పుడు వెంట నడిచే జీవన ఉత్సాహం శ్రీశ్రీ పదండి ముందుకు పడండి త్రోసుకు అంటూ మరో ప్రపంచపు దారికి మళ్ళిస్తూ కవిత్వాన్ని అమృతంలా గుండెల్లో ఒంపుతుంటాడు శ్రీశ్రీ అంటే ఎందుకు ఇష్టం జీవితం అంటే ఎందుకు ఇష్టమో అందుకే అని సాగిపోతూంటాను.
పూర్తిగా చదవండి

తీపి శిఖ

కవితలు నాగరాజా
అప్పుడెప్పుడో దుఃఖం గుండెని నిండుగా కప్పుకున్నపుడు ఙ్ఞాపకాలు నిలువునా బ్రతుకుని ఒక్కోముక్కగా నరుక్కుపోయాయి రాసులు రాసులుగా పోసుకున్న గాయాలు జీవితంలోంచి మరల మొల్చుకొచ్చి వీధి మలుపున ఎదురు పడ్తున్నాయి నేనెప్పుడూ నడిచే వెళుతుంటాను గమ్యాన్నో… లేదా గాయాల్నో వెతుక్కుంటూ మార్గాలన్నీ మూసుకుపోయినప్పుడు ఒంటరిగానే మిగిలిపొతుంటాను నిద్రలో చీకటి అంచునుంచి హఠాత్తుగా దొర్లి పడినప్పుడు ఎప్పుడూ అంధకారంతోనే నిండి ఉంటుందీ ప్రపంచం గ్లాసుతో ఒంపుకున్న పద్యం ఒకటి గొంతులోంచి దిగి గుండెని నిటారుగా రెండుగా చీలుస్తుంది ఏకాంతం గుట్టువిప్పడం నాకు తెలియదు దుఃఖాన్ని స్మరించడమే తప్ప దాన్ని దూరంగా నెట్టివేయడం నేర్పలేదు పచ్చని పొదరిళ్ళలోకి ఒదొగి పోయి మట్టిని ఆత్మీయంగా ఆలింగనం చేస్కున్నవాణ్ణి ఇప్పుడు నీవూ నేనూ ఎదురెదురుగా నిలబడినప్పుడు కరచాలనం చేయలేని అసహాయుడిని.
పూర్తిగా చదవండి

వెన్నెల శిల్పం

కవితలు ప్రాణహిత
- బాణాల శ్రీనివాస రావు అందరూ నిదురించేవేళ రాత్రిని జోకొడుతూ…… ఎన్నడూ వినని పదాలకు ప్రాణంపోస్తూ…… నిఘంటు అర్థాల్నిమార్చే నవ భాషావేత్తా…. ఏ స్వరాలకందని సుస్వరాలుకూర్చే సంగీతకారిణీ……. నీ పాటల్ని అర్థంచేసుకోలేని మా అఙ్ఞానాన్ని మన్నించుతల్లీ! ఉన్నట్టుంటే ఒక నదీతరంగం ఆ చేతుల్లో ఒదిగే ఒయాసిస్సు అటుగావెళ్ళే గాలికెరటం ఆగదిలో వీచే వింజామర కుండపోతగా కురిసే వెన్నెల గోడకు వేలాడే వెలుగు శిల్పం వెలిసి వెలిసి అలిసిన హరివిల్లు ఆచిన్నిమెడలో మెరిసే మణిహారం ఆపాదాల స్పర్శకు పరవశించి పాటలై ప్రవహించే పాల రాళ్ళు సూర్యగోళం చుట్టూ తిరిగే గ్రహాలు గతి తప్పి దిగొచ్చిన ఆటబొమ్మలు నిశ్శబ్దం కొమ్మన కూసే వెలుగు కోయిల స్వరమా… స్పష్టంగా  నీ ముందు తలవంచే ఓ పసిడి బొమ్మ.
పూర్తిగా చదవండి

పిండాల బావి

కవితలు నాగరాజా
అమ్మా! నేను జీవ కణాన్నై నీ ఉదర గృహంలో అడుగు పెట్టినప్పుడు నువ్వెంత సంబరపడ్డావో కదా? ఎంత మంచి దానివమ్మ! ఆడో!మగో! తెలియదు ముక్కు మొగమైనా రూపు దిద్దుకోలేదు ఎన్ని సార్లు బొజ్జ తడుముకుని నన్ను నీ బతుకు లోకి స్వాగతించావో కదా! వెచ్చని నీ గర్భ గుడిలో దైవం లా నేనెంత భద్రంగా వున్నానో కదా!? ఈ రోజు నాన్న ఏదో అన్నాడు అశృ తరంగాల మధ్య ఓటి పడవలా వున్నావు నువ్వు మొదటి సారిగా నాకు భయంగా వుందమ్మా! నాన్నకి నేనిష్టం లేదు స్టాక్ మార్కెట్లో పతనమైన సెన్ సెక్స్ నాన్న ఆస్తికి ఆనకట్ట ఆమ్నియో సెంటిసిస్ అమ్మా! [...]
పూర్తిగా చదవండి

కాలరేఖ

కవితలు ప్రాణహిత
- కృష్ణుడు గతంలోని పరిమళం నేడు గుభాళించదు నిన్నటి సౌందర్యం నేడు మత్తెక్కనివ్వదు కాలం ఏదో ఒక శకలంపై ప్రయాణించదు విశాల జీవితారణ్యంలో వెన్నెల నిత్యం ప్రసరించదు బాల్యపు మోకాళ్ళపై గాయాల మచ్చలు కోల్పోయిన మధురస్మృతి చిహ్నాలు పెదవిపై విరిసిన ప్రతి మందహాసం నిత్యం మందపవనమై సేద తీర్చదు పరిమళానికీ సౌందర్యానికీ వెన్నెలకూ బాల్యానికీ కాలంతో చెల్లిపోయేదేమీలేదు కాలం గుండెల్లో రెపరెపలాడే ఎర్రబావుటా కాదు కాలం వెలసి పోయిన నినాదమో నిన్న పంచిన కరపత్రమో కాదు కాలం కనపడని ప్రాణాలజాబితా కాదు ఎన్నాళ్ళని పదిల పరుచుకోను శరపరంపరల జ్ఞాపకాల్ని… వాటిని దగ్ధం చేసి రేపటి గానం చేస్తా… రేపు నిన్నటి సమాధిపై మొలిచిన పుష్పం రేపు నిన్నటి శోకాల కాంతిలో వెలిగే లోకం…
పూర్తిగా చదవండి

ఒక కొత్త చూపు కోసం

కవితలు నాగరాజా
ఇక్కడ ఒక కవి జీవించాడు వంతెన కడుతూ వంగిపొయిన చెట్టు కొమ్మలా భూమి మీద వాలిపోతూ ఇంధ్ర ధనస్సులాంటి కలల్ని పూరి గుడిసెల గుమ్మటాలకు వేలాడదీస్తూ చీకటి గొంగడిని భుజం మీద వేసుకొని చుక్కల వెలుతురు నీడల్ని దాటుకుంటూ ఏ ఒక్క నిమిషం గాయపడకుండా ఉండలేదు పావురాళ్ళగుంపులవెనక బైనాక్యూలర్ చూపులు వెంటాడుతున్నప్పుడు చార్మినార్ ముందట ఎవరు మాత్రం సంతోషంగా తిరగ గలరు అత్తర్ వాసనల్లో కలిసిపోయిన గాయాల గురించి ఎవరు మాట్లాడతారు? కొత్తవంతెనను నిర్మిస్తున్న మనిషి తప్ప నీదొక చెయ్యి నాదొక చెయ్యి ఎప్పటికి కలిసిపోకుండా మధ్య మధ్యలో వంతెనల్ని బద్దలు కొడుతున్న దెవరు? అవమానాలు, అనుమానాలు ఇంటికిటికీ లెక్క ఎప్పుడూ తెరిచే ఉంచినప్పుడు పిచ్చుక లెక్క [...]
పూర్తిగా చదవండి

నాన్న ఆనవాళ్ళు

కవితలు ఆలోచనలు, అభిప్రాయాలు...
చిన్న మొక్కగా వేళ్ళూని నాతో పెరిగి డాబాపై పాకిన సన్నజాజి తీగ సాక్షిగా ఇల్లంతా జల్లిన పూల పరిమళాల సౌరభంలా నన్ను పలకరించి వెళ్ళే పిల్లగాలి సంభ్రమంలా నాన్న వున్నప్పుడు నా బాల్యం బంతిపూల రథం పార్కులో జారుడు బల్లపై జారిపోవడం రోళ్ళు పగిలే రోహిణీ కార్తెలో అమ్మ చేతుల అరటి ఆకుల్లో నిద్రించిన పసితనం అమ్మంటే నాన్ననీ నాన్నంటే అమ్మనీ ఉంగాలనుంచి అ ఆ ఇ ఈ లలో మాటల బాటలో నడిపించిన పయనం రావిచెట్టు ఉయ్యాల ఊపుల్లో నేను విన్న రాజకుమారుల ముచ్చట్లు ఉప్పుమూట లా నాన్న మూపున వేలాడిన బాల్యం తామర పూల [...]
పూర్తిగా చదవండి

జ్వరస్థితి

కవితలు ఎన్.వేణుగోపాల్
లోలోపల ఏమవుతుందో తెలియదు కొన్నాళ్ళపాటా లేకుంటే కొన్ని రోజులా? చేతనం సందిగ్ధమై ముందుకూపోకా వెనుకకూ రాకా ఒక లోలోతులలో పొరలు పొరలుగా కాగే సన్నని మంట దేహపు ఆవరణలో ఎవరో ఏదో వైనవైనాలుగా హడావిడీ పడుతున్నసవ్వడి వినిపించీ వినిపించనట్టు ఒకమూల ఒక నేపథ్యానికి ఒకింత ఓరిమితో ఒక అలవాటయిన స్థితిలో కంగారూ కాకుండా నిర్లిప్తమూ కాకుండా తెలియని సన్నద్ధత ఏదో కవచధారియైనిలుచునే  వేళ ఏకాంత దీపాల వెలుగులో రణగొణ ధ్వనులను విడిచి కించిత్ కాలాతీతమై రెండు చేతులనూ చాచీ అలసిన దేహంతో నువు మూగన్నుగా పడుకొని మెలకువకూ నిద్దురకూ నడుమ నేడూ రేపులలాగే సన్నని కంచెను అల్లుతుంటావు
పూర్తిగా చదవండి

ఇది కవి నివాసం

కవితలు నాగరాజా
హైద్రాబాద్ ఒక చాందినీ మహల్ పండగ సందడిగా వెలిగే ఒక మహిఫిల్ ఆకాశం మతిపోగొట్టే తారల ముజ్రా హైద్రాబాదంటే పురాతన మట్టిలోంచి ప్రేమగా వీచే సుగంధ సమీరం మిత్రులు మాట్లాడుకుంటే గజల్ గురించే గల్లీలో కలుసుకుంటే దోస్తానా గురించే సలాం చేసి కుశలమడిగితే దావత్ గురించే హైద్రాబాదంటే సాసర్లో పోసుకొని ఊదుకుంటూ తాగే గరంచాయి ఇది వ్యాపారం చేసే బజారు కాదు ఆప్తులు తప్పిపోయే “మేళా” కాదు అత్తరు చల్లుకునే కమ్మని ఆలింగనం “బతాసులు” దొరికే స్వప్నలోకం హైద్రాబాదంటే రాఖీలు పేర్చిన దీపాల షామియానా కలిసుండే బతుకుల్ని కబ్జాచేయడం తెలియదు మరిచిపోయి కూడా ధోకాయివ్వడం రాదు అతిథులకోసం ఇల్లమ్ముకోవడం తెలుసు ఇచ్చిన మాటకోసం పస్తులుండడం తెలుసు హైద్రాబాదంటే గ్లాసెడు నీళ్ళడిగితే గండిపేటనే దానం చేయడం హైద్రాబాదీలు దిల్ దార్ ఇన్సాన్లు నిలుచున్న నీడను త్యాగం చేసి గోల్కొండను రాసిస్తారు మూసీనది ఎండిపోయినా గుండెను తోడిపోస్తారు హైద్రాబాదంటే నిన్నూ నన్నూ కలిపే చార్మినార్ పరిమళం పూలనూ ముళ్లనూ పాన్ తో నమిలే ఒక షాయర్ [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS