Can't see Telugu? Learn here. More Questions? Ask here.

వ్యక్తులలో లోపాలు

నా అభిప్రాయాలు రవీంద్రనాధ్ గెడ్డం
కొంతమంది వ్యక్తులలో , వారి వారి రంగాలలో ప్రతిభావంతులైనవారిలో కూడా కొన్ని లోపాలు తరచూ కనపడుత...
పూర్తిగా చదవండి

ఈ మధ్య నేను చదివిన పుస్తకాలు

నా అభిప్రాయాలు రాజారావు తాడిమేటి
నేను ఈ మధ్య నెల రోజులకై ఇండియా వెళ్ళినప్పుడు, అంతటి హడావిడిలోనూ, తీరిక చేసుకొని మూడు పుస్తకాలు చదువగలిగాను. ఎప్పటినించో నేను చాణక్యుడి గురించి వినడమే గానీ, అతని చరిత్ర గురించి తెలియదు. అర్థశాస్త్రం రచించాడనీ, చంద్రగుప్తుడిని రాజును చేయడంలో తెరవెనుక పాత్ర పోషించాడనీ, నందరాజ్య నిర్మూలనకై శపథం చేసాడనీ.. ఇలా పైపైన వివరాలు తప్ప, పూర్తి కథ తెలియదు. అందుకే రాజమండ్రి పుస్తక ప్రదర్శన లో “ఆర్య చాణక్య” అనే పుస్తకం కనపడగానే కొనివేసాను. “తాడంకి వేంకట [...]
పూర్తిగా చదవండి

నెరవేరిన నా జీవిత ఆశయం

నా అభిప్రాయాలు రాజారావు తాడిమేటి
ప్రతీ మనిషికీ జీవితంలో కొన్ని ఆశయాలు ఉంటాయి. ఆ ఆశయాలకు రూపం ఏర్పడడానికి దోహదపడిన కొన్ని కారణాలూ ఉంటాయి. గత మూడు సంవత్సరాలుగా నేను తపన పడ్డ విషయం ఒక్కటే. మా నాన్నగారి షష్టిపూర్తి సమయానికి ఆయనకు ఒక ఇంటిని కానుకగా ఇవ్వాలి అని. . మా తల్లితండ్రుల వివాహం అయినప్పటినుంచీ మా తాతగారి ఇంటిలోనే కాపురం ఉండేవారు. మా తాతగారికి నలుగురు కొడుకులు, మా నాన్నగారు మూడవవారు. పెద్దనాన్నలిద్దరూ వృత్తిరీత్యా వేరే ఊర్లలో స్థిరపడడం వల్ల ఆ [...]
పూర్తిగా చదవండి

అంతగా ఆకట్టుకోలేకపోయిన సిలికానాంధ్ర సాంస్కృతికోత్సవం

నా అభిప్రాయాలు రాజారావు తాడిమేటి
సిలికానాంధ్ర సంస్థ ప్రతీ సంవత్సరం ఆంధ్ర సాంస్కృతికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం పరిపాటి. ఈ సంవత్సరం కూడా నిన్న, అనగా అక్టోబర్ 6వ తారీఖున సాంస్కృతికోత్సవాన్ని జరుపుకుంది. కానీ గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. వివరాలలోకి వెళ్తే.. సిలికానంధ్ర సాంస్కృతికోత్సవాలకు ముఖ్య ఆకర్షణ కూచిపూడి నృత్యరూపకం. 2005లో “ఉషా పరిణయం”, 2006లో “ధృవ చరితం” ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసాయి. ఎప్పుడూ కూచిపూడి నృత్యానికి పెద్దపీట వేసే సిలికానాంధ్ర ఈసారి ఎందుకో చిన్నచూపు చూసింది. “స్వరాభినయ [...]
పూర్తిగా చదవండి

మరీ ఇంత తెలుగు అనువాదం అవసరమా..?

చాకిరేవు, నా అభిప్రాయాలు రాజారావు తాడిమేటి
మన తెలుగు బ్లాగర్లు అందరూ సాధ్యమైనంత వరకూ తెలుగు పదాలనే ఉపయోగిస్తూ బ్లాగటానికి ప్రయత్రిస్తున్నారు. ఇది హర్షణీయమే అయినా కొన్నిసార్లు తెలుగు పదాలనే వాడాలనే తపనతో అతిగా తర్జుమా చేస్తున్నామేమో అనిపిస్తోంది. ఉదాహరణకు బహుళ ప్రాచుర్యం పొందిన సాంకేతిక పదాలైన ఇంటర్నెట్‌ను అంతర్జాలంఅనీ, సాఫ్ట్‌వేర్‌ను మృదులాంత్రంఅనీ, హార్డ్‌వేర్‌ను కఠినాంత్రంఅనీ ఇలా అనువాదం చేయటం సబబు అనిపించట్లెదు. కాల స్రవంతిలో ఎన్నో పరభాషా పదాలను తెలుగులో దత్తత తీసుకున్నాము. ఉదాహరణకు బస్సు, రైలు, కారు మొదలైనవి. రైలును “ధూమశకట వాహనము” [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS