Can't see Telugu? Learn here. More Questions? Ask here.

I still remember that day,

english, కవితలు, నా కవితలు chavakiran
I still remember that day, I was wearing simple white clothes, Hardly covering my body, among north eastern cold winter breezes. I still remember that day, I was terrified by the cold both around me and around peoples faces! I was collecting alms for a cause, chanting the holy name with due respect, performing my given duty of the time. Suddenly he came, Like another wave [...]
పూర్తిగా చదవండి

గతకాలపు ఎత్తులవైపు అడుగులేశాను

Telugu, కథలు, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
గతకాలపు ఎత్తులవైపు అడుగులేశాను చేతికర్ర చేసే శబ్దాలు వింటూ విరిసిన రంగుల చాపం చూస్తూ పగటి వెన్నెలల, నల్లటి మబ్బుల - చల్లటి చినుకులకు జలదరిస్తూ గతకాలపు ఎత్తులవైపు అడుగులేశాను అంగుళం పొడవు పసిపాము పిల్లల పరుగులు, జోరుగాలిలో నేలపైని ఎండుటాకుల ఉరుకులు, చిటారు శిఖరం నుండి లోయలోకి జారే కొండరాళ్ళు, చాటుకు చేరే పక్షుల గుంపులు చూస్తూ, గమనిస్తూ - గతకాలపు ఎత్తులవైపు అడుగులేశాను సహవాసి సాధు సాహితీ సుస్వర సంపన్న పాటను, అమృత బింధువులు నేలతో చేసే పరిచయాలను, తోడుకై, జోడుకై జంతులు చేసే అరుపులను, మహోత్సాహపు శిఖరం నుండి మహోద్వేగంతో- మనసు చేసే కేరింతలను [...]
పూర్తిగా చదవండి

ఎప్పటికో అంబరం నాలుగు చినుకులు రాలిస్తే

Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
ఎప్పటికో అంబరం నాలుగు చినుకులు రాలిస్తే, క్షోణి చేరకముందే ఆవిరైపొయినాయి. ఉబికి ఉబికి వస్తున్న కన్నీరు, దృగ్గోళం దాటకముందే మాయమైనాయి. ఎన్నాళ్ళకో విరిసిన చిర్నవ్వు, పెదవులు దాటకముందే వాడిపొయింది. తీవ్ర ప్రయత్నంతో మొలకెత్తిన మొక్క, బేడవిడువకముందే నేలలో కలిసిపొయింది. పల్లకీలు బారులు తీసి పరుగెడ్తున్నాయి, లోనున్నోరు మాత్రం ఇంచ్ కూడా ముందుకు వెళ్ళడంలేదు. మఱ్ఱి చెట్టు నేలనంతా ఆక్రమిస్తుంది, ఆకు కూడా రాల్చకుండా సారమంతా పీల్చేస్తుంది.
పూర్తిగా చదవండి

నేల తాకిన తొలకరి చినుకును నేను

Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
==version one == నేల తాకిన తొలకరి చినుకును నేను, తొలి ‘కోడికూత’ మాధుర్యాన్ని నేను, నులి వెచ్చని ఉదయపు కిరణాన్ని నేను, బాల శిశువు తొలి రాగాన్నీ నేనె. తొలి చూపుల వలపులోని కాంతిని నేను, అల దాటొచ్చిన తొలి మేఘాన్ని నేను, మధుర మధుర రేయి జ్ఞాపకాన్ని నేను, నేను సృజించిన రాగానే నేను. ==వర్సన్ సున్న == నేల తాకిన తొలకరి చినుకును నేను, తొలి కోడికూతలోని మాధుర్యాన్ని నేను, నులి వెచ్చని ఉదయపు కిరణాన్ని నేను, బాల శిశువు తొలి రాగంలోని గీతాన్ని నేను. తొలి చూపుల వలపులోని కాంతిని నేను, పశ్చిమ [...]
పూర్తిగా చదవండి

ఊరంతా తిరిగి చూసినాను

Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
ఊరంతా తిరిగి చూసినాను హృదయమెక్కడా ఎగిరిగంతెయ్యలేదు. పగలూ, రాత్రి ఉసంధ్య, సాసంధ్య ఓపిగ్గా తిరిగి చూసినాను హృదయమెక్కడా ఎగిరిగంతెయ్యలేదు. నూరేళ్ళనాటి నిర్మాణం ఎందరో ఆహో, ఓహో అన్నారు నెత్తిన కిరీటంపెట్టారెప్పుడో ఇంకెందరో ఈ దారినే నడిచారు. అయినా, హృదయమెక్కడా ఎగిరిగంతెయ్యలేదు. పేలవమైన వెలుగు, ఆహ్లాదంకాని ఆకారాలు, అత్యంత భారీ నిర్మాణం చెప్పేదొకటి, చూపేదొకటి నిరుత్సాహం, నిరుత్సాహం! ఊరంతా తిరిగి చూసినాను హృదయమెక్కడా ఎగిరిగంతెయ్యలేదు.
పూర్తిగా చదవండి

ప్రవాహం సాగనీ,

Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
ప్రవాహం సాగనీ, బుగ్గల మీదుగా గుండెల్లోనే ఆపి బరువు చేసుకోకు. ప్రవాహం సాగనీ బుగ్గలమీదుగా
పూర్తిగా చదవండి

ఆగిపొయిన గుండెను,

Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
ఆగిపొయిన గుండెను, మెత్తని కత్తితో కదిలిస్తూ, ధబ్ ధబ్ మని మళ్ళా - అన్పించాలని చూస్తున్నావు. మూగబొయిన గొంతులొ, అమృతం పోసి, ఆలాపనలు మళ్ళా - చేయించాలని చూస్తున్నావు. విరిగిపొయిన రెక్కలకు, ఇనుప తొడుగులు వేసి, విహారాలను మళ్ళా - చేయించాలని చూస్తున్నావు. నే విసిరేసిన రాళ్ళను, నా చుట్టూనే పరిచినావు. నీకై తొలి అడుగు వేసి వస్తున్నాను.
పూర్తిగా చదవండి

ఏదో ఒకరోజు,

Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
ఏదో ఒకరోజు, నువ్వూ నిజంగా ప్రేమించడం మొదలుపెడ్తావు. పుస్తకాల్లో వ్రాసినట్లు ..కాకుండా, సినిమాల్లో చూపినట్లు..కాకుండా, ఏప్లస్ బీ హోల్ స్క్వేర్ లా .. కాకుండా, ఏదో ఒకరోజు, నువ్వూ నిజంగా ప్రేమించడం మొదలుపెడ్తావు.
పూర్తిగా చదవండి

కులుకుతు, ఒళుకుతు, హొయలోతు తిరిగేవు, రామ!

Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
కులుకుతు, ఒళుకుతు, హొయలోతు తిరిగేవు, రామ! ఇలనసురులు కాల విలయ ప్రళయ మాడుతుండ!! .. పాల కడలి పవళించే వాడికి ఉప్పుటేరె దిక్కన, కలకలముగ బిలబిల తిరువీధుల చేరినావుగ, అవ్వ!  .. కులుకుతు, ఒళుకుతు, హొయలోతు తిరిగేవు, రామ! ఇలనసురులు కాల విలయ ప్రళయ మాడుతుండ!!  .. గాలిని, గాలిగోపురమును పడిపడి వేడేవారి కాలిసవ్వడికె దిగ్గున తిరుమండపమేగినావుగ, అవ్వ! .. కులుకుతు, ఒళుకుతు, హొయలోతు తిరిగేవు, రామ! ఇలనసురులు కాల విలయ ప్రళయ మాడుతుండ!! .. భీకర ఘీంకార హ్రీంకార ధ్వనుల శంఖము, ఘన ఘన ఘన పెను రవమ్ముల మహిత చక్రము, ఝన ఝన ఝన అసుర ఛేధిత నందకము, ధిమి [...]
పూర్తిగా చదవండి

నీ నగుమోముతొ మాటలాడగ, దేవీ!

Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
నీ నగుమోముతొ మాటలాడగ, దేవీ! ఆనతీయవా! బాలాంబికా!! || నీ నగుమోముతొ || ప్రసన్నానన, సుందర నయని, కాసంత ఈ దీనునిపై కరుణ చూపి, నీ నగుమోముతొ మాటలాడగ, దేవీ! ఆనతీయవా! బాలాంబికా!!
పూర్తిగా చదవండి

నీవా నాకు సుద్దులు చెప్పేది?

Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
నీవా నాకు సుద్దులు చెప్పేది? నీవా నాకు సుద్దులు చెప్పేది కాంతామణి కోరి మరీ వరిస్తే, చెంతనే అన్నకి అరగుండు చేశావే! నీవా నాకు సుద్దులు చెప్పేది? మంతనాలాడమని పంపితే, మంత్రాంగము చేసి వచ్చినావే! నీవా నాకు సుద్దులు చెప్పేది? ఎంతయినగాని కత్తి పట్టనని, ఇంతలోనె చక్రము దూసినావుగ! నీవా నాకు సుద్దులు చెప్పేది?
పూర్తిగా చదవండి

అక్కడికో రాలిపొయిన పూవును,

Telugu, కవితలు, తెలుగు, నా కవితలు, వార్తలు chavakiran
అక్కడికో రాలిపొయిన పూవును, బంగారు పల్లకిలో తీసుకొస్తున్నారు. బాల్యం నుండి నే అనుభవించిన వాసన - దానిదే అని నిన్ననే తెలిసింది. కానీ, నేడది రాలిపొయిన పువు, అయితేనే, నా హృదయ సహవాసి కదా అది, ఏడు తరాలకూ మరపు రాని జ్ఞాపకం కదా ! అక్కడికో రాలిపొయిన పూవును, బంగారు పల్లకీలో తీసుకొస్తున్నారు.
పూర్తిగా చదవండి

కవిత వ్రాయడానికే కాదు,

Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
కవిత వ్రాయడానికే కాదు, కవిత చదవడానికి కూడా కావాలి మూడ్
పూర్తిగా చదవండి

My Master disposed me off..

english, కవితలు, నా కవితలు chavakiran
My master disposed me off, once I was sitting on his right, taking & executing orders efficiently,  Once I was held high among his men, smiling always with beloved gusters! My master disposed me off, The doors were shut on my face, I was dragged onto the street, Blood tainted on my clothes, my face buried deep into the dust. My master disposed me off, Its [...]
పూర్తిగా చదవండి

నీ అంత స్వచ్చంగా నవ్వలేకపోతున్నాను.

Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
నీ అంత స్వచ్చంగా నవ్వలేకపోతున్నాను. నవ్వడం మర్చిపొయినాను, కానీ నవ్వుని మాత్రం కాదు. నవ్వినప్పటి ఆనందపు జ్ఞాపకాన్ని కాదు, నవ్వులోని తేలికతనాన్ని కాదు. నీ అంత స్వచ్చంగా నవ్వలేకపోతున్నాను. నీ కళ్ళు, పెదాలు, పళ్ళు బుగ్గలు, చేతులు, కాళ్ళు జుట్టు, నుదురు, తనువంతా నవ్వుతుంది సహజంగా, స్వతహాగా. నీ అంత స్వచ్చంగా నవ్వలేకపోతున్నాను. నా బోటి నల్గురు నవ్రోగస్తులతో కలసి, కాలనీ చివర పైన్ చెట్ల పార్క్ నీడలో నవ్వును ప్రాక్టీస్ చెయ్యడం మొదలెట్టినాను ఓ ఎక్సర్సైజులా, ఓ ఎక్కాల పుస్తకంలా! (అయినా, ) నీ అంత స్వచ్చంగా నవ్వలేకపోతున్నాను. ఇకఇకల నవ్వు, పకపకలనవ్వు, చక్కిలిగింతల నవ్వు, సోడా నవ్వు, పగలబడి నవ్వు, ముద్దుల [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS