ఒకప్పుడు
మనసు కిటికీలోంచి వచ్చి
వెన్నెలంతా గుండె గదిలో పరచుకునేది
ఇప్పుడు
బాధ్యతల పరదాలు
నెమ్మదిగా కిటికీలు తెరిచాక
పరదా సందుల్లోంచి
అప్పుడప్పుడు
ఓ వెన్నెల తునక మాత్రం
లోపలికి జారిపడుతుంటుంది.
- ధరణిప్రగడ రాధిక, (ఆంధ్ర ప్రభ వారపత్రిక 11-12-1991)
ఈ కవితని నేను ఎన్నిసార్లు చదివుంటానో, ఎంత మందికి quote చేసానో నాకే గుర్తులేదు.
రచయిత్రి వెన్నెల గురించి మాట్లాడినా, నేను దాన్ని సాహిత్యానికి అన్వయించుకున్నాను. ఎటువంటి బాధ్యతలు లేనప్పుడు (కాలేజి రోజులలో), ఎన్నెన్ని పుస్తకాలు చదివేవాళ్ళం? ఇప్పుడు బాధ్యతలు మీదపడ్డాకా, [...]
పూర్తిగా చదవండి