Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఎవరు ఏమైపోతే మాకేం?

నా అనువాదాలు కొల్లూరి సోమ శంకర్
ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్న వర్షాలు పేదలు, గూడు లేని అభాగ్యులని శిక్షిస్తూ, ఒక్కసారిగా ఉదృతంగా వచ్చాయి. ఈ జడివానల ధాటికి తలవంచి, సూర్యుడు ఎక్కడో దాక్కున్నాడు. ఎటు చూసినా తడి, చెమ్మ. అయితే ఈ వానలు ‘సాఖి’ ఉత్సాహాన్ని మాత్రం నీరు కార్చలేక పోయాయి. ఆమె వంటింట్లో పొయ్యి వెలిగించడానికి ప్రయత్నిస్తోంది. ఇంట్లో మిగిలిన ఆ గుప్పెడు బియ్యాన్ని వండి, పిల్లలకి కనీసం తలా ఒక ముద్ద అన్నమైనా పెట్టి నిద్రపుచ్చాలని ఆమె తపన. వానలో తడిసిన కర్రపుల్లలని [...]
పూర్తిగా చదవండి

వాన దొంగ

నా అనువాదాలు కొల్లూరి సోమ శంకర్
నేను లిస్బన్‌కి తరచూ వచ్చి వెడుతూంటాను. నెలకోసారి కాకపోయినా, కనీసం ఆరు వారాలకొకసారైనా వెడతాను. అక్కడికి వెళ్ళడానికి విమానం ఎక్కుతాను. నా చిన్న తనంలో మా తల్లిదండ్రులు బ్రెజిల్‌లో ఉండడం వల్ల, నాకు ఇక్కడి భాషతో ఇబ్బంది ఎదురవలేదు. దుబాసీ అవసరం లేకుండా నెట్టుకొచ్చేస్తున్నాను. ఈ నగరం కూడ నాకు బాగానే తెలుసు. మనం తరచూ వెళ్ళే ప్రదేశాలన్నీ మనకి బాగా తెలుసనిపిస్తాయి. కానీ లోతులకెడితే అక్కడి ప్రతీ వస్తువు కొత్తగా ఉండి మనకి పరాయితనాన్ని గుర్తుచేస్తాయి. అందుకే లిస్బన్‌లో [...]
పూర్తిగా చదవండి

మానవత్వం-2

నా అనువాదాలు కొల్లూరి సోమ శంకర్
“మీరు చెప్పేది నిజమే. ఆయన హక్కుని నేను కాదనడం లేదు. అయితే వీడిని చంపకూడదు. వీడిని చూస్తే బాగా పనికొచ్చేవాడిలా ఉన్నాడు. వీడు విలువైన ఆస్తి…..” అని అంటూ, ” వీడిని మీరు చంపబోవడం లేదు కదా?” అని మేజర్‌ని అడిగాడు జెబ్. మేజర్ లేదన్నట్లుగా తలూపాడు. ఎర్విన్ కళ్ళు పెద్దవి చేసి, నోరెళ్ళబెట్టివీరి సంభాషణని వింటున్నాడు. ” మీరేం చేస్తారో చేయండి..” అని అన్నాడు జెబ్ మేజర్ తో. కాని మేజర్ కొంచెం కూడ కదల్లేదు. వాళ్ళిద్దరికేసి [...]
పూర్తిగా చదవండి

మానవత్వం-1

నా అనువాదాలు కొల్లూరి సోమ శంకర్
 ఆకాశంలో ఓ పెద్ద ఉరుము ఉరిమడంతో, ఎర్విన్ ఉలిక్కిపడ్డాడు. కదలకుండా తను ఉన్న రేకుల గదినంతా భయం భయంగా కలయజూసాడు. అక్కడ అతడు తప్ప మరెవరూ లేరు. బలంగా ఊపిరి పీల్చుకుని, నెమ్మదిగా వదిలాడు. సరిగ్గా, సూర్యోదయానికి ముందుగా - చలి, ఆకలిబాధిస్తుండగా, అతడికి ఈ గది కనిపించింది. అప్పటికే అతడు పూర్తిగా అలసిపోయాడు. ఆ గదిలోని గడ్డి వల్ల కలిగిన వెచ్చదనం, అప్పటివరకు తీసిన కునుకు అతడి చలిని, బడలికని కాస్త దూరం చేసాయి. అయితే [...]
పూర్తిగా చదవండి

యమరాజు-2

నా అనువాదాలు కొల్లూరి సోమ శంకర్
ఆలోచనల్లో నిమగ్నమై  నడుస్తున్న నేను చూసుకోకుండా ఓ సన్యాసిని ఢీ కొట్టాను. నల్లటి దుస్తులలో ఉన్న ఆ సన్యాసి చేతిలో చిలుం ఉంది. భుజానికి తాడు కట్టిన ఓ మట్టి పాత్ర వేలాడుతోంది. సన్యాసి నాకేసి పరీక్షగా చూసి, “ఏదో సమస్యతో బాధపడుతున్నట్లున్నావు నాయనా?” అని అన్నాడు. నా సమస్యని అయనకి విన్నవించుకున్నను. ఆయన ముఖంపై చిరునవ్వు విరిసింది. నా సమస్య అర్ధమైందన్నట్లు తలూపుతూ, ఏం కంగారు పడద్దని భరోసా ఇచ్చాడు. తన దుస్తులలోంచి వింత పదార్ధమేదో [...]
పూర్తిగా చదవండి

యమరాజు-1

నా అనువాదాలు కొల్లూరి సోమ శంకర్
ఇంకా పూర్తిగా సాయంకాలం అవలేదు. కానీ వాటి పార్టీ అప్పుడే మొదలైపోయింది.దోమలు గుంపులుగా చేరి ఆబగా నా రక్తం జుర్రుకుంటున్నాయి.కొత్తగా మరికొన్ని దోమలు వచ్చివాలుతున్నాయి. తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా, రేపన్నదే లేదన్నట్లుగా యధేచ్చగా కుట్టేస్తున్నాయి. నాకు చికాకుగా ఉంది. ఏ పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. ‘నిజమే ఇక వీటికి మరో రోజంటూ ఉండదు ‘ అనుకుంటూ ఫట్, ఫట్ అంటూ చేతులతో నా తలపై ఉన్న దోమలని చరిచాను. మొదటి దెబ్బకి మూడు, రెండో దెబ్బకి [...]
పూర్తిగా చదవండి

బొమ్మ-2

నా అనువాదాలు కొల్లూరి సోమ శంకర్
బహుమతి కొనడానికి గబగబా కొట్టుకి వెళ్ళాను. కాని అది అప్పటికే మూసేసి ఉంది. నిస్పృహగా ఇంటివైపు నడిచాను. ఇల్లు చేరిన మరుక్షణమే నా భార్య సింధు గురించి చెప్పుకొచ్చింది. “పాపమండి! గుమ్మం దగ్గర చప్పుడైనప్పుడల్లా మీరేననుకుని బయతకు పరిగెత్తుకొచ్చింది. సాయంత్రం నుంచి ఏమీ తినలేదు. ‘నాన్న టెడ్డీ బేర్ తీసుకొస్తారు. అప్పుడు నేను నాన్నా, టెడ్డీ బేర్ కూర్చుని ఒకేసారి తింటాము..’ అని అంది. ఇప్పుడే పడుకుంది” నాకు బాధా, జాలీ కలిగాయి. అన్నం తినాలనే కోరిక నశించింది. కాంప్లిమెంటరీ [...]
పూర్తిగా చదవండి

బొమ్మ-1

నా అనువాదాలు కొల్లూరి సోమ శంకర్
“నాన్నా, ఈ గులాబీ రంగు టెడ్డీ బేర్ చాలా బాగుంది కదా! మనం తీసుకుందామా?” అడిగింది నా కూతురు. “వద్దు సింధూ, నీకు ఇంతకంటే పెద్ద బొమ్మ కొనిస్తాను. సరేనా?” అని అన్నాను నేను. “ఊహు! నాకు పెద్ద బొమ్మలంటే భయం! నాకిదే కావాలి” అంది సింధు. ఆ బొమ్మ ఖరీదు 795 రూపాయలు. మేగజైన్లలో బొమ్మలు వేసుకుని బ్రతికే నాలాంటివాడికది చాలా పెద్ద మొత్తం. అలా అని మేమేమి పస్తులుండడం లేదు. ‘అన్నం ‘ సమస్యే కాదు… మిగతావే! మా తోటి [...]
పూర్తిగా చదవండి

అమ్మ వస్తే బాగుండు

నా అనువాదాలు కొల్లూరి సోమ శంకర్
నేను చిన్నప్పుడు నది ఒడ్డున ఉండే ఓ గ్రామంలో మా తాతయ్యగారింట్లో ఉండే దాన్ని. వారి పశువులను కాసే కన్హా నా ప్రియమిత్రుడు. పశువులను మేపడానికి వెళ్ళేడప్పుడు కన్హాతో పాటు నేనూ వెళ్ళేదాన్ని. ఎందుకంటే అతడి చొక్కా జేబుల్లో తినుబండారాలు ఉండేవి. పక్షులని వేటాడడానికి ఉండేలు ఉండేది. పశువులు మేత మేస్తుంటే, మేమిద్దరం నది ఒడ్డున మట్టిలో ఆడుకునేవాళ్ళం. మా ఇద్దరికీ ఇష్టమైన ఆట ‘టార్జాన్’. మా శరీరాలను అరటి ఆకులతోను, పూల తోను కప్పుకునే వాళ్ళం. [...]
పూర్తిగా చదవండి

నా అనువాద కథ “టెడ్డి బేర్” హిందీ లో

నా అనువాదాలు కొల్లూరి సోమ శంకర్
ప్రముఖ తమిళ రచయిత వరలొట్టి రంగసామి గారు రాసిన The Teddy Bear అనే కథని గతంలో నేను ‘బొమ్మ ‘ పేరుతో తెలుగులోకి అనువదించాను. ఆ కథ 2 జూలై 2006 నాటి వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది. నా అనువాద కథల సంకలనం ‘మనీ ప్లాంట్ ‘ లోను చోటు చేసుకుంది. ఇప్పుడు అదే కథని “టెడ్డి బేర్” అనే పేరుతో హిందీ లోకి అనువదించాను. ఈ కధని www.abhivyakti-hindi.org అనే వెబ్ సైట్ [...]
పూర్తిగా చదవండి

మన చుట్టం కాదు

నా అనువాదాలు కొల్లూరి సోమ శంకర్
“నాన్నా, రాజా హరిశ్చంద్రుడెవరు?” అంటూ హఠాత్తుగా నన్ను అడిగాడు అమిత్. నేనేమో టీ తాగుతూ, దినపత్రిక చదువుకుంటున్నాను. నిజానికది చాలా చిన్న ప్రశ్న. “అతడు సత్యసంధుడు, నిజాయితీపరుడైన రాజు” అని జవాబు చెప్పబోయి మానుకున్నాను. ఎందుకంటే ఇటువంటి జవాబులు నిజం, నిజాయితీ లాంటి అంశాలపై మరిన్ని ప్రశ్నలకు దారి తీస్తాయి. అప్పుడు నేను - “నువ్వు ఎప్పుడు నిజమే చెప్పాలి, నిజాయితీగా ఉండాలి” లాంటి నిబంధనలు విధించాలి. అమిత్‌కిప్పుడు ఆరేళ్ళు. ఆ వయసు పిల్లలకి విషయాలు బాగా [...]
పూర్తిగా చదవండి

శిధిలం-2

నా అనువాదాలు కొల్లూరి సోమ శంకర్
తిరిగి మేము డ్రాయింగ్ రూంకి వచ్చాం. ఆ గదిలో ఎలాంటి అలంకరణ ఉండాలో ఆమె చెప్పసాగింది. ఇంటీరియర్ డెకరేషన్‌లో ఆమెకి బాగా అవగాహన ఉన్నట్లుంది. ఈ రంగంలో కొత్తగా వచ్చిన మార్పులన్నీ ఆమె కి అవగతమే. ఆమెకి కావలసినవన్నీ ఒకటొకటిగా చెబుతూ, డ్రాయింగ్ రూం, లివింగ్ రూం, డ్రెస్సింగ్ రూం, డైనింగ్ హాల్, కిచెన్, పిల్లల గది….. అన్నీ చూపించింది. బెడ్ రూం లోకి రాగానే ఆమె ముఖంలో మార్పు కనపడింది. క్షణాలలో సర్దుకుని ఆమె మాములు [...]
పూర్తిగా చదవండి

శిధిలం -1

నా అనువాదాలు కొల్లూరి సోమ శంకర్
“సార్, మిమ్మల్ని కలవాలని ఓ స్త్రీ వచ్చారు. పేరు మిసెస్ అష్రాఫ్” ఇంటర్ కమ్ లో చెప్పింది నా సెక్రటరీ లిల్లీ. ‘మిసెస్ అష్రాఫ్?’ ఈ పేరే కొత్తగా ఉంది నాకు. ‘బహుశా కొత్త క్లయింట్ కావచ్చు’ అని అనుకున్నాను. “సరే, ఆవిడని కూర్చోమను” అని లిల్లీ కి చెప్పి నా ఎదురుగా ఉన్న వ్యక్తి తో మాట్లాడడం కొనసాగించాను. ఆయన ఓ ఫైవ్ స్టార్ హోటల్ కి అధిపతి. ఆయన హోటల్ ఇంటీరియర్ డెకరేషన్‌కి తుది రూపు [...]
పూర్తిగా చదవండి

నేనూ మీ లాంటి వాడినే

నా అనువాదాలు కొల్లూరి సోమ శంకర్
 నా అనువాద కథ ‘ నేనూ మీ లాంటి వాడినే ‘ ను పొద్దు తాజా సంచికలో చూడగలరు. కథ చదివి, మీ ఆభిప్రాయాలు తెలియజేయండి.
పూర్తిగా చదవండి

ప్లాస్టిక్ హృదయం

నా అనువాదాలు కొల్లూరి సోమ శంకర్
సహృదయ్‌కుమార్ ఆలోచనలు గుర్రాల్లా పరిగెడుతున్నాయి. అతడి కెదురుగా ప్లాస్టిక్ గుండెలను తయారుచేయడంలో పేటెంట్ పొందిన ఓ బహుళజాతి సంస్థ ప్రతినిధి కూర్చుని ఉన్నాడు. “చూడండి సహృదయ్‌కుమార్, మీ ఆఫీసులో రకరకాల గుండె జబ్బులతో బాధపడుతున్నవారు ఉన్నారు. అంతెందుకు మీకు కూడా రేపు గుండె జబ్బు రావచ్చు. అందుకని నేను చెప్పేదేంటంటే…” ఎంత మెత్తగా మాట్లాడుతున్నాడు? శరీరంలో కొన్ని వేల జీవకణాలతో తయారైన ఓ సజీవ అవయవాన్ని ప్లాస్టిక్‌తో మార్పిడి చేయడం ఎంత సులభమై పోయింది? ఈ ప్లాస్టిక్ గుండెలు డా. [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS