Can't see Telugu? Learn here. More Questions? Ask here.

రామ పదాబ్జముల్

చిక్కు ముడి, పద్యం, శార్దూలం Giri
రానారె కడప కేంద్రం నుంచి వెలువరించిన సమస్యకి నా పూరణ ఇదిగో - రావణుడికి హనుమంతుని హితబోధ ఇది. శా. కామాగ్నుల్ హరియించి పోవు తృటిలో, కైంకర్య మందేనురా, రా, మాయమ్మను భక్తితత్పరుడవై రామయ్యకందించగా రా, మా రామ పదాబ్జముల్ కొలువరారా, కీర్తి మిన్నందురా నీ మాన్యంబిక లోకమందు వెలుగున్ దేదీప్యమానంబుగా
పూర్తిగా చదవండి

పొలో!

పద్యం, శార్దూలం Giri
ఈ వారం పని మర్చిపోయి, సరదా ఎంజాయిమెంట్లో పడే పోవాలంటు, మరేమి బాధ్యతల బర్వూ లేని స్వేఛ్ఛాయువే కావాలంటు, యధేఛ్చగా తిరుగుతూ కాలం వృధా చేస్కునే ఆవారా పనిలో పడాలనుకునే, అయ్యాను సిధ్ధం! పొలో!! వచ్చే వారమంతా నేను హైదరాబాదులోనే ఉంటాను. ఈ మధ్య పెరిగిన పని వత్తిడి నుంచి కొంత విముక్తి కూడా - వీలు దొరికినప్పుడు విశాలాంధ్రాకి వెళ్ళి మంచి పుస్తకాలు కొన్ని కొనుక్కోవాలని అనుకుంటున్నాను, అంతకు మించి ఇంకేమీ
పూర్తిగా చదవండి

Obama!

English పద్యం, ఉత్పలమాల, పద్యం Giri
ఉ. Clinton made a lot many carefully crafted plans, and very intelligently gave her entry an aura that of victory meant to be "scare-away every winner wannabe" move; not to be! enter a young man* with an endearing message : "change, hope" ఉ. క్లింటను మేడె లాటు మెని కేర్ఫులి క్రాఫ్టెడు ప్లాన్సు, అండ్వెరీ ఇంటలిజెంట్లి గేవు హరు ఎంట్రి ఎనార దటాఫు విక్టరీ మెంటుబి “స్కైరెవే ఎవిరి విన్నరు వానబి” మూవు,
పూర్తిగా చదవండి

Obama!

English పద్యం, ఉత్పలమాల, పద్యం Giri
ఉ. Clinton made a lot many carefully crafted plans, and very intelligently gave her entry an aura that of victory meant to be "scare-away every winner wannabe" move; not to be! enter a young man* with an endearing message : "change, hope" ఉ. క్లింటను మేడె లాటు మెని కేర్ఫులి క్రాఫ్టెడు ప్లాన్సు, అండ్వెరీ ఇంటలిజెంట్లి గేవు హరు ఎంట్రి ఎనార దటాఫు విక్టరీ మెంటుబి “స్కైరెవే ఎవిరి విన్నరు వానబి” మూవు,
పూర్తిగా చదవండి

ఆడువారి చేతలకు అర్ధలె వేరులే

English పద్యం, ఆటవెలది, చిక్కు ముడి, పద్యం Giri
ఓ మద్దుగుమ్మకి ఇద్దరు దగ్గర స్నేహితులు. వారి స్నేహాలు ప్రేమగా మారడానికి పెద్ద సమయం పట్టలేదు. అమ్మాయికి ఇద్దరూ ఇష్టమే, మరెలా? ఇక అటో ఇటో తేల్చుకోవాలనుకుంటుండగా అబ్బాయిలిద్దరూ దగ్గరవ్వమని కోరారు. మొదటబ్బాయి: My dear you will never get a nicer buddy than me, you’re lucky don’t run away likeyou don’t likeme, silly you can never getaway, come to me అన్నాడు. అతనన్నది నిజమని అమ్మాయికి తెలుసు. ఐనే
పూర్తిగా చదవండి

పొద్దు మిత్రమా

చంపకమాల, పద్యం Giri
ఇది చదవండి. ఇక, చ. వడివడిగా పదాలపొది వాడి శరమ్ములవంటి పద్యముల్ విడువగ, కొన్ని తప్పినవి వేగిరపాటుకు దారి, చేరకే పడినవి గమ్యమధ్యమున, మంచివి కావని యట్టిపధ్ధతుల్, విడుమని చెప్పినావు, విరమించెద వేగిరపాటు, (పొద్దు)మిత్రమా
పూర్తిగా చదవండి

No country for old men

Coen brothers, Hollywood, Movies, పద్యం, శార్దూలం Giri
శా. నోకంట్రీ ఫరు ఓల్డుమెన్ను కదనంతొక్కింది ఆస్కారుకై, ఏకంగా మరి నాల్గుబొమ్మలకు కన్నేసింది, ఆస్కారమే లేకుండా తనసాటి బొమ్మలను తేల్చేసింది ఈ ఏడు చ క్కా కుందించి పడేసి వాటిని, తనే గైకొంది, వీగింది, పో! కుందించి అంటే కుదించి, అణగ త్రొక్కి అని అర్ధం వచ్చేలాగ రాస్తే వచ్చిన విమర్శల కారణంగా చివరి పాదం సవరించాను, చివర్లో పురస్కారముల్ అని వాడుక వల్ల పద్యం పూర్తిగా వ్యవహారికము కాక బాగుండదేమో అనే సంకోచం కొంత
పూర్తిగా చదవండి

సహాయం కావాలి

చంపకమాల, చిక్కు ముడి, పద్యం Giri
చ. తెలుగు అకాడమీ మనకు తెచ్చెను అర్ధశతాబ్ది ఉత్సవ మ్ములను పురస్కరించుకొని బోలెడు చక్కని చౌక పుస్తక మ్ములనని, ఎక్కడో చదివి, పోయి సరాసరి నేను చూడడం సులభముకాక, ప్రాణము ఉసూరనె; మార్గము చిక్కెనింతలో... మా మామగారు నా కోసమని వెళ్ళి పుస్తకాలు కొంటానన్నారు! సంతోషమే - కానీ నాకు తెలుగు అకాడమీ ప్రచురణల గురించి ఎక్కువ తెలియదు. తెలిసిన రెండు మూడు పుస్తకాల పేర్లు, ఇద్దరు ముగ్గురు కవి/కధకుల పేర్లు చెప్పాను. (
పూర్తిగా చదవండి

చెత్త పాటలు రాసే తెలుగు సినిమా కవీ.. -2

Movies, ఉత్పలమాల, పద్యం Giri
ఉ. దుష్ట సమాసముల్, తగని తుఛ్ఛపు సంకర జాడ్య మౌఢ్య భూ యిష్ట ప్రయోగముల్, అతిశయించిన దుష్పదజాల వెల్లవల్ తిష్టలు వేసె నీ కలము తెచ్చిన పోకడవల్ల మూర్ఖుడా, భ్రష్టవు భాష నీ చలువ వల్ల, నరాధమ ఓ సినీకవీ!
పూర్తిగా చదవండి

Singapore wins Youth Olympics 2010 bid

Singapore, పద్యం, శార్దూలం Giri
నిర్వహణ విషయం గురించి సింగపూరుని.. శా. కాస్కో, ఓ చిరు దేశమా, ఎదురు రాగానే సరా గొప్పగా ఆస్కారమ్మిక లేదులే గెలువ, నీకా మోజు తీరేట్లుగా చూస్కో చిత్తుగ పిండికొట్టెదములే చూస్తుండగానే, అనెన్ మాస్కో, గెల్వగ చూచి తొట్టతొలి యవ్వనంపొలంపిక్కులన్*. కానీ అలా జరగలేదు. సింగపూరు చిన్నదైనా ప్రజాబాహుళ్యంలో ఈ ఆటలు నిర్వహించాలన్న తపన చూసి ఒలంపిక్కు కమిటీ వారు మాస్కోని వదిలి సింగపూరునే ఎన్నుకున్నారు. మాస్కోవాళ్ళు
పూర్తిగా చదవండి

Kitchen Confidential

Books, చంపకమాల, పద్యం Giri
చ. కళకళలాడు వంటగది, కమ్మటి వాసనలంతటా, భలే! తళతళలాడు గిన్నెలు, నిదానముగా పని సాగుతూ భలే సులభముగా ఫలారములు, శుభ్రముగా రుచులందునే సదా “నిలబడి పాలు తాగెదము” నెమ్మదిగా, పరుగెందుకోయ్, వృధా? ..అంటూ దూరదర్శనిలో షెఫ్ఫులని, వారి వంటగదులని, వాళ్ళ వంట సామానుని చూసి హోటళ్ళ గురించి లొట్టలేసే వారు లేకపోలేదు. కానీ, నిజజీవితపు పూటకూళ్ళ వంటగదుల నిజాలు ఎంత నిష్ఠూరంగా ఉంటాయో తెలుసుకోవాలంటే ఆంతనీ బూర్డేఁ రాసిన
పూర్తిగా చదవండి

మైక్రోసాఫ్టు పన్నాగం

Technology, తరలము, పద్యం Giri
ఇది చదవండిత. చదువుసంధ్యల మున్గితేలుతు సాఫ్టువేరులు వాడగా (బదులు డబ్బులు లాగుదామని మడ్డియోచన మానితే) వదివి వేసిన వారలందరు వాడుకొందురు తేరగా, ముదిరిపోదురు వాటిలోబడి, మంచి రాబడి వారిచే కుదిరిపోవును ముందుముందిక, కొక్కెమే ఇది భేషుగా
పూర్తిగా చదవండి

చెత్త పాటలు రాసే తెలుగు సినిమా కవీ..

Movies, పద్యం, శార్దూలం Giri
శా. ఏంట్రా నీకిది కొంచెమైన సబబా? ఇట్లాంటి సాహిత్యమా? కంట్రీబ్రూటయి తెల్గు పాటలనిలాగా, పెంట సిన్మాలకై కంట్రోలన్నది గాలికొగ్గి భడవా, గార్బేజిలా కక్కుతా వేంట్రా? వెంట్రుకె ఉచ్చు నీకు వెధవా, వేళ్ళాడి ఊరేగరా.
పూర్తిగా చదవండి

కృష్ణ

Movies, పద్యం, మత్తకోకిల Giri
మ.కో. బుట్టలో పడిపోతినే, అరె! బొత్తిగా మతి పోయెనా? వట్టి మాటలు వ్రాయువారలపైన మాయని నమ్మకం బిట్టిదెందుకు? పెద్ద idle జీవి brainకి ideaల్ తట్టునా, సరితూచి చెప్పగ నాసి చిత్రము చూసినా? జవాబు: లేదు అలాంటి ఆలోచనలు తట్టవు. అతడికి మంచి సినిమాకి చెత్త సినిమాకి తేడా తెలియదు. సమీక్షలోంచి ఓ మచ్చుతునక.. “Second half’s graph goes down a bit during the flashback episode and pre climax scenes. But the director
పూర్తిగా చదవండి

Jodhaa Akbar

Movies, చంపకమాల, పద్యం Giri
ఉ. ఉల్లములెల్లనుల్లసమునొందగ, (భారత దేశమందు వర్థిల్లిన రాచవీరుని గురించి నిజాలను కొంత మార్చినా)తొల్లిటి వైభవాలు, కదనోద్యమ భేరులు, వీనువిందుగాకళ్ళు జిగేలనే విధముగా తెరకెక్కెను జోధ అక్బరై వివరాలు నవతరంగంలో రాసాను, వీలు దొరికినప్పుడు చదవండి.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS