Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఇవిగో రాళ్ళు

Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
ఇవిగో రాళ్ళు, అవును రాళ్ళే! కానీ ఒక్కోటీ ఒక్కో జ్ఞాపకం, ఇది చూశావూ, ఓ నాటి నా కన్నీటి జ్ఞాపకం ఘనీబవించిన రాయి ఇదిగో ఇది చూశావూ, ఓ నాటి నీ చిరునవ్వుల నుండి నేనేరుకున్న ముత్యం! ఇవి రాళ్ళే, కానీ ఒక్కోటీ ఒక్కో జ్ఞాపకం.
పూర్తిగా చదవండి

నేనొస్తున్నా! నేనొస్తున్నా!!

Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
ఇదిగో, నేనొస్తున్నా! నేనొస్తున్నా!! ప్రపంచాన్ని మార్చడానికి, మీ జీవితాన్ని మార్చడానికి నేనొస్తున్నా! నేనొస్తున్నా!!          ఎందుకట్లా నవుతావ్?         ఎందుకట్లా నవుతావ్? ఇదిగో, నేనొస్తున్నా! నేనొస్తున్నా!! కంటి నిండా నిద్రనిస్తా, కడుపునిండా ఫుడ్డునిస్తా, చేతినిండా పనందిస్తా, నేనొస్తున్నా! నేనొస్తున్నా!!          ఎందుకట్లా నవుతావ్?         ఎందుకట్లా నవుతావ్? ఇదిగో, నేనొస్తున్నా! నేనొస్తున్నా!! నీ రెక్కలకి స్వేచ్చా గాలులూదడానికి లోకులందరితో మీకు సలాం చేయించడానికి, నేనొస్తున్నా! నేనొస్తున్నా!!          ఎందుకట్లా నవుతావ్?         ఎందుకట్లా నవుతావ్?
పూర్తిగా చదవండి

ఓ నిప్పు కణం,

Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
ఓ నిప్పు కణం, అడవినంతా తగలెట్టినట్లు, ఓ దివ్య జ్యోతి , లోకమంతా వెలుగులు నింపినట్టు, ఓ స్వర్ణాక్షరం నా కవితకు ప్రాణమయినట్టు కలగన్నాను.
పూర్తిగా చదవండి

అలా ఎలా చెయ్యగలిగావు?

Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
నీళ్ళపై నడిచేవాణ్ణి చూసి, అడిగినాను “అలా ఎలా చెయ్యగలిగావు?” అని ఓ చిరునవ్వు నవ్వి - తన దారి తాను చూసుకున్నాడు. నిప్పు ముద్దలు తింటున్న వాణ్ణి చూసి, అడిగినాను “అలా ఎలా చెయ్యగలిగావు?” అని ఓ చిరునవ్వు నవ్వి - తన దారి తాను చూసుకున్నాడు. గాలిలో మేఘాలతో మాట్లాడుతున్నవాణ్ణి చూసి, అడిగినాను “అలా ఎలా చెయ్యగలిగావు?” అని ఓ చిరునవ్వు నవ్వి - తన దారి తాను చూసుకున్నాడు. నేడెవరో నన్ను పట్టుకొని అడుగుతున్నారు, “అలా ఎలా చెయ్యగలిగావు?” అని! ఓ చిరునవ్వు అప్రయత్నంగానే వెలుగు చూసింది.
పూర్తిగా చదవండి

నన్నేమీ అడగొద్దు,

Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
నన్నేమీ అడగొద్దు, అయినా నాకేమి తెల్సని? రాళ్ళను చూసి బొమ్మలనుకునే వాడ్ని, నీళ్ళను చూసి సముద్రమనుకునేవాడ్ని, చెట్లను చూసి అడవనుకునేవాడ్ని, పూలను చూసి పదాలల్లేవాడ్ని. నన్నేమీ అడగొద్దు, అయినా నాకేమి తెల్సని? ఎవరేమి అన్నారో ఎవరెటు వెళ్తారో ఎవరెలా ఉంటారో ఎవరికి ఎవరు ఎవరో? నన్నేమీ అడగొద్దు, అయినా నాకేమి తెల్సని? కళ్ళు మూసుకోని అలాగే మూడో కంటిలోకి చూసేవాడ్ని, కలల్లో బ్రతికేవాడ్ని అలల్లో పరుగెత్తేవాడ్ని అసలుండీ లేనట్టుండేవాడ్ని నన్నేమీ అడగొద్దు, అయినా నాకేమి తెల్సని?
పూర్తిగా చదవండి

Slowy I paint your pic,

english, కవితలు, నా కవితలు chavakiran
Slowly I paint your pic, picking brushes differ by shape and size dropping colors one after other brushing thrashing, wiping, drifting and shifting! —- Slowly I paint your pic, closed my eyes thinking of you remembering the distant past glimpses of you I had, My heart filled with joy, white clouds started flying over my head, I felt like one among them! —- Slowly I paint your [...]
పూర్తిగా చదవండి

Now you can not go back,

english, కవితలు, నా కవితలు chavakiran
Now you can not go back, You are in the middle of war There are lives lost, there are deeds to pay for, Now you can not go back, You are in the middle of war There are forts to protect , There are villages to save, There is kingdom to save, Now you can not go back, You are in the middle of war Be [...]
పూర్తిగా చదవండి

నాలుగు పూలు కోసుకుందామని వెళ్ళినాను,

Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
నాలుగు పూలు కోసుకుందామని వెళ్ళినాను, అడవి నిండా అందంగా అవే! మొక్కల నిండా, తీగల నిండా, నేల బారునా, ఆకాశపు అంచుల్లోనా, దారి పక్కనా, నీటి తెరలపైనా, అడవి నిండా అందంగా అవే! నాలుగు పూలు కోసుకుందామని వెళ్ళినాను, అడవి నిండా అందంగా అవే! చిరు చిరు గాలులకు అటు ఇటు ఊగుతూ, ఎక్కడనుండో వచ్చే సంగీతానికి ఆడుతూ నేనంటే నేనని, అందాల పోటీలో ఉన్నట్టుగా, అడవి నిండా అందంగా అవే! నాలుగు పూలు కోసుకుందామని వెళ్ళినాను, అడవి నిండా అందంగా అవే! గుండె నిండా హాయి నిండిపోగా, వట్టి చేతులతో ఇట్టే వచ్చాను. జ్ఞాపకాలను నిండా నింపుకోని ఇట్టే వచ్చాను. నాలుగు [...]
పూర్తిగా చదవండి

వాళ్ళంతా నిద్రపోతున్నారు

Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
వాళ్ళంతా నిద్రపోతున్నారు ప్రశాంతంగా, శాస్వతంగా రాతి గోడల క్రింద పిడుగులు పడ్డా, ఉరుములుకైనా, ఇంచకూడా కదలకుండా వాళ్ళంతా నిద్రపోతున్నారు. గతమంతా మర్చిపోయి భవిష్యత్తు పై దిగులు లేకుండా, జాగా కోసం పోట్లాటలు లేకుండా కూటికోసం కోటి కోసం తిప్పలు లేకుండా, వాళ్ళంతా నిద్రపోతున్నారు, ప్రశాంతంగా, శాశ్వతంగా నాక్కూడా అక్కడో రిజర్వేషనుంది! ఏదో ఓ రోజు వెళ్ళి నిద్రపోవాలి ప్రశాంతంగా, శాశ్వతంగా.
పూర్తిగా చదవండి

ఎప్పుడో ఒక మెరుపు మెరుస్తుంది

Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
ఎప్పుడో ఒక మెరుపు మెరుస్తుంది కళ్ళు మిరిమిట్లు గొలుపుతాయి, కళ్ళు మూతలుపడిపోతాయి కానీ అప్పుడే కొద్దిగా దారి కనిపిస్తుంది ఈ చిమ్మ చీకట్లో ఓ దారి కనిపిస్తుంది అదే ఆధారం, ముందుకు సాగాలి.
పూర్తిగా చదవండి

నేనొక నిరంతర విహారిని

Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
నేనొక నిరంతర విహారిని అయితే ఈ లోకంలో లేకపోతే కలల లోకంలో ఏనాడో చూసిన వారి చూపులు ఇంకా నన్ను వెంటాడుతున్నాయి దీనత్వం, అమాయకత్వం అవేశం, ఆలోచన, ఆకాంక్ష ఒక్కొక్క జంట కన్నుల్లో ఒక్కొక్క బావం నేనొక నిరంతర విహారిని అయితే ఈ లోకంలో లేకపోతే కలల లోకంలో ఏనాడో చూసిన కొండల వరుసలు ఇంకా నే మర్చిపోలేదు పచ్చగా, తెల్లగా, ఎర్రగా, నల్లగా వంపులతో, వంకలతో దిక్కులన్నిటా అవే ఒక్కొక్క కొండ ఒక్కొక్క రూపం ఒక్కొక్క బావం నేనొక నిరంతర విహారిని అయితే ఈ లోకంలో లేకపోతే కలల లోకంలో ఏనాడో చూసిన అంగడి బారులు ఇంకా నాకు గుర్తొస్తుంటాయి పూలు రంగురంగులకాలవాలమై ముక్కుకు కొన్ని గుర్తుంతే కళ్ళకి కొన్ని గుర్తుంటే మనసుకి కొన్ని [...]
పూర్తిగా చదవండి

నీకివ్వడానికేమీ లేవు నా దగ్గర

Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
నీకివ్వడానికేమీ లేవు నా దగ్గర ఒట్టి చేతులతో తిరుగుతున్నాను మెదడు కూడా ఖాళీ ఇంత దూరం వచ్చినానా అయినా జ్ఞాపకాలు కూడా లేవు! అంతా వెన్నెల పరుచుకున్నట్టు చూసినంత మేరా యిసుక పరుచుకున్నట్టు నాలుగు మంచి మాటలు కూడా లేవు అంతా శూన్యం శూన్యం శూన్యం నీకివ్వడానికేమీ లేవు నా దగ్గర ఒట్టి చేతులతో తిరుగుతున్నాను చూపుల్లో భావం లేదు కళ్ళలో నీరు లేదు ఎండిపొయిన సముద్రం గుర్తొస్తుంది మాయమైన వనాలు గుర్తొస్తున్నాయి నీకివ్వడానికేమీ లేదు నా దగ్గర వట్టి చేతులతో తిరుగుతున్నాను
పూర్తిగా చదవండి

అతనెదురైతే ఏమిస్తావేమిటి?

Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
అతనెదురైతే ఏమిస్తావేమిటి? అనుకోని అతిధిలా అతనెదురైతే ఏమిస్తావేమిటి? ఏమి చేస్తావేమిటి? ఇష్టం లేని వాడు? తప్పించుకోనివాడు, అతనెదురైతే ఏమి చేస్తావేమిటి?
పూర్తిగా చదవండి

నీ కోసం ఎదురుచూస్తున్నా

Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
నీ కోసం ఎదురుచూస్తున్నా హృదయం నిండా పూలు నింపుకొని రాత్రికి రాత్రి విచ్చుకున్న పూలను చూస్తూ తేలిపోతున్న మేఘాలను గమనిస్తూ కురిసే చినుకులను గుప్పిట్లో దాచిపెట్టాలని చూస్తూ వడివడిగా పరుగెత్తుతున్న నదిని చూస్తూ నదిలోకి వరదెత్తుతున్న పాయలను చూస్తూ కనిపించీ కనిపించని కొండల వరసలను చూస్తూ నీ కోసం ఎదురుచూస్తున్నా హృదయం నిండా పూలునింపుకొని
పూర్తిగా చదవండి

పంపించేద్దామనుకున్నాను

Telugu, కథలు, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
పంపించేద్దామనుకున్నాను కలవో లేవో అని సంశయిస్తూ కలవాడివో లేనివాడివో అనుకుంటూ పంపిచేద్దామనుకున్నాను హృదయమంతా నిండినవాడిని ఎక్కడకు పంపించను? నీడలా తోడు నిల్చిన వాడిని ఎక్కడకు పంపించను? మధురాధిపతివో కాదో అయోధాధిపతివో కాదో అన్వేషిస్తూ గడిపినాను హృదయాధిపతివని మర్చిపొయి
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS