అవి నేను బైకు నడపడం కొత్తగా నేర్చుకుంటున్నరోజులు… వెధవ ఆవేశం… డ్రైవింగు వచ్చీరాకుండానే మొదటిసారి మెయిను రోడ్డుమీదకి బయలు దేరాను. నాకలే భయమెక్కువ. కొంచెం దూరంలో జంక్షను, ట్రాఫిక్‌లైట్లూ పక్కనే యమభటుడిలా ఒక ట్రాఫిక్ కానిస్టేబులు. ట్రాఫిక్ పోతూందీ… పోతూందీ… పోతూందీ… “దేవుడా రెడ్‌లైటు పడకుంటా ఉంటే బాగుణ్ణు” అనుకుంటుండగానే రెడ్‌లైటు పడటమూ నా బైకు ఆగిపోవటమూ కొంచెం అటూ ఇటూగా జరిగిపోయాయి. కొత్త బైకూ, కొత్త పెళ్ళామూ ఒక పట్టాన లైన్లో పడవంటారు. తగ్గట్టు డ్రైవింగు కొత్త. ఇంక చెప్పేదేముంది? గ్రీన్ లైటు [...]
పూర్తిగా చదవండి