Can't see Telugu? Learn here. More Questions? Ask here.

సల్మాన్ కు ఫత్వా..!!

చాకిరేవు రాజారావు తాడిమేటి
నిన్ననే “ఈనాడు” పేపర్లో ఈ వార్త చూసాను. వినాయక చవితి సందర్భంగా జరిగిన సంబరాలలో పాల్గొని విగ్రహారాధన చేసినందుకు బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఈ ఫత్వా జారీ చేయబడింది. మొన్నటికి మొన్న సానియా మిర్జా దుస్తుల విషయంలోనూ ముస్లిం సంస్థలు ఫత్వా జారీ చేసాయి. ఈ విధంగా ముస్లిం సంస్థలు అతివాద, ఛాందస పోకడలు పోతుంటే, హిందువుల పరిస్థితి మరో విధంగా ఉంది. హిందువుల పవిత్ర దేవాలయాలలో కళ్యాణ మహోత్సవాలకూ, బ్రహ్మోత్సవాలకూ పట్టు వస్త్రాలు సమర్పించేవారు హిందువులు [...]
పూర్తిగా చదవండి

న్యూస్ ఛానళ్ళ తీరుపై “అమృతం” వ్యంగ్యాస్త్రాలు.

చాకిరేవు రాజారావు తాడిమేటి
నిన్ననే హైదరాబాద్‌లో జరిగిన ఫ్లైఓవర్ దారుణం టివిలో చూసాను. బాధితుల మృతదేహాలు చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. దానికంటే కలచివేసిన దృశ్యాలు ఏమిటంటే ఆ మృతదేహాలను కెమెరాలలో బంధించడానికి రిపోర్టర్లు పడుతున్న ఆతృత. జరిగిన దారుణాన్ని ఎంత తొందరగా ప్రసారం చేసి తమ ఛానళ్ళ రేటింగులు పెంచుకోవాలనే ఆశ తప్ప, జరుగుతున్న సహాయ కార్యక్రమాలలో ఒక చేయివేసి సాయం అందించాలనే తపన ఒక్కరిలోనూ కనబడలేదు. శిధిలాలలో మూల మూలలకు వెళ్ళి, తమ ప్రాణాలకు సైతం తెగించి, కాళ్ళు, చేతులు [...]
పూర్తిగా చదవండి

“చందమామ” కి అంత సీనేం లేదు..!!

చాకిరేవు, సినిమాలు రాజారావు తాడిమేటి
కృష్ణవంశీ చాలాకాలం తరువాత కుటుంబ, ప్రేమ కథా చిత్రం తీసాడని ఎగురుకుంటూ రిలీజయిన రోజునే వెళ్ళి చూసినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. సినిమా మొదటినుంచి చివరివరకు గోల గోల. హీరో నవదీప్, రెండో హీరోయిన్ (పేరు తెలీదు), సినిమా మొత్తం అరుఫులు, వెకిలి, కోతి చేష్టలతో చెత్త చెత్త చేసి పారేసి ఇరిటేషన్‌తో నేను జుట్టు పీక్కునేలా చేసారు. మొత్తం సినిమాలో ఆహుతి ప్రసాద్ చేసిన కొద్దిపాటి కామెడీ తప్పితే చెప్పుకోదగినదేమీ లేదు. “మురారి”, “నిన్నే [...]
పూర్తిగా చదవండి

మరీ ఇంత తెలుగు అనువాదం అవసరమా..?

చాకిరేవు, నా అభిప్రాయాలు రాజారావు తాడిమేటి
మన తెలుగు బ్లాగర్లు అందరూ సాధ్యమైనంత వరకూ తెలుగు పదాలనే ఉపయోగిస్తూ బ్లాగటానికి ప్రయత్రిస్తున్నారు. ఇది హర్షణీయమే అయినా కొన్నిసార్లు తెలుగు పదాలనే వాడాలనే తపనతో అతిగా తర్జుమా చేస్తున్నామేమో అనిపిస్తోంది. ఉదాహరణకు బహుళ ప్రాచుర్యం పొందిన సాంకేతిక పదాలైన ఇంటర్నెట్‌ను అంతర్జాలంఅనీ, సాఫ్ట్‌వేర్‌ను మృదులాంత్రంఅనీ, హార్డ్‌వేర్‌ను కఠినాంత్రంఅనీ ఇలా అనువాదం చేయటం సబబు అనిపించట్లెదు. కాల స్రవంతిలో ఎన్నో పరభాషా పదాలను తెలుగులో దత్తత తీసుకున్నాము. ఉదాహరణకు బస్సు, రైలు, కారు మొదలైనవి. రైలును “ధూమశకట వాహనము” [...]
పూర్తిగా చదవండి

“యమదొంగ” Vs “యముడికి మొగుడు”..!!

చాకిరేవు, సినిమాలు రాజారావు తాడిమేటి
యమదొంగ సినిమాపై “కొత్త పాళీ” గారు మరియు “జ్యోతి” గారు రాసిన టపాలు చదివాను. కాని వాటిలో అన్ని విషయాలను ప్రస్తావించలేదని అనిపించి ఈ టపా రాస్తున్నాను. మొదటగా ఈ సినిమాకి “యమగోల” తో కన్నా “యముడికి మొగుడు” తో ఎక్కువ పోలికలు కనిపించాయి నాకు. ఈ రెండు సినిమాలకు ఉన్న సారూప్యాన్నీ, భేదాన్నీ ఇక్కడ వివరిస్తాను. “యముడికి మొగుడు” లో హీరో పేదలకు సహాయపడే ఒక కిరాయి రౌడీ. “యమదొంగ” లో హీరో ఒక దొంగ. అందులో హీరో [...]
పూర్తిగా చదవండి

జెమిని “చిత్ర” హింస..!!

చాకిరేవు రాజారావు తాడిమేటి
రోజూ జెమిని ఛానల్లో డబ్బింగ్ సినిమాలనూ, సా..గదీత సీరియళ్ళనూ చూసి చూసీ విసుగు పుట్టి, కనీసం స్వాతంత్ర్య దినోత్సవం నాడైనా మంచి కార్యక్రమాలు ఉండకపోతాయా అని ఎదురు చూసిన నాకు తీవ్ర నిరాశే ఎదురయింది. ఆ రోజు మొదటినుండీ చివరి వరకూ చలన చిత్రాలకు సంబంధించిన వేరు వేరు కార్యక్రమాలతో విచిత్ర రీతులలో “చిత్ర” హింసను కొనసాగించారు జెమిని వారు. ఆగస్టు పదిహేను నాడే విడుదల అయిన “యమ దొంగ” చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు సింహభాగాన్ని ఆక్రమించాయి. “సక్సెస్ [...]
పూర్తిగా చదవండి

బాబోయ్ భారత్ బజార్..!!

అమెరికా కబుర్లు, చాకిరేవు రాజారావు తాడిమేటి
ఈ మధ్య అమెరికాలో సందు సందునా, గొందు గొందునా భారత్ బజార్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటిలో చాలావరకూ, వినియోగదారులను దోచుకొందుకు, అందినకాడికి లాభాలను దండుకొందుకు ప్రాధాన్యతనిస్తూ, నాణ్యమైన వస్తువులను అందివ్వాలన్న కనీస బాధ్యతను విస్మరిస్తున్నాయి. ఇటీవల నేనొక భారత సూపర్ మార్కెట్ కి కాఫీ పౌడర్ కొనడానికి వెళ్ళినప్పుడు, నవ్వుతూ ఉన్న సుహాసిని బొమ్మతో బ్రూక్ బాండ్ గ్రీన్ లేబుల్ ప్యాకెట్ కనిపించింది. తీరా తీసిచూస్తే అది 2005 లో తయారయిన కాఫీ పౌడర్. దానిపై Best Before [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS