Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మైక్రోసాఫ్టు పన్నాగం

Technology, తరలము, పద్యం Giri
ఇది చదవండిత. చదువుసంధ్యల మున్గితేలుతు సాఫ్టువేరులు వాడగా (బదులు డబ్బులు లాగుదామని మడ్డియోచన మానితే) వదివి వేసిన వారలందరు వాడుకొందురు తేరగా, ముదిరిపోదురు వాటిలోబడి, మంచి రాబడి వారిచే కుదిరిపోవును ముందుముందిక, కొక్కెమే ఇది భేషుగా
పూర్తిగా చదవండి

అమెరికా, ఉంటా మరిక.. - 2

Career, తరలము, పద్యం, మత్తకోకిల Giri
ఇది వరకే చెప్పానుగా, శాము మామకు త్వరలో టాటా చెప్పాలని నిర్ణయించుకున్నామని.. త. అగుదుమే మరి ఒంటివారము, అన్ని బాటలు కొత్తవై మిగిలియున్నది ఒక్కవారము, వీడుకోలు సశేషమై మిగుల ప్రీతుల మిత్రులందరి వీడిపోవుట భారమై దిగులు చెందుట తథ్యమే. పయనించబూనితిమాశతో... మ.కో. సింగపూరుకు ఐనవారికి చేరువై నివసించ కో రంగనిర్వురి తల్లిదండ్రులు "రమ్ము దగ్గరనుండగా బెంగలుండవు బాధలుండవు మీరు వచ్చిన పండగే రంగుహంగు
పూర్తిగా చదవండి

అమెరికా, ఉంటా మరిక..

ఆటవెలది, ఉత్పలమాల, తరలము, తెలుగు, పద్యం Giri
ఉ. మోజిక తీరిపోయెను అమోఘ ధనార్తులదేశరాజమై రాజిలు "శాము మామ"కు పలాయన చిత్తుడనై ఎడంబడే రోజిక వచ్చెగావున పొలోమని - కట్టితి మూటముల్లెలూ బూజుని దుల్పివేసి అలవోకగ- వేగిరమే బయల్పడన్ త. కదలి రా ఇటవచ్చి చేరగ కాసుకాన్కలు భత్యముల్ బదిలి ఖర్చులు అద్దెకొంపకు బాడుగాదులు ఇచ్చెదమ్ వదలివచ్చిన చోటయుండిన మంచిసౌఖ్యపు భోగముల్ సదరుచోటుననుండు తప్పక సావకాశపు భోగ్యముల్ ఆ. వె. అనుచు నాకు మంచి అవకాశమొక్కటి చేతికందజేయ,
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS