Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పంచాంగ ‘శ్రవణం’ — సెటై్‌ర్

controversial, ఉగాది, తెలంగాణ, పంచాంగం, మీతో నేను, మూఢనమ్మకాలు, రాజకీయాలు, సరదాకి, సెటైర్ శ్రవణ్
కొత్త సంవత్సరం ఠంచనుగా వచ్చేసింది. అలవాటుగా రంగురంగుల పంచాంగాలు కూడా తెచ్చింది. గులాబీ పంచాంగం ప్రకారం “తెలంగాణ” ఈ యేడాది వచ్చేస్తుంది. పసుప్పచ్చ పంచాంగం ప్రకారం ప్రజలు “తెలంగాణ” ఒక కల అని గుర్తిస్తారు. అదేంటో, ఆకుపచ్చ పంచాంగంలో “తెలంగాణ” గురించి లేనేలేదు. కాషాయపు పంచాంగానికి నార్త్ఇండియా, కర్నాటక గురించి తెలిసినంతగా తెలుగునాడు గురించి తెలియదు. సందట్లో సడేమియా: ఊరు ఉత్తరమంటే కాదు దక్షిణమన్నట్టు, ఈ యేడాది 3 గ్రహణాలని అన్ని పంచాంగాలూ చెబుతుంటే ఒకాయన కాదు నాలుగు అని చాలెంజ్ చేస్తున్నాడు. [...]
పూర్తిగా చదవండి

చింత తెలంగాణకు, నీళ్లు డెల్టాకు

తెలంగాణ Dil
 ”సమైక్యాంధ్రలో రెండు ప్రాజెక్టుల కథ!”  పోస్టుకు కొనసాగింపు ఇది. వైజా సత్య గారూ, సామరస్యంగా మంచి చర్చకు ఆస్కారం కల్పించినందుకు కృతజ్ఞతలు. తెలంగాణా గురించి చర్చ జరిగే ప్రతి సందర్భంలోనూ వెలుతురు కన్నా వేడి ఎక్కువ పుడుతుంది, అందుకే కీలకాంశాలు మరుగున పడిపోతాయి. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోవడానికి నా అవగాహనలో ఉన్న కారణాలు ఇవి: 1) కృష్ణా, గోదావరి నదులు రెండూ తెలంగాణా ప్రాంతంలో చాలా దూరం ప్రయాణం చేశాకనే ఆంధ్రలో ప్రవేశిస్తాయి. తెలంగాణాలో కనుక వీటిపై భారీ ప్రాజెక్టులు కడితే తమకు నీటి [...]
పూర్తిగా చదవండి

సమైక్యాంధ్రలో రెండు ప్రాజెక్టుల కథ!

తెలంగాణ Dil
రెండో ఎస్సార్సీ గురించి నాగరాజు గారు స్పందిస్తూ మంచి ప్రశ్నలు అడిగారు. అయితే ఒక్కో ప్రశ్నకు వివరణ ఒక్కో పోస్టు ద్వారా ఇస్తేనే సముచితంగా ఉంటుందని నీటి పంపకంపై ఈ పోస్టు. నాగరాజు గారూ, నీటి వనరుల వినియోగం గురించి మీ అవగాహన కరెక్టే. మొదటి నుంచీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్షకు ప్రధాన ప్రేరణ నీటి పంపకంలో ఉన్న వివక్షనే. తెలంగాణ ప్రాంతం ఎక్కువ ఎత్తులో ఉండడం మూలాన నీటిని ఎత్తిపోతల ద్వారానే ఇవ్వాలని. అందుకే ఇక్కడ ప్రాజెక్టులు [...]
పూర్తిగా చదవండి

రెండో ఎస్సార్సీ - ఎప్పుడో చెయ్యిచ్చిన కాంగ్రెసు, తెరాస!

తెలంగాణ చదువరి
తెలంగాణ ప్రస్థానంలో మరో మలుపు కాబోయే ఎస్సార్సీ ఏర్పాటు దాదాపు ఖాయమైనట్టే! ఎస్సార్సీ వద్దని దాదాపుగా అన్ని పార్టీలూ గోల చేస్తున్నాయి. కాంగ్రెసు మాత్రం అదే మా విధానమని అంటోంది. ఇక ప్రజలకు చేస్తున్న మోసం విషయం .. నిజమే మోసం జరుగుతోంది.. అయితే ఆ మోసం ఇప్పుడు కాదు.., కాంగ్రెసు, తెరాస - రెండు పార్టీలూ కలిసి 2004 ఎన్నికలప్పుడే చేసాయి. ఒప్పందాన్ని స్పష్టంగా రాసుకోకుండా తమకిష్టమైన రీతిలో దాన్ని
పూర్తిగా చదవండి

తెలంగాణా గుండెచప్పుడు బతుకమ్మ

Telangana, తెలంగాణ Dil
ప్రకృతితో మనిషికి గల సంబంధాన్ని ప్రతింబింబించే పండుగల్లో బతుకమ్మ పండుగది విశిష్ట స్థానం. ఆగస్ట్ సెప్టెంబర్ మాసాల్లో తెలంగాణా జిల్లాల్లో జరిపే బతుకమ్మ, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షల నేపధ్యంలో తెలంగాణా సంస్కృతికి ఒక Unifying Symbol అయ్యింది. డిస్కవర్ తెలంగాణా వారు రూపొందించిన చక్కని బతుకమ్మ ప్రెజెంటేషన్ ఇక్కడ చూడండి: గత ఆదివారం కొలీగ్స్ తో కలిసి మోత్కూర్ వెళితే రంగు రంగుల పుష్పాలతో బతుకమ్మ పండుగకు స్వాగతం చెబుతున్నట్టు కనిపించింది మా ఇల్లు. రోడ్ పక్కన ఉన్న పసుపు [...]
పూర్తిగా చదవండి

తస్లిమా… థాకరే… సొతంత్రం… కోపం ఎందుకు వస్తుంది?

ఇండియా నేల, ఏవైనా, తెలంగాణ, తెలుగు నేల నాగరాజా
నిన్న గాక మొన్న ప్రవక్తను, ఇస్లాంను అవమానించిందని ఒక్క ఆడదానిని కొట్టడానికి 40 మంది “మగవాళ్ళ” ఠీ.వీ. ప్రదర్శన చూసాం కదా! అది మొదటి ఎపిసోడ్ అయితే, రెండవ ఎపిసోడ్ థాకరే గురించి ఎదో రాసారని ఔట్‌లుక్ పత్రికపై మరికొందరు (మగవాళ్ళు?) దాడి చేసారు. భేష్! మిగతా రాజకీలు ఎక్కువ శాతం చూస్తూ ఉన్నాయి కానీ మొరగడం లేదు, ఫరవాలేదు. భారత్ ‘మత’కీ జయ్. మర్చిపోయాను సొంతంత్రం వచ్చి 60 ఏండ్లయ్యిన సందర్భంగా (తెలంగాణా వారికి మినహా) [...]
పూర్తిగా చదవండి

ఆంధ్ర రాష్ట్రానికి రాయలసీమ వ్యతిరేకత - శ్రీ బాగ్ ఒప్పందం

తెలంగాణ, రాష్ట్రీయం Dil
తెలంగాణా ఉద్యమకారులు తరచూ ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడేప్పుడు జరిగిన “పెద్ద మనుషుల ఒప్పందం” గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. తెలంగాణా ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రం తో కలిపే ముందు జరిగిన ఈ ఒప్పందం వంటిదే రాయలసీమ ప్రాంతాన్ని, సర్కారు జిల్లాలతో కలిపి ఆంధ్ర రాష్ట్రం కలిపే ముందూ జరిగింది. దీన్నే శ్రీ బాగ్ ఒప్పందం అంటారు. ఇది వరకు ఒక పోస్టులో ఈ రెండు ఒప్పందాల గురించీ నేను ప్రస్తావిస్తే ప్రసాద్ చరసాల గారు ఈ ఒప్పందాల వివరాలు [...]
పూర్తిగా చదవండి

బయటపడిన బాతు

తెలంగాణ, తెలుగు వారు, నా గోల smadpr
ఏంటండీ, మునుపటి నా జాబు చూసి(తెలంగాణా) అందరికీ కోపం వచ్చినట్టు ఉంది. ఏంచెయ్యమంటారు, రాయక ముందు నాకు అలాగే ఉండేది. ఐతే, ఈ పోస్టు రాశాక తెలంగాణా వేర్పాటు వాదంపై తక్కినవారి పోస్టులు తగ్గాయి అనేది అక్షరాలా నిజం… మీరేమంటారు? వేర్పాటు అంత అవసరమా, మీరే ఆలోచించండి? చాలా చిన్న కారణాల కోసం అంత పెద్ద యుద్ధం ఎందుకు మాష్టారూ? నాకు తోచింది చెప్పా! ఇక మీ ఓపిక!!
పూర్తిగా చదవండి

మరదే, నాకు ఒళ్ళు మండుద్ది!

తెలంగాణ, తెలుగు వారు, నా గోల smadpr
ఎవడి పనిలో వాడు ఉంటే మన తెలుగువాళ్ళలో కొంతమందికి పనీపాటా లేక తెలంగాణా బ్లాగులు రాశేస్తున్నారు. వీళ్ళకి ఇదేం ఆనందమో నాకైతే అర్ధం కావట్లేదు. వీళ్ళలో కొంతమంది రాజకీయ స్వలాభం కోసం రాస్తుంటే, కొంతమంది ధనాన్ని ఆశించి రాస్తున్నారు. ఐతే ఎక్కువమంది ఏదో స్వాతంత్ర పోరాతం చేస్తున్నట్టు ఫీలైపోతున్నారు. నిజానికి వీళ్ళకి కాదు తిక్క, ఆ విషయం గురించి వీళ్ళ పోస్టులు చదివుతున్న మనకి. “తెలంగాణా ప్రజలు 1969 లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు”, “Six Point [...]
పూర్తిగా చదవండి

ఈ సమైక్య రాగం ఎవరి మేలు కొరకు?

తెలంగాణ Dil
నిన్న రాత్రి సెలూన్ కి వెళ్తే అక్కడ మన లగడపాటి రాజ్ గోపాల్ గారితో టివీ9 ఫోన్ ఇన్ ప్రోగ్రాం వస్తోంది. 610 జీవో, గురించి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి మనవాడి ప్రేలాపలనలు విని ముందు నవ్వొచ్చింది. ఆ తరువాత కోపమూ వచ్చింది. (వెనకటికోసారి అయ్యవారు ఇలానే అర్ధ సత్యాలను అసలు సత్యాలుగా చెలామణీ చెయ్యబోతే నేను నోరు మూసుకోమని సలహా ఇచ్చాను నా బ్లాగులో) తెలంగాణా విషయం లోనే ఎందుకు ఇన్ని అబద్దాలు? సమైక్యత, తెలుగు జాతి [...]
పూర్తిగా చదవండి

610 కొన్నిప్రశ్నలూ- జవాబులూ

తెలంగాణ Dil
నేను రాసిన 610కూ పాకిస్తాన్ కూ పోలికేమిటి అన్న పోస్టు పై మిత్రులు సత్య సాయి, సుధాకర్ అడిగిన ప్రశ్నలకు నా జవాబులివీ… 1)అమెరికా ఉదాహరణ మీరు ఇచ్చారు కాబట్టి నేను అదే ఉదాహరణ తో వివరించడానికి ప్రయత్నించాను. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధం, రెండు ప్రాంతాల మధ్య ఉన్న సంబంధం నిజంగానే ఒకటి కాదు. రాజధాని ఎవరికి చెందుతుందనే చర్చ మరో సారి చేద్దాం. మనం ఒక ప్రభుత్వ నియమాన్ని, కొందరు వ్యక్తులు ఉల్లంఘించి అక్రమంగా [...]
పూర్తిగా చదవండి

610 కూ పాకిస్తాన్ కూ పోలికేమిటి?

తెలంగాణ Dil
610 జీవో గురించి గత నెల రోజులుగా చాలా వాడిగా, వేడిగా చర్చ సాగుతున్నది. ఈ చర్చలో సంయమనం కోల్పోయిన రాజకీయ నేతలు అనవసరంగా రెచ్చగొట్టే మాటలు కూడా ఉపయోగిస్తున్నారు. తలా ఒక మాట అంటూ అసలు సమస్య మరుగున పడి ఏవేవో అపోహలూ, అపార్ధాలు, పెడార్ధాలు మధ్యలోకి వచ్చాయి. (శోధన) సుధాకర్ ఈ పరిస్థితి పై ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక పోస్టు కూడా చేశాడు. అక్కడక్కడ బ్లాగర్లు రాసిన కామెంట్లు కూడా చదివాను. చాలా రోజులుగా [...]
పూర్తిగా చదవండి

బాసరకో న్యాయం బందరుకో న్యాయం!

తెలంగాణ Dil
గత వారం జరిగిన రెండు సంఘటనలు ఒక విషయాన్ని చాలా నగ్నంగా నిరూపించాయి. ఈ రాష్ట్రం లో తెలంగాణకు చాలా విషయాల్లో అన్యాయం జరుగుతోందని ఎంతో కాలంగా చెబుతున్న విషయాన్ని వైయెస్ ప్రభుత్వం నిస్సిగ్గుగా, నిర్లజ్జగా నిరూపించి చూపింది. అదిలాబాద్ జిల్లాలో బాసర ఐఐటీ విషయంలో ఒక న్యాయం, మచిలీపట్నం ఓడ రేవు విషయంలో మరో న్యాయం జరిగింది మన కళ్ల ముందే. ప్రజల మనోభావాల విలువ ప్రాంతానికో విధంగా ఉంటుందని సెలవిస్తుంది మన స్వర్ణోత్సవ రాష్ట్ర ప్రభుత్వం. [...]
పూర్తిగా చదవండి

అడ్డుగోడలు, అడ్డగోలు మాటలు

తెలంగాణ చదువరి
నాగార్జునసాగరుకు అడ్డంగా గోడ కడతారట. అబద్ధాల గోడలు కట్టారు, ప్రజలను చీలుస్తూ గోడలు కట్టారు, ఇక సాగరును చీలుస్తారట. కోస్తా రాయలసీమ వాసుల పట్ల వీళ్ళ దౌష్ట్యం ఇదే మొదటిది కాదు, గతంలో కొన్ని వందల సార్లు అనేకమంది నాయకులు అన్నమాటలే ఇవి. ఏడుపుగొట్టు పిల్లకాయలు మారాం చేసినట్లు ఉంది వీళ్ళ గోల. పులిచింతల కడితే తెలంగాణకు నష్టం లేదు, అయినా సరే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రా అధికారులు దొంగలన్నారు.
పూర్తిగా చదవండి

టైగరు, పేపరు టైగరూ

తెలంగాణ చదువరి
తెరాస విశ్వరూప ప్రదర్శన సభను ఏర్పాటు చెయ్యబోతోంది. అయితే ఆ సభకంటే నెల ముందే నరేంద్రకు కేసీయార్ విశ్వరూప సందర్శన యోగం కలిగింది. నరేంద్ర కేసీయారును అన్యాపదేశంగా విమర్శించినందుకు ఫలితమది. సరిగ్గా కృష్ణుడి విశ్వరూపాన్ని తట్టుకోలేకపోయిన అర్జునుడి లాగానే నరేంద్ర కూడా కేసీయార్ విశ్వరూపాన్ని తట్టుకోలేక బేజారై పోయాడు. అనేక బాహువులు, ముఖాలు, కళ్ళూ.., ముఖ్యంగా ముక్కు వగైరాలతో భయం గొలుపుతున్న కేసీయార్
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS