Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నా అనుకోలు (assumption) తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
క్రీ.శ. 2014 తరువాత ప్రత్యేక రాష్ట్రవాదాలు శాశ్వతంగా కనుమరుగవుతాయి.
పూర్తిగా చదవండి

నా అనుకోలు (assumption) తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
"మెగా"కాకపోవడానికీ కావడానికీ మధ్య....-4 (కోడి రామకృష్ణో ఇ.వి.వి.నో సరిగా గుర్తులేదు) "హీరో అంటే ఏమిటి ? దర్శకుడు సృష్టించిన భ్రమ"అన్నారొక ప్రముఖ దర్శకుడు.ఆ భ్రమని వాస్తవంగా తీసుకుని ఆ హీరోల మీద పిచ్చి అభిమానం పెంచుకునేవాళ్ళ పట్ల నాకు కొన్నేళ్ళ క్రితం చిన్నచూపుండేది.కాని ఇప్పుడా అభిప్రాయాన్ని మార్చుకున్నాను."ఉత్తరాది విలన్లూ, బొంబాయి భామలూ రాజ్యమేల్తున్న తెలుగు చిత్రసీమలో ఈనాటికీ మన తెలుగువాడే మన మెగాస్టార్"అనే సత్యం స్ఫురించాక.ఈ దర్జా ఇండియాలో అన్ని రాష్ట్రాలవాళ్ళకీ లేదని గుర్తించడం అవసరం.ముఖ్యంగా ఉత్తరాదిన హిందీ హీరోలే అన్ని రాష్ట్రాలకూ హీరోలు.వాళ్ళ హీరోయిన్‌లే అన్ని రాష్ట్రాలకూ హీరోయిన్‌లు.వాళ్ళ విలన్‌లే అన్ని భాషల వాళ్ళకూ విలన్‌లు.హిందీ సినిమాలు తప్ప వినోదానికి ఉత్తరాదిన మఱో అర్థమే లేదు.మనకింకా ఆ ఖర్మ పట్టలేదు.ఆ విషయంలో మనం ఈనాటికీ సర్వస్వతంత్రులం. ఒక మనిషిని ...
పూర్తిగా చదవండి

నా అనుకోలు (assumption) తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
"మెగా"కాకపోవడానికీ కావడానికీ మధ్య....-3శ్రీ NTR రాజకీయరంగప్రవేశం లాగానే 7వ దశకం చివర్లో శ్రీ చిరంజీవి సినిమారంగప్రవేశం ఆంధ్రదేశానికి ఒక చారిత్రిక అవసరం.కాంగ్రెస్ పార్టీ యొక్క ముక్కిపోయిన ముప్పై అయిదేళ్ళ డ్రెయినేజి రాజకీయాల నుంచి రాష్ట్రానికి విముక్తి ప్రసాదించడానికి NTR రావాల్సి వచ్చినట్లే తెలుగు సినిమారంగానికి కొత్త రక్తం నింపడానికి చిరంజీవిలాంటివాడొకడు అప్పుడు అవసరమయ్యాడు.పాత సినిమాల సంసారపక్షపు హీరోయిజం నుంచి వీధికెక్కగల మొనగాడి పాత్రలలో జీవించేవాడొకడు కావాల్సి వచ్చాడు.శ్రీ చిరంజీవి ఆ అవసరాన్ని సరిగ్గా సకాలంలో నెఱవేర్చారు.మొదట్లో పాత్రల కోసం ఆయన ఎంపిక చేసుకోబడగా తరువాత ఆయన కోసం పాత్రలు పుట్టుకొచ్చాయి.ఇది ఒక అనివార్య ప్రక్రియ.శ్రీ చిరంజీవి పరిశ్రమలో అడుగిడకముందు నూటికి 99 శాతం తెలుగు సినిమాల్లో పాత్రల మంచీ చెడూ బ్లాక్ అండ్ వైట్ లాగా పూర్తి వైరుద్ధ్యం (contrast) తో చూపించబడేవి.హీరో శ్రీరామచంద్రుడిలా సకల సద్గుణాభిరాముడు.అతనిలో ఈషత్తయినా కళంకం ఉండడానికి వీల్లేదు.చిరంజీవి వచ్చాక ఈ సున్నం తెలుపు హీరో పాత్రలు కనుమఱుగయ్యాయి.హీరో స్వభావంలో కొంచెం బూడిదరంగు (grey) కూడా ఉండడంలో తప్పులేదనే ...
పూర్తిగా చదవండి

నా అనుకోలు (assumption) తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
"మెగా"కాకపోవడానికీ కావడానికీ మధ్య....- 2షుమారు గత పాతికేళ్ళుగా తెలుగు సినిమారంగం (మంచికో చెడుకో) శ్రీ చిరంజీవినే కేంద్రబిందువుగా చేసుకుని రూపొందుతూ వచ్చిన నేపథ్యంలో శ్రీ చిరంజీవి యొక్క వ్యక్తిగత విజయాలు ఏ విధంగా అపార్థానికి గురయ్యాయో అవగాహన చేసుకుంటే తప్ప ఈ సినిమా రొంపికి కారణాలు బోధపడవు.1. అన్నిటికంటే ముందు అర్థం చేసుకోవలసినది - శ్రీ చిరంజీవికి గాని ఆయన కుటుంబానికి గాని అంతకుముందు ఏ విధమైన సినిమా నేపథ్యమూ లేదు.ధనబలమూ లేదు.కులబలమూ లేదు.గాడ్‌ఫాదర్లూ లేరు.ఆయన కేవలం తన వ్యక్తిగత ప్రతిభా పాటవాల మీద ఆధారపడి నెగ్గుకొచ్చిన మహామనిషి.2. శ్రీ చిరంజీవి మొదటి నుంచి మెగాస్టార్ కాడు.ఈ బిరుదు ఆయన పదీ, పన్నెండేళ్ళ పాటు సినిమారంగంలో అహోరాత్రాలూ శ్రమించగా వచ్చినటువంటిది.ఆయన మెగాస్టార్ కావడానికి కారణం మనకిప్పుడు సుపరిచితమైన చిరంజీవి మార్కు పిచ్చకొట్టుడూ, బండలాగుడూ కాదు.1986 తరువాత ఆయన్ని అందరూ కలిసి ఆ తరహా పాత్రల్లో బంధించిపారేశారు.ఇప్పటికీ అలాగే బంధించేస్తున్నారు.ఆయన్నే ...
పూర్తిగా చదవండి

నా అనుకోలు (assumption) తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
"మెగా" కాకపోవడానికీ కావడానికీ మధ్య....తెలుగు సినిమా ఇలా ఎందుకు తయారయిందని కొందరు మిత్రులు అప్పుడప్పుడు తమ బ్లాగుల్లో వ్యక్తం చేసిన ఆవేదన గుఱించి అలోచిస్తున్నాను.నాకు గుర్తున్నంతవఱకు ఈ దిగజారుడుకు మూలాలు మెగాస్టార్ చిరంజీవి 1980 లలో నటించిన సినిమాలలో ఉన్నాయి.అంటే మెగాస్టారే దీనికి కారకుడని నేనంటున్నానని అపార్థం చేసుకోవద్దు.ఆ సినిమాలు ఆయన నిర్మించినవి కావు.ఆయన నటించినవి మాత్రమే.ఒక నటుడుగా శ్రీ చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమకు లభించిన ఒక అనర్ఘరత్నం.ఆ రత్నం పరిశ్రమలో అడుగుపెట్టిన ఏడెనిమిదేళ్ళకు గాని దాని విలువ పరిశ్రమకు తెలియలేదు.ఆయన కుఱ్ఱకారు పాత్రలు ధరించడం మానేశాక సరిగ్గా అలాంటి రత్నం కోసం మన పరిశ్రమ ఎన్నో రాంగ్ నెంబర్లు నొక్కుతూ వస్తోంది.ఇప్పుడు ఆయనకు డూపుల్లాంటివాళ్ళు చాలామంది తయారయ్యారు గాని, మఱో చిరంజీవి మాత్రం ఇంతవఱకు లభించలేదు."లభించరు కూడా" అని నిస్సంశయంగా చెప్పవచ్చు.ఆ రోజుల్లో శ్రీ చిరంజీవి కాకుండా వేఱే హీరోలు చాలామంది ఉండగా కేవలం శ్రీ చిరంజీవి సినిమాల వల్లే తెలుగు సినిమా భ్రష్టుపట్టిందనడం సమంజసమా ? ...
పూర్తిగా చదవండి

నా అనుకోలు (assumption) తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
రహస్యమంత్రం (Unlearn...Unlearn...Unlearn...)చాలా కాలం క్రితం ఒక పిచ్చిపిల్ల ఉండేది. ఆమె తన మొగుడే ప్రపంచంలో అందరికన్నా చాలా గొప్పవాడని నమ్ముతూండేది. ఆమెనొక దుర్మార్గుడు ఎత్తుకెళ్ళాడు. వాడు నిజానికి ఆమె మొగుడికన్నా అన్ని విధాలా గొప్పవాడు. ఆ విషయం ఆమెకి తెలియజెప్పాలని మనిషుల్ని కూడా ఏర్పాటుచేశాడు. వాళ్ళు అతని గొప్పతనం గురించి చెబుతూ ఆమె బుఱ్ఱ తినేశారు. కాని ఆ పిచ్చిపిల్ల తన మొగుడే అందరి కన్నా గొప్పవాడని బల్ల గుద్ది వాదించింది. ఆమె మూలాంగా ఆమె మొగుడు నిజంగానే గొప్పవాడయ్యాడు. అందరూ అతన్ని దేవుడని కొలవడం మొదలుపెట్టారు. ఆమే గనక మనసు మార్చుకుని ఉంటే అతన్నెవరూ దేవుడుగా కొల్చేవారు కారు.చాలా సంవత్సరాల క్రితం గుజరాతులో ఒక పిచ్చి పిల్లాడు ఉండేవాడు.వాడు శ్ర్వణకుమారుడి కథ సత్యహరిశ్చంద్రుడి కథ నాటకాలుగా చూసి తానూ అలాగే అవ్వాలని తహతహలాడాడు. ఆ కథలన్నీ నిజమని నమ్మాడు.ఆ ఆదర్శాలు నిజమని నమ్మాడు. ఇప్పుడు ఆ పిల్లాడి పుట్టినరోజు వందలాది దేశాలకు పండుగగా మారింది.పిచ్చితనం గెలిచింది.అమాయకత్వం గెలిచింది. ప్రేమ గెలిచింది.అభిమానం గెలిచింది.స్వార్థం ఓడిపోయింది. అతితెలివి ఓడిపోయింది. ...
పూర్తిగా చదవండి

నా అనుకోలు (assumption) తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
ఈ కుళ్ళు మనందరి సృష్టి చెంత సెల్లు -సొంత యిల్లువింత కారు - కొంత క్యాషు ఇవే మన ఆధునిక చతుర్విధ పురుషార్థాలు.నిలబడి నీళ్ళు తాగడమనే తత్వశాస్త్రాన్ని నమ్మడం ఎప్పుడో మానేశాం.పరుగెత్తి పాలు తాగడమే ఈనాటి తాజా పోకడ.అదేమంటే-"ఇండియాలో నూటికి 60 శాతం మంది యువకులే కాబట్టి ఈ మాత్రం దూకుడు అనివార్య"మని సెలవిస్తున్నారు.బానేవుంది.కాని ఎంతగా యువకులైతే అంతగా ఆశపోతుతనం కూడా ఉంటుంది.అదీగాక ఇదే యువజనాభా 30-35 ఏళ్ళ తరువాత ముసలి జనాభా అవుతుంది.అప్పుడు"మన అన్ని దుర్దశలకీ కారణం మనలో 60 శాతం మంది ఏ పనీ చెయ్యలేని ముసలివాళ్ళుండడం"అని కొత్త పల్లవి ఎత్తుకుంటారు.కలియుగంలో ధర్మమనే ఎద్దు సత్యమనే ఒంటికాలి మీద నడుస్తుందని పుస్తకాల్లో రాశారు.నాకయితే ఆ వొంటికాలు కూడా ఎక్కడా కనిపించడంలేదు.అన్నిచోట్లా మాటయిచ్చి తప్పడమే కనిపిస్తోంది.అలా తప్పలేనివాడు వెధవన్నర వెధవలా చూడబడ్డం కూడా కనిపిస్తోంది."తాడేపల్లిగారూ ! అద్దెకి ఇల్లు తీసుకుంటున్నాం, కొంచెం వాస్తు చూసిపెట్టండి"అని ...
పూర్తిగా చదవండి

నా అనుకోలు (assumption) తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
రాజకీయాల్లోకి నారాయణ ?నెల్లూరు నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపక అధినేత డాక్టర్ శ్రీ పి.నారాయణ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికల్లా రాజకీయ రంగప్రవేశం చెయ్యడానికి సన్నద్ధమవుతున్నట్లు ఇంకా ధ్రువీకరించబడని అనాధికారిక భోగట్టా తెలియజేస్తోంది.ఇటీవలి దాకా శ్రీ చైతన్య (హైదరాబాద్)ని విజయపథంలో నడిపించి తరువాత శ్రీ వైష్ణవీ కళాశాలల్ని స్థాపించిన శ్రీ కాట్రగడ్డ శ్రీనివాసరావుగారికి తన సంస్థల నిర్వహణ బాధ్యతల్ని అప్పగించబోతున్నారని కూడా తెలుస్తోంది.అయితే అలాంటి గాలివార్తల మీద ఇక్కడెందుకు రాయడం ? అంటే, అలాంటిది ఒకందుకు శుభపరిణామమేనని చెప్పడానికే. ప్రస్తుతం కాంగ్రెస్ ద్వారా అధికారంలోకొచ్చిన అనాగరికుల/అప్రాచ్యుల స్థానే విద్యాధికులూ మేధావులూ వివిధ రంగాల సాధక బాధకాల గురించి క్షుణ్ణంగా అవగాహన ఉన్నవారూ స్వయంగా మహాసంస్థల్ని నడిపేవారూ పగ్గాలు చేపట్టితే బావుంటుంది.అధికారంలోకొచ్చాక సంపాదించుకునేవారు మనకొద్దు.బాగా సంపాదించుకుని అధికారాన్ని ఆశించేవారిని నేను అభిమతిస్తాను.డాక్టర్ శ్రీ పి.నారాయణకు ప్రజల్లో మంచి మూర్తిమత్త్వం (image) ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS