Can't see Telugu? Learn here. More Questions? Ask here.

జోకానువాదం -41: మెరుపు దోపిడి

ఏవైనా, నవ్వులు నాగరాజా
న్యూయార్కు నగరంలో నడిచి వెళ్తున్న తాబేలును ఒక నత్తల బృందం నిలువునా దోచుకుంది. కలం కాగితం పట్టుకొన్న పోలీసు డిటెక్టివ్ ఏం జరిగిందో వివరించమని తాబేలును అడిగాడు. అయోమయపు చూపులతో ఆ తాబేలు ఇలా జవాబిచ్చింది, “ఏమీ తెలియడం లేదు, అంతా వేగంగా జరిగిపోయింది.”
పూర్తిగా చదవండి

జోకానువాదం - 40: నాస్తికురాలు

అనువాదం, ఏవైనా, నవ్వులు నాగరాజా
స్వతంత్ర భావాలు గల ఒక యువ టీచరు పిల్లలకు తాను నాస్తికురాలు అని పలికి, ఇంకెవరైనా నాస్తికులు ఉన్నారా అని క్లాసులో అడిగింది. నాస్తికత్వం అంటే ఏమటో అర్థం కాకపోయినా, టీచరుతో ఏకీభవించటానికి పోటీపడి దాదాపు అన్ని చేతులు గాల్లోకి లేచాయి. ముద్దులొలికే బుజ్జి మాత్రం అందరితో పాటు చేతులెత్తలేదు. ఎందుకు అని టీచరు అడిగింది. “ఎందుకంటే నేను నాస్తికురాలిని కాను” “మరి నీవు ఎవరివి” “నేను దేవున్ని నమ్ముతాను” టీచరు అహం దెబ్బతిన్నది, మొహం ఎర్రబడింది. నీవు ఎందుకు నమ్ముతావో చెప్పు అని [...]
పూర్తిగా చదవండి

జోకానువాదం - 39: వార్త

అనువాదం, ఏవైనా, నవ్వులు నాగరాజా
రాజధానికి వెళ్ళి వచ్చిన సందర్భంగా, ఏం జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలంతో, నసీరుద్దీన్ చుట్టూ గుమికూడారు ఊరి ప్రజలు. “ప్రస్తుతానికి…”, చెప్పడం మొదలుపెట్టాడు నసీరుద్దీన్, “మహారాజు నాతో మాట్లాడాడని మాత్రం చెప్పగలను”, ఒక్క క్షణం ఆగాడు. ఈ వార్తను అందరికి పంచడానికి పట్టలేని ఆనందంతో తలో వైపు పరుగు తీసారు, ఒక్క చవటాతిచవట తప్ప. “ఇంతకు మహారాజు నీతో ఏమని అన్నాడు?” మిగిలిన వాడు అడిగాడు. మీ అందరికి తెలుపదలుచుకున్నది, మహారాజు నాతో అన్నది ఏమిటంటే, “దారికి అడ్డం తొలగరా, మూర్ఖుడా” అని.
పూర్తిగా చదవండి

జోకానువాదం - 39: వార్త

అనువాదం, ఏవైనా, నవ్వులు nagaraja
రాజధానికి వెళ్ళి వచ్చిన సందర్భంగా, ఏం జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలంతో, నసీరుద్దీన్ చుట్టూ గుమికూడారు ఊరి ప్రజలు. “ప్రస్తుతానికి…”, చెప్పడం మొదలుపెట్టాడు నసీరుద్దీన్, “మహారాజు నాతో మాట్లాడాడని మాత్రం చెప్పగలను”, ఒక్క క్షణం ఆగాడు. పట్టలేని ఆనందంతో ఈ వార్తను అందరికి పంచడానికి తలో వైపు పరుగు తీసారు, ఒక్క చవటాతిచవట తప్ప. “ఇంతకు మహారాజు నీతో ఏమని అన్నాడు?” మిగిలిన వాడు అడిగాడు. మీ అందరికి తెలుపదలుచుకున్నది, మహారాజు నాతో అన్నది ఏమిటంటే, “దారికి అడ్డం తొలగరా, మూర్ఖుడా” అని.
పూర్తిగా చదవండి

జోకానువాదం - 38: పోలిక

ఏవైనా, నవ్వులు నాగరాజా
“హే ముల్లా..” పలకరించాడు స్నేహితుడు, “..మీ ఆవిడ ఎలా ఉంది?” “దేనితో పోలిస్తే?” నసీరుద్దిన్ జవాబు.
పూర్తిగా చదవండి

జోకానువాదం - 38: పోలిక

ఏవైనా, నవ్వులు nagaraja
“హే ముల్లా..” పలకరించాడు స్నేహితుడు, “..మీ ఆవిడ ఎలా ఉంది?” “దేనితో పోలిస్తే?” నసీరుద్దిన్ జవాబు.
పూర్తిగా చదవండి

జోకానువాదం - 36,37: సత్యం, కూడలి

అనువాదం, ఏవైనా, నవ్వులు నాగరాజా
సత్యం: “సత్యం అంటే ఏమిటి?” శిష్యుడు నసీరుద్దీన్‌ను ప్రశ్నించాడు. “నాడు - నేడు - ఎన్నడూ నేను మాట్లాడనిది, ఇక మాట్లాడబోనిది!” కూడలి: “ఈ కూడలి దగ్గర ఎందుకు కూర్చున్నావు ముల్లా?” “ఏనాటికైనా ఇక్కడ ఏదో ఒకటి జరగకపోదు, అప్పుడిక్కడ ఒక పెద్ద గుంపు పోగవుతుంది. అప్పుడు ఇంత దగ్గరగా చూసే అవకాశం రాకపోవచ్చు, అందుకని నేనిప్పుడే కూర్చొని చూస్తున్నాను.” అనువాద మూలం
పూర్తిగా చదవండి

జోకానువాదం - 35: బాలుని ఉత్తరం

ఏవైనా, నవ్వులు నాగరాజా
ఒక చిట్టి బాలుడు వెయ్యి రూపాయలు కావాలని రెండు వారాలు దీక్షగా ప్రార్థన చేసాడు. ఏమీ కాలేదు. ఆ తరువాత వెయ్యి రూ. కోసమని దేవునికి ఉత్తరం వ్రాద్దామని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడైతే తపాలా కార్యాలయం వారు దేవుడు, ఇండియా అనే అడ్రసును చూసారో, వెంటనే దానిని ప్రెసిడెంటుకు మళ్ళించారు. దేశాధ్యక్షుడు అది చూసి ఎంతో సంతోషించి, ముచ్చటతో ఆ బాలునికి 50 రూ. పంపించమని సెక్రటరీని ఆదేశించాడు. ఆ బాలునికి 50 రూపాయలు చాలు అని ఆయన [...]
పూర్తిగా చదవండి

జోకానువాదం - 33, 34: వంటింట్లో దొంగ, తలపాగా

అనువాదం, ఏవైనా, నవ్వులు నాగరాజా
33. ముల్లా నసీరుద్దీన్ కుటుంబం అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న కాలం. ఒకరోజు ఆయన భార్య మధ్యరాత్రి నిద్ర లేపి చెవిలో గుసగుసలాడింది, “నసీరుద్దీన్, వంటింట్లో ఎవడో దొంగ చొరబడ్డాడు!” “ష్.. పిచ్చిదానా…!”, జవాబిచ్చాడు నసీరుద్దీన్, “వాడికి ఏదైనా దొరకనీ, అప్పుడు మనం దాన్ని లాక్కుందాం!” 34. ముల్లా నసీరుద్దీన్ తెలివి, చమత్కారం ఎప్పుడు కూడా అతనికి సహాయపడుతుండేది. చదువు రాని ఒకాయన ఉత్తరాన్ని పట్టుకొని వచ్చాడు. - ముల్లా, దయచేసి ఈ ఉత్తరాన్ని నాకు చదివిపెట్టగలవు. నసీరుద్దీన్‌కు ఆ ఉత్తరంలో ఒక్క ముక్క కూడా అర్థం [...]
పూర్తిగా చదవండి

జోకానువాదం - 32: ఉద్యోగ పరిక్ష

అనువాదం, ఏవైనా, నవ్వులు నాగరాజా
ఒక కంప్యూటరు కంపెనీలోని ఒకే ఉద్యోగానికి ఇద్దరు యువ ఇంజనీర్లు పోటీపడ్డారు. వారిద్దరి అర్హతలు సరి సమానంగా ఉన్నాయి. ఎవరిని తీసుకోవాలో నిర్ణయించటానికి ప్రాజెక్టు మేనేజరు ఒక చిన్న పరిక్షను పెట్టాడు. పరిక్షలో ఇద్దరు ఒక ప్రశ్నకు మాత్రమే జవాబు తప్పుగా రాసారు. మొదటివాడి వద్దకు వెళ్ళి మేనేజరు, “మేము అతనికి ఈ ఉద్యోగాన్ని ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము, మా కంపెనీలో చేరాలనుకున్నందుకు కృతజ్ఞతలు” అని చెప్పాడు. “మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు, మా ఇద్దరికీ 9 ప్రశ్నలే కరెక్టుగా [...]
పూర్తిగా చదవండి

జోకానువాదం - 31: నాస్తికుడు

అనువాదం, ఏవైనా, నవ్వులు నాగరాజా
ఒక చక్కని వేసవి దినాన, నీలాకాశం క్రింద చేపలు పడుతున్న ఒక నాస్తికుడిని అమాంతంగా మూడు తలల రాక్షసి ముట్టడించింది. దాని దెబ్బకు పడవ, అతడు పైకి ఎత్తుగా విసిరివేయబడ్డారు. క్రిందికి వస్తున్న పడవను, అతనిని కలిపి మింగటానికి అది నోరు తెరిచింది. ఇంకొన్ని క్షణాల్లో అతను నోటిలో పడతాడనగా అతను దేవునికి మోకరిల్లి, “ఓ దేవుడా, నన్ను కాపాడు!” అని అరిచాడు. మరుక్షణంలో ఆ భీకరమైన దృశ్యం కదలిక లేకుండా అలాగే నిలిచిపోయింది. ఆ [...]
పూర్తిగా చదవండి

జోకానువాదం - 30: గట్టి ప్రార్థన

అనువాదం, ఏవైనా, నవ్వులు నాగరాజా
ఇంట్లో తల్లి తండ్రులు, నాన్నమ్మ అందరు కనులు మూసి నిశ్శబ్దంగా ప్రార్థన చేస్తున్నారు. చిన్నోడు - “ఓ దేవుడా, దయ ఉంచి అమ్మను, నాన్నను, మా కుటుంబాన్ని, అందరిని దీవించి చల్లగా చూడు.” వెంటనే కనులు తెరిచి, “అలాగే నా పుట్టిన రోజుకు సైకిల్‌ని మరచిపోవద్దు!!” అని గట్టిగా అరిచాడు. “అలా అరవాల్సిన అవసరం లేదు,” అమ్మ సలహా ఇచ్చింది, “దేవుడికి చెవిటితనం ఉండదు.” “తెలుసు,” అన్నాడు చిన్నోడు, “కానీ నాన్నమ్మకు ఉంది కదా.”
పూర్తిగా చదవండి

జోకానువాదం - 29: రహస్య ఔషధం

అనువాదం, ఏవైనా, నవ్వులు నాగరాజా
అనంతమైన యౌవ్వనం దొరుకుతుంది అని “రహస్య ఔషధం” టాబ్లెట్లు అమ్ముతున్న ఒక మోసపూరిత యువకుడిని విల్లోబి కౌంటీ, న్యూ హాంప్‌షైర్ రాష్ట్రం పోలీసులు పట్టుకున్నారు. అతని క్రిమినల్ రికార్డులను వెతికిన స్టేషన్ పోలీసు ఒకరు ఈ వ్యక్తి సరిగ్గా ఇదే నేరం చేస్తూ పట్టుబడిపోవడం 5వ సారి అని నిర్థారించాడు. ఇంతకు మందు 1794, 1856, 1928 మరియు 1983 సంవత్సరాల్లో అతను ఈ నేరం మీద అరెస్టయ్యాడు.
పూర్తిగా చదవండి

జోకానువాదం - 29: రహస్య ఔషధం

అనువాదం, ఏవైనా, నవ్వులు నాగరాజా
ఎంత వద్దనుకున్నా ఇది చూసిన తరువాత ఊరుకోలేక వ్రాస్తున్నాను. మనకు (ఇండియాకు) ఎంత బహిరంగంగా అన్యాయం జరుగుతుందో తెలుస్తుంది. ఇంతకన్నా మోసం మరొకటి లేదు. నిన్న గాక మొన్న హైదరాబాదులో బాంబు పేలుళ్ళు జరిగాయి కూడా. భర్తలను, కొడుకులను పోగొట్టుకొని న్యాయం కోసం ఎదురుచూసిన అమాయక అమెరికా పౌరులు తమ అనుభవాలను సినిమాగా తీసారు. ఇందులో ఇండియా పరిశోధన, కొన్ని అమెరికన్ శక్తులు-ఐ.ఎస్.ఐల సంబంధాలు కనబడ్డప్పుడు నాకు మతి పోయింది. దయచేసి మొత్తం చూసి కానీ వ్యాఖ్యలు వ్రాయరాదు [...]
పూర్తిగా చదవండి

జోకానువాదం - 27: మూర్ఖ రంజనం

ఏవైనా, నవ్వులు నాగరాజా
నేనొకప్పుడు “మూర్ఖున్ని గంటల తరబడి రంజింపజేయడం ఎలా” అనే పుస్తకాన్ని రాసాను. అది ఇలా సాగింది: “ఒక మూర్ఖున్ని గంటల తరబడి రంజింపజేయాలంటే, తరువాతి వాక్యాన్ని చదవగలరు. ఒక మూర్ఖున్ని గంటల తరబడి రంజింపజేయాలంటే, ఇంతకు ముందు వాక్యాన్ని చదవగలరు.” ఆ పుస్తకం సరిగా అమ్ముడుపోలేదు. తమకు ఉన్న అతి కొద్ది వ్యవధిలో జనాలకు ఇది మరీ పొడుగు అవుతుందని ఆలోచించి తిరిగి వ్రాసాను. రెండవ ఎడిషన్ ఇలా వచ్చింది: “ఒక మూర్ఖుడిని గంటలతరబడి బిజీగా వుంచడానికి, [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS