Can't see Telugu? Learn here. More Questions? Ask here.

తిరుమల తిరుపతి దేవస్థానం

కవిత్రయ భారతం, తిరుమల తిరుపతి దేవస, నా స్పందన, సాహిత్యం... వికటకవి
తిరుమల తిరుపతి దేవస్థానం చేసే ధార్మిక, సామాజిక కార్యక్రమాల సూచి  కొండవీటి చాంతాడంత ఉంటుంది. శరణాలయాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు, ప్రచురణలు  వగైరా వగైరా. ఇవన్నీ కూడా గాదె కింద పదికొక్కులు తినగా వస్తున్న ఫలితాలు. లేకపోతే ఇంకా ఎంత మందికి ఉపయోగపడేవో. పుస్తకాల విషయానికి వస్తే, చిన్నప్పుడు బాలభారతి పేరుతో గొప్ప వ్యక్తుల జీవితాలకు సంబంధించిన పుస్తకాలు చిన్నవిగా పిల్లలకోసం వేసేవారు. తెనాలి రామకృష్ణ, భీష్ముడు, వ్యాసరాయలు మొదలైనవి. ఇవి చాలా భాషల్లో పిల్లల్లో చాలా ప్రాచుర్యం పొందాయి. సాహితీ [...]
పూర్తిగా చదవండి

భగవంతుడు, భక్తుడు మరియు అంబికా దర్బార్ బత్తి

నా స్పందన, నిత్యానంద, భక్తుడు, భగవంతుడు, స్వాములు వికటకవి
ఇవ్వాళ మన నిత్యానంద స్వామి లీలలు వార్తా పత్రికల్లో చూసిన తర్వాత… భగవంతుణ్ణి, భక్తుణ్ణి అనుసంధించటానికి “అంబికా దర్బార్ బత్తి” కంటే గొప్ప సాధనమేముందా అని అనిపిస్తోంది. చాణ్ణాళ్ళ క్రిందట కంచి స్వాములోరు కొట్టిన దెబ్బకి ఇంకా తేరుకోనే లేదు, మరో దెబ్బ ఇప్పుడు. ఈ సమయంలో ఈ పాటని వినటం మించిన కాలక్షేపం మరోటి లేదనిపిస్తోంది. విని, చూసి తరించండి.
పూర్తిగా చదవండి

న్యాయ వ్యవస్థ - శాసన వ్యవస్థ

నా స్పందన, న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ వికటకవి
న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థలోకి చొరబడి అవాంఛిత అధికారాన్ని కూడగట్టుకుంటోందని, మన రాజకీయ పార్టీలు చాలా కాలంగా గగ్గోలు పెట్టటం చూస్తునే ఉన్నాము. మరలాగని శాసన వ్యవస్థ ఏమైనా సామాన్యుడి అక్కరకొస్తోందా అంటే, అదీలేదు. ఇది “అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు” లాగా మారింది. ఈ ఉపోధ్గాతం ఎందుకంటే, మళ్ళీ మరో జూనియర్ డాక్టర్, అందులోనూ ఆడ డాక్టర్ ని తీవ్రంగా కొట్టి గాయపరచటం. మొన్నటి గొడవ ఇంకా సద్దుమణగలేదు, అప్పుడే మరో ఘటన. తప్పు ఒప్పు పక్కన పెడితే, [...]
పూర్తిగా చదవండి

ఇదెక్కడి సౌభాగ్యం?

నా సోది, నా స్పందన వికటకవి
  సౌ అంటే వందట…ఛా… మంచి భాగ్యాన్ని కాస్తా వంద భాగ్యాలు చేసేసారు. తెలిసిందల్లా, ఇదే సౌభాగ్యమయితే ఇంతకన్నా దౌర్భాగ్యం మరోటి లేదు అని. ఆ యాడ్లో చెప్పించిన విధానం చూస్తే, కొత్తవాళ్ళు అసలు సౌభాగ్యానికి అదే అర్థమనుకున్నా ఆశ్చర్యం లేదు. మరయితే, (దో)శ అంటే రెండుశ అనీ, (చే)దు ని ఆరుదు అనీ, (నౌ)కరుని తొమ్మిదికరు అనీ అనొచ్చనమాట. భలే ఉన్నాయి కదూ ఈ కొత్త పదాలు.
పూర్తిగా చదవండి

నా స్పందన తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
గబ్బర్‌సింగు రాజ్యం ! బగ్గంపాడు భాగ్యనగరం !పెళ్ళిచెయ్యడానికొచ్చిన పురోహితుడు పెళ్ళికూతుర్న...
పూర్తిగా చదవండి

నా స్పందన తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
అయ్యా, తెల్లవాళ్ళు చెప్పే కాకమ్మ కథలు నమ్మకండి.వాటి మీద ఆధారపడి. ఏమీ రాయకండి. మన దేశం వాళ్ళు కనుక్కున్నవన్నీ ఏ ఆధారాలు లేకుండానే బాబిలోనియన్లకీ రోమన్లకీ గ్రీకులకీ అదీ కుదరకపోతే చైనాకీ ఆపాదించేసి భారతీయులకంటూ ఏమీ లేకుండా చెయ్యడానికి వాళ్ళు 150 ఏళ్ళ పాటు, పాపం ! అహరహం శ్రమించారు. మనమంటే అంత ద్వేషం అసహ్యం చిన్నచూపు ఎందుకంటే మనం అప్పుడు వాళ్ళ బానిసలం కనుక. బానిస గొప్పదనాన్ని యజమాని ఒప్పుకోడు గనక. ఒక విషయం చెప్పండి ! 9వ శతాబ్దం దాకా సున్నా అంటే ఏమిటో తెలియకుండానే మనవాళ్ళు జ్యోతిశ్శాస్త్రాలు రాసేశారా ? వేదిక గణితం కనుక్కున్నారా ? యజ్ఞాల కోసం వైదిక రేఖాగణితం కనుక్కున్నారా ? సున్నా అంటే ఏమిటో తెలియకుండానే మన వాళ్ళు రెండేళ్ళ తరువాత రాబోయే గ్రహణాన్ని సెకండ్లతో సహా లెక్కగట్టి తెలుసుకునే పద్ధతి గురించి తెలియజేశారా ? ఎందుకు బాబూ మీరు తెల్లవాళ్ళ కుట్రలో పాలుపంచుకుంటారు, బాబిలోనియా మధ్య ఆసియా అంటూ దిక్కుమాలిన అనాగరిక జాతులకి మన పూర్వీకుల్ని ...
పూర్తిగా చదవండి

రాముడెప్పుడూ మంచి బాలుడే

నా స్పందన వికటకవి
రానారె గారు రామాయణం ఈ కాలానికి ఎలా వర్తిస్తుంది అని అడిగారు. పెద్దగా విశ్లేషణలేకుండా సరళంగా చెప్పటానికి నాకు స్వదేస్ లో ఈ కింద పాట బాగా నచ్చింది. ముఖ్యంగా, మన్ సే రావణ్ జో నికాలే, రాం ఉస్కే మన్ మే హై” అన్న వాక్యం. అదంత సులభం కాదన్నది వేరే విషయం అనుకోండి, కానీ ప్రయత్నించటంలో తప్పులేదు. చిన్న వాక్యమైనా, చాలా ఉత్తేజపరుస్తుంది. రెండోది, ఈ లంకె. సమకాలీన దృక్పదంతో కూడిన విశ్లేషణ. నాకు ఇది [...]
పూర్తిగా చదవండి

గాంధీ గారు - నోబెల్ ప్రైజు

నా స్పందన వికటకవి
మన వాళ్ళు ఎప్పటిలాగే అక్టోబరు రెండో తారీఖుని, గాంధీ జయంతి పేరుతో స్వలాభం చూసుకోటంతో మొదలెట్టారు. కాకపోతే, ఈసారి కొంచెం వెరైటీగా గాంధీ గారి మీద మరింత దొంగభక్తితో. ఇంతకీ విషయమేంటయా అంటే, గాంధీ గారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదట. అయినా నా పిచ్చి కాకపోతే, ఇస్తే గిస్తే నోబెల్ వాడికి గాంధీ ప్రైజ్ ఇవ్వాలి గానీ, గాంధీ గారికి నోబెల్ ప్రైజ్ ఇస్తారా అని అడుక్కోవటమేమిటి? ఇది గాంధీ గారి విలువ మరింత తీసేసినట్లు కాదూ. అదీకాక, నా [...]
పూర్తిగా చదవండి

హేతువాది కరుణానిధి అనబడు ఓ పెద్ద జోకు!

నా స్పందన వికటకవి
ఓరీ హేతువాదపు ముసుగులో ఉన్న అవకాశవాద కరుణానిధీ! ఏదో తెలిసీతెలియక వాగుతున్నావులే అని ఊరుకుంటే, మరీ తెగ రెచ్చిపోయి, హిందూ సహనశీలతని బలహీనతగా భావిస్తున్నట్లునావు. నీకిదే రామబాణం లాంటి నా సమాధానం. ఏమన్నావ్,  రాముడు కల్పనా? వాల్మీకి కట్టుకథ రాశాడా? వానర సేన సేతువు నిర్మించటం హాస్యాస్పదమా? సరే, అయితే ఇది విను. అమెరికాలో హోవర్ డాం గురించి తెలుసా? నీకెందుకు తెలియదులే, ముదురు రాజకీయ నాయకుడువి కదా, చూసినా చూసే వుంటావు. ఆ డాం కథ విని నోరెళ్ళబెట్టినా, నిజమని [...]
పూర్తిగా చదవండి

నా స్పందన తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
నాకొద్దీ సైతాన్ ప్రభుత్వంగవర్నమెంట్ ఆఫ్ ఇండియా ! Go to hell.నీకూ నాకూ ఇంక ఏ సంబంధమూ లేదు.నేను నీ దేశపౌరుణ్ణి కాను.నీ చట్టాలు నాకు వర్తించవు, నీవిగా నువ్వు చెప్పుకునేవి ఏవీ నాకింక గౌరవనీయాలు కావు.ఇప్పుడు నా దృష్టిలో-నువ్వు నన్ను అక్రమంగా లొంగదీసుకుని పరిపాలిస్తున్న ఒక పరాయి కిరాయి ప్రభుత్వంతో సమానం.స్వదేశీవయ్యుండీ విదేశీలా ప్రవర్తిస్తున్న నువ్వు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే.అందుకే-నువ్వు త్వరలో సర్వనాశనమైపోవాలని శపిస్తున్నాను.ప్రపంచపటంలోంచి నీ పేరు తుడిచిపెట్టుకుపోవాలని శపిస్తున్నాను.అప్పుడే నీ కొవ్వు అణుగుతుంది చూసుకోరా ! తెలిసి తప్పులు చేస్తున్న నువ్వు క్షమార్హుడివి కావు.నీకు పోగాలం దాపురించింది.నీకు వినాశకాలంలో విపరీత బుద్ధులు పుడుతున్నాయి. ఈరోజు నుంచి నీకు తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి యొక్క మద్దతు రద్దయింది ఫోరా ! ఏం చేసుకుంటావో చేసుకో ! నిన్ను నేను బహిష్కరిస్తున్నాను.ముందు నిన్ను నా మనస్సులోంచి తుడిచేస్తున్నాను.నిన్ను నేను డీరికగ్నైజ్ చేస్తున్నాను.ఈ పరిస్థితి ...
పూర్తిగా చదవండి

రామజన్మభూమిలో రామునికే దిక్కులేదా?

నా స్పందన వికటకవి
ఈరోజు వార్తల్లో ఈ విషయం చదివితే నమ్మశక్యం కాలేదు. ఒకటికి రెండు పేపర్లు తిరగేసి చూశాక, ఇంత దారుణమా అనిపించింది. రామసేతువు ఉందా లేదా అన్న విషయం పక్కనపెడితే, అసలు రాముడు మరియు రామాయణం(రాముడే లేని రామాయణం ఎక్కడుంది)  ఉనికినే ప్రశ్నిస్తూ మన ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం చూస్తే, ఈ కుహానా లౌకిక వాదులు దేశ సంస్కృతిని ఎంతగా మంటగలుపుతున్నారో అనిపిస్తోంది. ఇలా శాస్త్రీయత, ఋజువుల పేరిట తరతరాలుగా మన పూర్వుల నుంచి అందించబడిన శాస్త్రాలు, [...]
పూర్తిగా చదవండి

నా స్పందన తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
"మేమూ ఉన్నాం ....బతికి !" మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డిమీది హత్యాప్రయత్నం ఆశ్చర్యం కలిగించలేదు.కానీ ఆవేదనని మిగిల్చింది. ఈ సంఘటన జరక్క ముందే నక్సలైట్ల మీద నా ఆక్రోశాన్ని వెళ్ళగక్కాలనుకున్నాను.కానీ వీలు చిక్కింది కాదు.ప్రతి సామాన్యమానవుడూ అడుగుతున్నాడు-గత నలభయ్యేళ్ళుగా వాళ్ళు ఇలాంటి హత్యలకీ విధ్వంసాలకీ పాల్పడుతున్నారు. ఏం సాధించగలిగారు ? ఇస్లామిక తీవ్రవాదానికీ ఈ వామపక్ష తీవ్రవాదానికీ మధ్య తేడా ఏమిటో అర్థంకాని పరిస్థితిలో పడిపోయాం. ఇద్దరూ తమ చుట్టూ ఉన్న ప్రపంచం మీదా మనుషుల మీదా కక్ష గట్టినవాళ్ళే.ఇద్దరూ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనివాళ్ళే.ఇద్దరూ ప్రపంచాన్ని తమ తమ భావజాలాలతో మెడలువంచాలని తహతహలాడుతున్నవాళ్ళే.ఇద్దరూ ప్రతీకార దాడుల మనుషులే.ఇద్దరికీ పత్రికల ద్వారా సంచలనమూ ప్రచారమూ కావాలి.సిద్ధాంతాల పేరుబెట్టి అమాయకులైన నిస్సహాయులైన నిరాయుధులైన సామాన్య జనాల్ని చంపడం, ఆ చచ్చిపోయిన అభాగ్యులకు వర్గశత్రువులనీ ఇన్ ఫార్మర్ లనీ బిరుదులివ్వడం. తాము ఎన్నడూ జన్మలో చూసి ఎరుగని, తమకు ...
పూర్తిగా చదవండి

నా స్పందన తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
గుర్తుకొస్తున్నాయి....గుర్తుకొస్తున్నాయి....ఈ టపాలో మా తండ్రిగారి కాలం గురించి రాయాలనుకున్నాను.కానీ ఈలోపలే హైదరాబాదులో బాంబులు పేలాయి.కనుక ఇంకా వెనక్కెళ్ళి మన మునుముత్తాతల కాలం గురించి రాయాల్సి వస్తోంది.హతవిధీ !ఇప్పుడు మన రాజకీయ పరిస్థితి మొఘల్ సామ్రాజ్యం అంతరించిపోవడానికి ముందు క్రీ.శ.1730లో ఉన్నట్లు ఉంది.ఐ.టి., సాఫ్ట్‌వేరు ఎగుమతులూ-ఇదంతా ఒక చిన్న పార్శ్వం.ప్రజలుగా మనం ఎదిగామని తెలియజేస్తాయి ఇవి.మన నాయకులు మాత్రం ఎదగలేదు.మారలేదు.సుపరిపాలన(good_governance)లేని దేశం మగదిక్కు లేని కొంపలాంటిది.కేవలం సాఫ్ట్‌వేర్లు రక్షించవు.పేలుళ్ళలో చనిపోయినవాళ్ళు ఒక్కొక్కరికీ అయిదులక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాడట శేఖర్ దాదా.దుష్పరిపాలన మూలంగా మనం కోల్పోతున్నదానికి ఎవరు చెల్లిస్తారు ఎక్స్‌గ్రేషియా ? ఎంత చెల్లించగలరు ? ఎంతమందికని చెల్లించగలరు ? ప్రభుత్వ గొప్పదనం ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంలోనా వెల్లడి కావాల్సింది ? 1730లో (ఇంగ్లీషువాళ్ళ చేతిలోకి వెళ్ళడానికి ముందు) మన దేశం ఎలా ఉండేదో గుర్తుచేసుకోవడం అవసరం.అప్పట్లో మొఘల్ రాజవంశపు ...
పూర్తిగా చదవండి

భాగ్యనగరిలో మళ్ళీ తీవ్రవాదం!

నా స్పందన వికటకవి
అహో నా భరత దేశమా! ఏమని పొగడను నీ ఘనత!  రక్తం మాకు ఇక్కడ నిత్యం చుట్టం ప్రాణం విలువ మాకు తృణప్రాయం|| ప్రజల పాట్లు ఇక్కడ పాలకులకు ఓట్లు ప్రజల అమాయకత్వం పాలకులకు వరం|| అనుభవాల పాఠాలు నేర్వని మా నాయకులు శవాల ప్రేగుల్లో ఓట్లేరుకునే రాబందులు|| ఒక బేవకూఫ్** కి ఎవరో ఏదో చేస్తారని ముందే తెలుసుట మరైతే ఇది ఏమీ చేయలేని నిస్సహాయతా లేక నిర్లజ్జా? మన భాగ్యనగరంలో జరిగిన ఘోరకలికి బాధతో నా హృదయ స్పందన …  ** “State Home Minister alleged the state [...]
పూర్తిగా చదవండి

ఆంధ్రాకి ఏమౌతాడీ వ్యక్తి ? రాజీవ్ గాంధి అంతర్జాతీయ…

నా స్పందన తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం
ఆంధ్రాకి ఏమౌతాడీ వ్యక్తి ?రాజీవ్ గాంధి అంతర్జాతీయ విమానాశ్రయం...రాజీవ్ గృహకల్ప...రాజీవ్ ఆరోగ్యశ్రీ...రాజీవ్ రహదారి...హైదరాబాదు కె.పి.హెచ్.బి.కాలనీకి రాజీవ్ గాంధి కాలనీగా పేరుమార్పు...విశాకా స్టేడియమ్ కి రాజీవ్ స్టేడియంగా పేరుమార్పు...రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధి విగ్రహప్రతిష్ఠాపనలు...రాజీవ్..రాజీవ్..రాజీవ్..రాజీవ్..రాజీవ్..రాజీవ్......ఒకటే శారిడాన్...ఇక ఉండదు తలనొప్పి...ఎవరీ రాజీవ్ ? మనమంతా ఇంతగా ఆయన్ని తల్చుకు తీఱాలని మన రాష్ట్రప్రభుత్వం మనల్ని శాసించడానికి-ఏం చేశాడాయన ఆంధ్రప్రదేశ్‌కి ? ఇంతగా ఎనిమిదిన్నర కోట్ల మందిమి ఆయనకి తరతరాలుగా ఋణపడిపోవడానికి ఏమిటాయన కాంట్రిబ్యూషన్ ? ఏ విషయంలో ఆంధ్రప్రదేశ్ పట్ల అభిమానం చూపించాడు ? మన రాష్ట్రంలో ఏ ప్రత్యేకరంగాన్ని ఆయన అభివృద్ధి చేశాడు ? అసలు ఏమౌతాడాయన తెలుగువాళ్ళకు ? ఈ రాష్ట్రంలో దేనికీ తెలుగువాళ్ళ పేర్లే లేవు. కారణం ఏమిటి ? తెలుగువారిలో కవులు ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS