Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పునః ప్రారంభం గురించి?

జిల్లా గ్రంధాలయం, తక్కినవి, తత్వం, నా గోల, పరిచయం smadpr
తప్పలేదు మరి ఏమి చెయ్యమంటారు! పేరు నా బ్లాగుకి నప్పలేదు అనిపించి ఇంకో బ్లాగు మొదలెట్టాను. అది కాస్తా పరీక్షలవల్ల కొనసాగించలేక మధ్యలో డుమ్మా కొట్టాను; ఐనా మీ అందరి బ్లాగులు చదువుతున్నాను లెండి. ఇప్పుడు కొంచెం ఖాళీనే కాబట్టి, మళ్ళా కొనసాగించే ప్రయత్నం చేస్తా. ఈ మధ్య కాలంలో కిరణ్ ఒకడు కొంచెం పర్వాలేదు, బానే రాస్తున్నాడు అనిపించింది. తేనెగూడులో 387 బ్ల్లగులు చూసి కొంచెం తృప్తిగా ఉంది. నంబరు బానే పెరిగిందిలెండి. కూడలి మాత్రం [...]
పూర్తిగా చదవండి

ఓపెన్ ఆఫీసులో (open office) తెలుగెలా

జిల్లా గ్రంధాలయం, తక్కినవి, సాఫ్ట్ వేర్ smadpr
విస్టా వాళ్ళకు: 1. ముందుగా మీ ఓపెన్ ఆఫీసుని ఓపెన్ చేసి, అందులో tools>options ని క్లిక్ చెయ్యండి. 2. ఇప్పుడు, వచ్చిన విండోలో కింద చూపినట్టుగా కాంప్లెక్స్ టెక్స్ట్ భాషని (enable CTL by checking the shown box) ఎనేబుల్ చెయ్యండి. 3. ఆపై కింద చూప్పినట్టుగా CTL (Telugu) నకు సరైన ఫాంటును (in most cases Gautami) కాంఫిగర్ చెయ్యండి. అంతే. తక్కిన విండోస్లలో(like Windows XP) ముందుగా మీ కంప్యూటర్కి తెలుగేంటో చెప్పాలి. అదెట్లా చెయ్యాలో [...]
పూర్తిగా చదవండి

“Unjustify” ఇక మరింత సులువు

జిల్లా గ్రంధాలయం, వెబ్ సైట్లు, సాఫ్ట్ వేర్ smadpr
ముందుగా unjustifyని తయారుచేసిన వీవెన్ కి ధన్యవాదాలు. ఐతే, మీలో ఫైర్ ఫాక్స్ వాడే వాళ్ళకి రెండు విషయాలు చెప్పదలచుకున్నాను. 1. Grease Monkey (గజ్జి కుక్క / గబ్బు కోతి) [ “కోతి” అంటే కలవలేదనిపించి… ] అనే పొడిగింతని జతచేయడం… 2. ఆపై unjustify te అనే యూజర్ స్క్రిప్టు ని ఇన్స్టాల్ చెయ్యడం. (నొక్కి చూడండి) దీని వల్ల మీరు, ఏదేని వెబ్ పేజీని తెరిచాక, బుక్కుమార్కుల్లో ఉన్న unjustifyని నొక్కనక్కర్లేకుండానే ఆపని చేసెయ్యొచ్చు. దీన్ని విశ్లేషిస్తే [...]
పూర్తిగా చదవండి

బాబోయ్.. మొత్తం కెలికిపెట్టారు..

అనువాదాలు, జిల్లా గ్రంధాలయం, నా గోల, వెబ్ సైట్లు smadpr
మొత్తం గూగుల్ అనువాదలని కెలికేశారు. గూగుల్ తెలుగులో, ఆంగ్ల అక్షరాలు ఎందుకు వస్తున్నాయా అనుకుంటున్నా, ఇన్నాళ్ళూ! అనువదించమంటే, అలా ఎవరు చేసిపెట్టారో కానీ, ఇప్పుడు, పని రెండింతలు అయ్యేట్టు ఉంది. ఒక పకడ్బందీ ఉపాయం వేస్తే తప్ప అవ్వదు ఏమో? కొన్నాళ్ళు చూస్తాను,వల్లకాదు అనిపిస్తే ఇంక వదిలేస్తానండీ బాబు. మెల్లగా నాకు కూడా గూగుల్ మీద మోజు పోతోంది. మేరే చూడండి, గూగుల్ తెలుగు ఎంత అధ్వానంగా ఆంగ్ల అక్షరాలకి దాసోహం అయిపోయిందో.
పూర్తిగా చదవండి

అర్ధం పర్దం లేని నా పాకులాట

కుళ్ళు రాజకీయం, జిల్లా గ్రంధాలయం, తత్వం, తెలుగు వారు, నా గోల smadpr
మన నాలుగు రాష్ట్రాలను విద్యాసంపన్నమైన ప్రాంతాలుగా చెప్తుంటారు.. ప్రత్యేకంగా మన ఆంధ్ర దేశాన్ని అటు, ఉత్తర భారతదేశానికి, ఇటు దక్షిణాది రాష్ట్రాలకు లంకెగా వర్ణిస్తారు. ఎన్నో స్వదేశీ విదేశీ సంస్థల్లో మనవాళ్ళు అత్యంత కీలకపాత్రలు పోషిస్తున్నారు, నిజమే కానీ, మనవాళ్ళు తాము సంపాదించిన ఇటువంటి ఘనతలో కనీసం కొంత భాగాన్ని కూడా తిరిగి మన రాష్ట్రానికీ, రాష్ట్ర ప్రజలకు ఎందుకు అందించలేకపొతున్నారు అనేది నన్ను ఎప్పుడూ తొలిచివేసే విషయం. నేను ఎందుకు ఇలా అంటున్నాను అంటే, మీరే చూడండి… ఒక [...]
పూర్తిగా చదవండి

ఆవిరౌతున్న మన సినిమా నైపుణ్యం…

జిల్లా గ్రంధాలయం, నా గోల, సాహిత్యం..., సినిమా smadpr
మీరు ఒప్పుకుంటారో లేదో కానీ, ఒక రకంగా చెప్పాలంటే, ఇది నిజంగా నిజం. అన్ని రంగాలలో మనం మెల్లగా మరుగున పడిపోతున్నామేమో? చదావండి, మీకు కూడా అనిపిస్తుంది… ప్రస్థుతానికి, అత్యంత జనాదరణ ఉన్న మన సినిమా-నాటక రంగాన్నే తీస్కుందాం.. ఒకప్పిటి మన సినిమాని చూసి హర్షించని వాడులేడు. ఒకరకంగా చెప్పాలంటే, అప్పట్లో తెలుగు సినిమాలను, అరవంలో డబ్బింగ్ చేశేవారు..మరి ఇప్పుడు కధ అడ్డం తిరిగింది, తమిళ సినిమాలను తెలుగులోకి తర్జుమా చేస్కోవాల్సిన పరిస్థిథి! మనకి అవసరమా… సినిమాలు, కధలు, [...]
పూర్తిగా చదవండి

తప్పేంటి???

జిల్లా గ్రంధాలయం, తత్వం, నా గోల smadpr
నిజమే, నేను ఏ ఊళ్ళోనూ నాలుగేళ్ళకంటే ఎక్కువ బతికింది లేదు, బహుశా అందుకేనేమో, మిగితా వాళ్ళతో పోలిస్తే ఒకింత ఆలోచనలు ఎక్కువే మనకి!. ఐతే.. దేశభక్తి అణువణువునా ఉండాలి అని అనుకునే మనం, ప్రంతీయాభిమానం…వగైరా విషయాలకి వస్తే కోపం తెచ్చుకుంటాం. అందులో తప్పేముందబ్బా అని ఒకొక్క రోజు అలా కూర్చుని ఆలోచించేస్తూ ఉంటాను! ఏ? తన దేశాన్ని ఇష్టపడేవాడు తన రాష్ట్రాన్ని ప్రేమిస్తే తప్పేముంది? తన రాష్ట్రాన్ని ప్రేమించేవాడు తన భాషను అభిమానించడంలో తప్పేముంది? మరి అట్లాగే భాషని అభిమానించేవాడు, [...]
పూర్తిగా చదవండి

లేఖిని నాగార్జున గారికి:

అనువాదాలు, జిల్లా గ్రంధాలయం, వెబ్ సైట్లు, సాఫ్ట్ వేర్ smadpr
నాగార్జున గారూ.. మీరు తయారు చేసిన లేఖిని నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంతకముందు ఎవరన్నా నన్ను తెలుగు ఎలా రాయాలి అని అడిగితే, వారి కంప్యూటర్ను ఎలా కాంఫిగర్ చేస్కోవాలో చెప్తుంటే, అంతగా శ్రద్ధ చూపేవారు కాదు..లేఖిని వచ్చాక నాకు చెప్పడం తేలిక అయ్యింది.. నేను పరిశీలించిన మేరకు క్విల్ ప్యాడ్ కంటే కూడా ఇదే నయం. ఐతే, లేఖిని గురించి నా ఆశల/అభిప్యారల చిట్టా ఇక్కడ పెడుతున్నా.. 1. జి.పి.ఎల్ కి మార్చ గలరు 2. ఒక “ఫోరం” [...]
పూర్తిగా చదవండి

అనువాదాల గురించి ఒక మాట:

అనువాదాలు, జిల్లా గ్రంధాలయం, సాఫ్ట్ వేర్, సాహిత్యం... smadpr
ముందు మనం జీమయిలు మొత్తాన్ని 100% పూర్తి చేసేసి, ఆ తరవాత అందరం కలిసి దాన్ని క్షుణ్ణం గా పరిశీలించేసి దున్నేద్దాం…ఏమంటారు… అన్నట్టు…మీరు అనువదిస్తుండగా ఏదన్నా ఆంగ్ల పదానికి మీకు సరైన అనువాదం అనిపిస్తే దాన్ని బయటకి చెప్పడం మరిచిపోవద్దు.   ఉదా: నాకు ‘Delete’ కి ‘రద్దు ‘ కంటే ‘తొలగించు ‘ సరైంది అనిపించింది. ఇలాంటివన్నీ ఒకచోట పేర్చుకోగలిగితే వేరే సాఫ్ట్వేర్ అనువాదాలను తేలికగా చేస్కోవచ్చు….ఏమంటారు? ఈ అనువాదాలలో చాల మంది చెయ్యి వేస్తున్నారని తెలుసు, ఐతే చేసే వాళ్ళు [...]
పూర్తిగా చదవండి

జీ మెయిల్ యూఐ అనువాదం పూర్తి

గూగుల్, జిల్లా గ్రంధాలయం, నా గోల, వెబ్ సైట్లు smadpr
ఔను…జీమయిల్ యూఐ పూర్తయ్యింది… ఇది నా చేత్లో పూర్తయ్యినందుకు నాకు చాలా ఆనందంగా, గర్వంగా కూడా ఉంది…ఐతే నేను చేసినవి చాలా తక్కువ అనువాదాలు మాత్రమే…మిగితావి కూడా చెయ్యడానికి రెట్టింపు ఉత్సాహం ఇప్పుడే కదా వచ్చింది…ఇక చూడండి, నేను పరిగెడతాను. మళ్ళీ: పైది పోస్టు చేసిన పది నిమిషాల్లోనే గూగుల్ ప్రధాన సేర్చీ అనువాదం కూడా నా చేతిలోనే పూర్తయ్యింది… మళ్ళీ: జీమయిల్ ఈమయిలు భాగం కూడా పూర్తి…ఇది నేటి మూడవ విజయం… ఇప్పుడు తెల్లారిందిలే కానీ నాకు యమా నిద్దర [...]
పూర్తిగా చదవండి

విస్టా గురించి వాగుడు(2)

ఆటలు, జిల్లా గ్రంధాలయం, సాఫ్ట్ వేర్ smadpr
మొన్న విస్టా గురించి వాగినప్పుడు, అది ఎక్స్ పి కంటే కొంత ఎక్కువగా తెలుగుకి మేలు చేస్తుందనే విషయం అందరికీ అర్ధం అయ్యే ఉంటుంది, ఐతే మిగితా విషయాలు గిరుంచి మనలో కొంతమంది విండోస్ డెవలపర్లు పెదవి విరిచుకున్నట్టు ఉన్నారు. ఏది ఏమైనా వాగడం మొదలెట్టాను కనక, కొనసాగించడం తప్పని సరి అని అర్ధం అయ్యింది. ఐతే.. పేరు చెప్పని ఆసామి అన్నట్టు మ్యాక్ రోజుకి ఒకసారి క్రేష్ ఔతుంది అనే మాట అన్ని సార్లు వాస్తవం కాదండి! [...]
పూర్తిగా చదవండి

విస్టాలో ఏముంది?

జిల్లా గ్రంధాలయం, సాఫ్ట్ వేర్ smadpr
బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది…మైక్రోసాఫ్ట్, మొన్ననే వాళ్ళ సరి కొత్త ఆపరేటింగ్ సిస్టం విడుదల చేశారు అని…ఐతే! అందరు అంటున్నది నిజమే.. విస్టాలో, ఎక్స్ పి కంటే పెద్ద పెను మార్పులు ఏమీ కనపడలేదు, కేవలం కొంత ఆకర్షణీయంగా మాత్రం ఉంది, వీళ్ళు OS X ని కాపీ కొట్టారు అనే విష్యంలో వాస్తవం లేక పోలేదు. ( OS X అనేది APPLE మ్యాక్ కంపెనీ వారి  OS “ఓ యెస్” ). తదణుగుణంగానే ఇది మన [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS