Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పాఠకుల అభిప్రాయాలు

నా గోల కొల్లూరి సోమ శంకర్
అందరికీ నమస్కారం! గత కొద్ది నెలలుగా నా బ్లాగు లో నేను రాస్తున్న సొంత కథలను, నా అనువాద కథలను చదువుతున్న అందరికీ నా కృతజ్ఞతలు. ఇప్పటి వరకు నేను ఈ బ్లాగులో 15 అనువాద కథలు, 7 సొంత కథలు పోస్ట్ చేసాను. మొదట్లో రెండు రోజులకొక కథ పొస్ట్ చేసేవాడిని. టపాల వేగం ఎక్కువవుతోందని కొందరు పాఠకులు సూచిండంతో ప్రస్తుతం వారానికో టపా రాస్తున్నాను. పాఠకుల అభిప్రాయాలు తెలుసుకోడం రచయితకి చాలా అవసరమని నా భావన. మొదట్లో [...]
పూర్తిగా చదవండి

బయటపడిన బాతు

తెలంగాణ, తెలుగు వారు, నా గోల smadpr
ఏంటండీ, మునుపటి నా జాబు చూసి(తెలంగాణా) అందరికీ కోపం వచ్చినట్టు ఉంది. ఏంచెయ్యమంటారు, రాయక ముందు నాకు అలాగే ఉండేది. ఐతే, ఈ పోస్టు రాశాక తెలంగాణా వేర్పాటు వాదంపై తక్కినవారి పోస్టులు తగ్గాయి అనేది అక్షరాలా నిజం… మీరేమంటారు? వేర్పాటు అంత అవసరమా, మీరే ఆలోచించండి? చాలా చిన్న కారణాల కోసం అంత పెద్ద యుద్ధం ఎందుకు మాష్టారూ? నాకు తోచింది చెప్పా! ఇక మీ ఓపిక!!
పూర్తిగా చదవండి

కాస్త విరామం

నా గోల కొల్లూరి సోమ శంకర్
నిజానికి నేను బ్లాగు మొదలు పెట్టింది నా కధలని, అనువాదాలని ఆన్ లైన్ లో ఉండే పాఠకులతో పంచుకోవాలనే. కాని, బ్లాగులలోని మజా రుచి చూసాక, ఒక పట్టాన ఏదీ పొస్ట్ చేయకుండా ఉండలేక పోతున్నాను. అందుకని, ఏవేవొ రాయడం మొదలెట్టాను.  నా బ్లాగులో రోజుకో ‘టపా ‘ టక టకా వచ్చేస్తుంటే అన్నీ చదవడం కష్టమవుతోందని కొందరు మిత్రులు తెలిపారు. ఎంత రుచిగా ఉన్నప్పటికీ, కిలో పూతరేకులని ఒకేసారి తినలేము కదా అంటూ ‘ తెలుగు అబిమాని ‘ [...]
పూర్తిగా చదవండి

మరదే, నాకు ఒళ్ళు మండుద్ది!

తెలంగాణ, తెలుగు వారు, నా గోల smadpr
ఎవడి పనిలో వాడు ఉంటే మన తెలుగువాళ్ళలో కొంతమందికి పనీపాటా లేక తెలంగాణా బ్లాగులు రాశేస్తున్నారు. వీళ్ళకి ఇదేం ఆనందమో నాకైతే అర్ధం కావట్లేదు. వీళ్ళలో కొంతమంది రాజకీయ స్వలాభం కోసం రాస్తుంటే, కొంతమంది ధనాన్ని ఆశించి రాస్తున్నారు. ఐతే ఎక్కువమంది ఏదో స్వాతంత్ర పోరాతం చేస్తున్నట్టు ఫీలైపోతున్నారు. నిజానికి వీళ్ళకి కాదు తిక్క, ఆ విషయం గురించి వీళ్ళ పోస్టులు చదివుతున్న మనకి. “తెలంగాణా ప్రజలు 1969 లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు”, “Six Point [...]
పూర్తిగా చదవండి

పునః ప్రారంభం గురించి?

జిల్లా గ్రంధాలయం, తక్కినవి, తత్వం, నా గోల, పరిచయం smadpr
తప్పలేదు మరి ఏమి చెయ్యమంటారు! పేరు నా బ్లాగుకి నప్పలేదు అనిపించి ఇంకో బ్లాగు మొదలెట్టాను. అది కాస్తా పరీక్షలవల్ల కొనసాగించలేక మధ్యలో డుమ్మా కొట్టాను; ఐనా మీ అందరి బ్లాగులు చదువుతున్నాను లెండి. ఇప్పుడు కొంచెం ఖాళీనే కాబట్టి, మళ్ళా కొనసాగించే ప్రయత్నం చేస్తా. ఈ మధ్య కాలంలో కిరణ్ ఒకడు కొంచెం పర్వాలేదు, బానే రాస్తున్నాడు అనిపించింది. తేనెగూడులో 387 బ్ల్లగులు చూసి కొంచెం తృప్తిగా ఉంది. నంబరు బానే పెరిగిందిలెండి. కూడలి మాత్రం [...]
పూర్తిగా చదవండి

బాబోయ్.. మొత్తం కెలికిపెట్టారు..

అనువాదాలు, జిల్లా గ్రంధాలయం, నా గోల, వెబ్ సైట్లు smadpr
మొత్తం గూగుల్ అనువాదలని కెలికేశారు. గూగుల్ తెలుగులో, ఆంగ్ల అక్షరాలు ఎందుకు వస్తున్నాయా అనుకుంటున్నా, ఇన్నాళ్ళూ! అనువదించమంటే, అలా ఎవరు చేసిపెట్టారో కానీ, ఇప్పుడు, పని రెండింతలు అయ్యేట్టు ఉంది. ఒక పకడ్బందీ ఉపాయం వేస్తే తప్ప అవ్వదు ఏమో? కొన్నాళ్ళు చూస్తాను,వల్లకాదు అనిపిస్తే ఇంక వదిలేస్తానండీ బాబు. మెల్లగా నాకు కూడా గూగుల్ మీద మోజు పోతోంది. మేరే చూడండి, గూగుల్ తెలుగు ఎంత అధ్వానంగా ఆంగ్ల అక్షరాలకి దాసోహం అయిపోయిందో.
పూర్తిగా చదవండి

అర్ధం పర్దం లేని నా పాకులాట

కుళ్ళు రాజకీయం, జిల్లా గ్రంధాలయం, తత్వం, తెలుగు వారు, నా గోల smadpr
మన నాలుగు రాష్ట్రాలను విద్యాసంపన్నమైన ప్రాంతాలుగా చెప్తుంటారు.. ప్రత్యేకంగా మన ఆంధ్ర దేశాన్ని అటు, ఉత్తర భారతదేశానికి, ఇటు దక్షిణాది రాష్ట్రాలకు లంకెగా వర్ణిస్తారు. ఎన్నో స్వదేశీ విదేశీ సంస్థల్లో మనవాళ్ళు అత్యంత కీలకపాత్రలు పోషిస్తున్నారు, నిజమే కానీ, మనవాళ్ళు తాము సంపాదించిన ఇటువంటి ఘనతలో కనీసం కొంత భాగాన్ని కూడా తిరిగి మన రాష్ట్రానికీ, రాష్ట్ర ప్రజలకు ఎందుకు అందించలేకపొతున్నారు అనేది నన్ను ఎప్పుడూ తొలిచివేసే విషయం. నేను ఎందుకు ఇలా అంటున్నాను అంటే, మీరే చూడండి… ఒక [...]
పూర్తిగా చదవండి

ఆవిరౌతున్న మన సినిమా నైపుణ్యం…

జిల్లా గ్రంధాలయం, నా గోల, సాహిత్యం..., సినిమా smadpr
మీరు ఒప్పుకుంటారో లేదో కానీ, ఒక రకంగా చెప్పాలంటే, ఇది నిజంగా నిజం. అన్ని రంగాలలో మనం మెల్లగా మరుగున పడిపోతున్నామేమో? చదావండి, మీకు కూడా అనిపిస్తుంది… ప్రస్థుతానికి, అత్యంత జనాదరణ ఉన్న మన సినిమా-నాటక రంగాన్నే తీస్కుందాం.. ఒకప్పిటి మన సినిమాని చూసి హర్షించని వాడులేడు. ఒకరకంగా చెప్పాలంటే, అప్పట్లో తెలుగు సినిమాలను, అరవంలో డబ్బింగ్ చేశేవారు..మరి ఇప్పుడు కధ అడ్డం తిరిగింది, తమిళ సినిమాలను తెలుగులోకి తర్జుమా చేస్కోవాల్సిన పరిస్థిథి! మనకి అవసరమా… సినిమాలు, కధలు, [...]
పూర్తిగా చదవండి

తప్పేంటి???

జిల్లా గ్రంధాలయం, తత్వం, నా గోల smadpr
నిజమే, నేను ఏ ఊళ్ళోనూ నాలుగేళ్ళకంటే ఎక్కువ బతికింది లేదు, బహుశా అందుకేనేమో, మిగితా వాళ్ళతో పోలిస్తే ఒకింత ఆలోచనలు ఎక్కువే మనకి!. ఐతే.. దేశభక్తి అణువణువునా ఉండాలి అని అనుకునే మనం, ప్రంతీయాభిమానం…వగైరా విషయాలకి వస్తే కోపం తెచ్చుకుంటాం. అందులో తప్పేముందబ్బా అని ఒకొక్క రోజు అలా కూర్చుని ఆలోచించేస్తూ ఉంటాను! ఏ? తన దేశాన్ని ఇష్టపడేవాడు తన రాష్ట్రాన్ని ప్రేమిస్తే తప్పేముంది? తన రాష్ట్రాన్ని ప్రేమించేవాడు తన భాషను అభిమానించడంలో తప్పేముంది? మరి అట్లాగే భాషని అభిమానించేవాడు, [...]
పూర్తిగా చదవండి

జీ మెయిల్ యూఐ అనువాదం పూర్తి

గూగుల్, జిల్లా గ్రంధాలయం, నా గోల, వెబ్ సైట్లు smadpr
ఔను…జీమయిల్ యూఐ పూర్తయ్యింది… ఇది నా చేత్లో పూర్తయ్యినందుకు నాకు చాలా ఆనందంగా, గర్వంగా కూడా ఉంది…ఐతే నేను చేసినవి చాలా తక్కువ అనువాదాలు మాత్రమే…మిగితావి కూడా చెయ్యడానికి రెట్టింపు ఉత్సాహం ఇప్పుడే కదా వచ్చింది…ఇక చూడండి, నేను పరిగెడతాను. మళ్ళీ: పైది పోస్టు చేసిన పది నిమిషాల్లోనే గూగుల్ ప్రధాన సేర్చీ అనువాదం కూడా నా చేతిలోనే పూర్తయ్యింది… మళ్ళీ: జీమయిల్ ఈమయిలు భాగం కూడా పూర్తి…ఇది నేటి మూడవ విజయం… ఇప్పుడు తెల్లారిందిలే కానీ నాకు యమా నిద్దర [...]
పూర్తిగా చదవండి

నా ఎదవ గోల…

నా గోల, పరిచయం smadpr
ఇదేంటి అనుకుంటున్నారా, ఏమీ లేదండీ బాబు, అసలు బ్లాగర్ల ప్రపంచానికి నన్ను నేను పరిచయం చేస్కోకుండానే బ్లాగేస్తున్నను అనిపించి ఎస్.డి చెప్పుకుంటున్నా అంతే. నిజానికి నేన్ను కొత్తగా పరిచయం చేస్కోకపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి లెండి. ఒకటి. నేను ఇంతకు ముందు దాకా ఒక నాలుగు కొత్త బ్లాగులు కెలికి వదిలేశా..ఇది కూడా అలా చేస్తానేమో అనీ… (ఇప్పుడు లేదు లెండి) రెండు. ఈ బ్లాగుని నా సొంత బ్లాగులాగా కాకుండా… కొంచెం జనరల్ గా రాద్దామనుకున్నా… అది కూడా ఒక [...]
పూర్తిగా చదవండి

వెర్రి వెయ్యింతలు అవ్వటం అంటే ఏంటో అనుకున్నా

కుళ్ళు రాజకీయం, నా గోల, సినిమా smadpr
ఇందాకే యూట్యూబ్ లో ఈ పవన్ కల్యాణ్ వీడియో చూశా.. మామూలే కదా ఇలాంటి ప్రోగ్రాములు ఏవో ఎలాగూ జరుగుతాయి కదా వజ్రాత్సవాల తర్వాత అనుకున్నా, ఐతే అందులో వింత ఏమీ లేదు కానీ, కింద జనాల కామెంట్లు చూశాక దిమ్మ తిరిగింది నాకు…. అసలు, ఆ వీడియోలో మోహన్ బాబుని పవన్ కల్యాణ్ ఏమన్నడు, “తమ్ముడు” అని వ్యంగ్యంగా మాట్లాడటం తప్ప! ఇంతకీ అసలు మోహన్ బాబు మళ్ళా ఏమి అన్నాడు అని ఈ సంభాషణ అక్కడ [...]
పూర్తిగా చదవండి

తెలుగు అనువాదాలు కావలెను

ఒడంబడిక, నా గోల, సాఫ్ట్ వేర్ smadpr
మీకు తెలిసిన విషయమే.. మనలో చాల మందికి తెలుగు అంత బాగ రాదు అని… కాని వచ్చిన వాళ్ళు నాకు దయచేసి సహకరించగలరు. నేను ఒక చిన్న సాఫ్ట్ వేర్ ప్రాజెక్టు(లోకలైజేషన్) చెయ్యడానికి కొన్ని ఆంగ్ల పదాలకి తెలుగు అనువాదం కావలిసి వచ్చింది.. నా లొకలైజేషన్ పూర్తి అవ్వగానే మొత్తం ఏమిటనేది వివరిస్తాను, ఇది బాగ పనికొస్తుంది అని నాకు నమ్మకంగా ఉంది ఆ పదాలు కింద ఉన్నాయి, దయ చేసి మీరు ఆంగ్ల అనువాదాలు కామెంట్లో కాని, నా [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS