Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఎవడు ఎవడు…పోగొట్టెను నా మెదడు

చంద్రబోసు, నా సోది మరియు సొద, పాటలు, రుచులు-అభిప్రాయాలు, సాహిత్యం..., సినిమా వికటకవి
ఈ మధ్య ఓ అమ్మడు నాకు కాఫీ కలిపేవాడు, అంట్లుతోమేవాడు మొగుడుగా కావాలి అంటూ పాడుతూ తెగ ఊదరగొడ్తోంది. షరతుల పెళ్ళికొడుకుల తర్వాత షరతుల ఆడపిల్లల్ని వెతుకుతున్నానేమో, ఈ అమ్మడి బాధేంటో చూద్దామని ఆ పాట సాహిత్యాన్ని ఓ చూపు చూశా. అంతే, ఆ సాహిత్యపు విలువలకి దిమ్మ పూర్తిగా తిరిగి కళ్ళు బైర్లు కమ్మాయి. ఈ మధ్యే మన రాకేశ్వరుడు నవతరంగంలో సినిమాల హీనస్థితి గూర్చి రాశారు. ఇది దిగజారుతున్న సినీ సాహిత్యానికి మరో ఉదాహరణ. ఏమాటకామాటే, రాసిన [...]
పూర్తిగా చదవండి

(అ)గౌరవ డాక్టరేట్లు

గౌరవ డాక్టరేట్లు, నా సోది మరియు సొద వికటకవి
మళ్ళీ నాగార్జునా యూనివర్సిటీ వారు డాక్టరేట్లు ప్రకటించారండీ. ఓ ఇద్దరి పేర్లు చూశాక జీర్ణించుకోవటం కష్టం అయింది.  కోనేరు రంగారావు (మంత్రివర్యులు) - గౌరవ డాక్టరేట్ డాక్టర్ నాయుడమ్మ (నిజం డాక్టరు) - గౌరవ డాక్టరేట్ ఒకరిది వారసులకు గ్యాసు డీలరు షిప్పు కోసం ఇతరుల్ని బెదిరించి సాధించుకున్న అపకీర్తి. మరొకరిది, అవిభక్త కవలల్ని దేశీయ సౌకర్యాలతో విదేశీ స్థాయిలో వైద్యం అందించి వేరుచేయగలిగే ఘనకీర్తి. ఇద్దరికీ నక్కకీ, నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది అని వేరే చెప్పనవసరం లేదు. మరి నాగార్జున [...]
పూర్తిగా చదవండి

మరో కొత్త బ్లాగు

నా సోది మరియు సొద వికటకవి
నేను మరో క్రొత్త బ్లాగు భజన కీర్తనలు ఆరంభించాను. ఆదరిస్తారని ఆశిస్తూ…
పూర్తిగా చదవండి

అయ్యో పాపం మున్నాభాయ్!

నా సోది మరియు సొద వికటకవి
మున్నాభాయ్ గా అందరిని మురిపించిన సంజయ్ దత్ కి చివరికి 6 సంవత్సరాల కఠిన జైలు శిక్ష పడింది. వినటానికి కొంత బాధగానే ఉన్నా, న్యాయవ్యవస్థని ఇంకా నమ్మొచ్చనే భావన ప్రజల్లో ఈ సంఘటన నిలుపుతుంది. అదేసమయంలో, అసలయిన పెద్ద దొంగలు ఆ దావూద్ మరియు గాంగు ని పట్టుకోలేని పోలిస్ అసమర్ద్థత బట్టబయలయింది. ఏదేమయినప్పటికి, మున్నాభాయ్ ని మనం మిస్సు కాక తప్పదు. సుప్రీం కోర్టు అయినా, మున్నభాయ్ ని కొంత కరుణిస్తుందేమో! ఇంతటి కఠినమయిన తీర్పు [...]
పూర్తిగా చదవండి

డబ్బింగ్ సినిమా పాటల్లో తెలుగు సాహిత్యం

నా సోది మరియు సొద వికటకవి
స్పందించే మనసుండాలేగాని మంచి సాహిత్యం ఉన్న సినిమా పాటలు ఆ మాటకొస్తే ఏ పాటైనా  అసంకల్పితంగా, అలవోకగా మన మనసును హత్తుకుంటాయి. సినీ గీతాల్లో మంచి సాహిత్యం (అత్యాశే అయినా వేటూరి, సిరివెన్నెల లాంటి వారివల్ల ఇంకా అడియాస కాలేదు)వింటూ ఆనందించే నాకు, కొన్ని డబ్బింగ్ సినిమాల్లోని పాటలు కోపంతో పాటు బోలెడు హాస్యం పంచుతాయి. డబ్బింగ్ చిత్రాల పాటలకు నేను పాటల రచయితను తప్పు పట్టను కాని ఒక్కోసారి వాళ్ళు రాసింది అర్థంగాక నవ్వొస్తుంది. “ఒకే ఒక్కడు” [...]
పూర్తిగా చదవండి

నే నేర్చుకున్నది - నే తెలుసుకున్నది

నా సోది మరియు సొద వికటకవి
రెండు రెళ్ళు నాలుగని నేర్చుకున్నాను! కాదు, అది తప్పని లంచంగా ఆరు ఇచ్చాక తెల్సింది!! చట్టానికి కళ్ళు ఉండవని చదువుకున్నాను! కాదు, నోరూ లేదని బాలక్రిష్ణ ఉదంతం తెల్పింది!! దేవుని ఇల్లు దేవాలయం అని చదువుకున్నాను! కాదు, మనసున్న మనిషే ఆయనిల్లని స్వానుభవం నేర్పింది!! నేనీ మాత్రం వ్రాయగలగటం అసంభవమనుకున్నాను! కాదు, ప్రయత్నిస్తే సంభవమేనని తెలుసుకున్నాను!!
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS