Can't see Telugu? Learn here. More Questions? Ask here.

== 5== శృంగార శతకము, భర్తృహరి

Telugu, తెలుగు, పద్యములు, భర్తృహరి సుభాషితముల, శృంగార శతకము chavakiran
వక్త్రం చంద్రవికాసి, పంకజపరీహాసక్షమే లోచనే, వర్ణః స్వర్ణమపాకరిష్ణు, రలినీజిష్ణుః కచానాం చయః వక్షోజావిభకుంభవిభ్రమహరౌ, గుర్వి నితంబస్థలీ, వాచాం హారి చ మార్దవం, యువతిషు స్వాభావికం మణ్డనం. == 5== శృంగార శతకము, భర్తృహరి. ఉత్పలమాల: తమ్ముల నేలు కన్నులు, సుధానిధిఁ బోలు మొగంబు, మత్తభృం గమ్ముల గెల్చుకొప్పు, కనకద్యుతి మీఱుమెఱుంగు, కుంభికుం భమ్ముల నవ్వు గుబ్బచను బంతులు, గొప్పపిందు తేనియల్ భమ్మెడుముద్దుఁబల్కులును, జేయని సొమ్ములు సుందరాంగికిన్. == ఏనుగు లక్ష్మణ కవి అనువాదం. ==  వక్త్రం = మొఖము. అపాకరిష్ణుః = త్రోసివేయునట్టి. ఆలినీజిష్ణుః = ఆడ్తుతుమ్మెదల యొక్క. ఇభ = ఏనుగు, గుర్వీ = గొప్పదగు. నితంబస్థలీ = [...]
పూర్తిగా చదవండి

కాళీయ నృత్యం: పోతన భాగవతము

Telugu, తెలుగు, పద్యములు chavakiran
కాళీయ నృత్యం: పోతన భాగవతము సీసము ఘనయమునానదీ కల్లోల ఘోషంబు సరసమృదంగఘోషంబు గాఁగ సాధుబృందావనచరచంచరీక గా నంబు గాయక సుగానంఖ్బు గాఁగ గలహంస సారస కమనీయమంజు శ బ్దంబులు దాళశబ్దములు గాఁగ దివినుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీనజనులు గాఁగ తేటగీతి బద్మరాగాదిరత్నప్రభాసమాన మహితకాళియ ఫణిఫణామండపమున నళినలోచన విఖ్యాత నర్తకుండు నిత్యనైపుణమునఁ బేర్చి నృత్య మాడె. చంచరీక = తుమ్మెద —- శార్దూలము: కుక్షిన్ లోకములున్న గౌరవముతో గోపాకృతిన్నున్నయా రక్షోహంత వడిన్ మహాఫణిఫణారంగ ప్రదేశంబుపై నక్షీణోద్ధతినాఁడుఁ; బాడుఁ; జెలఁగున్; హాసంబుతోడం బద ప్రక్షేపంబులు సేయుఁ గేళిగతులం బ్రాణైకశేషంబుగన్. కందము: ఘనతరసుషిరానంద స్వనములతో సిద్దసాధ్యచారణగంధ ర్వ నిలింప మునిసతులు చ య్యనఁ గురిసిరి విరులవాన లాడెడుహరిపై. విరులు = పువ్వులు. ==== sanskrit version for [...]
పూర్తిగా చదవండి

ఉదయనోదయము 4:

Telugu, ఉదయనోదయము, తెలుగు, పద్యములు chavakiran
ఉదయనోదయము 4: 43, 171 సీసము: నెమ్మది నుండంగ నిర్జరాధిపుడు మా             తలిచేత న న్నేల పిలువ బంపె బంపి యేటికి జెప్పె జలఖేది నాతోడ             సాకేతపతిపుత్రి జననవృత్తి జెప్పిన నే నేల చెవియొగ్గి వింటి త             త్పరబుద్ధి నాలతాతన్విచరిత విన్న నేమిటి కుండె విద్రుమాధరరూపు             లీల నాయాత్మ నిర్మించినట్ల ఆట వెలది : యదియ సందుగాగ నసమాస్త్రు డత్యుగ్ర సాయకములపాలు సేయ దొడగె నేమిసేయువాడ నీ తనూతాపంబు వేడి మెట్లు మాన్చువాడ నొక్కొ
పూర్తిగా చదవండి

ఉదయనోదయము 3

Telugu, ఉదయనోదయము, తెలుగు, పద్యములు chavakiran
ఉదయనోదయము 3 పేజీక 40, 160 సీసము: కబరిపైజెరివిన కమ్మని చెంగల్వ                   విరులతావికి దేంట్లు వెనుకొనంగ దారహారంబుతో బారిజాతపుదండ                   కుదురుబాలిండ్లపై గొండ్లియాడ బదపల్లవంబులపై జాఱగట్టిన                   చీనాంబరము వింత చెలుపు చూప నిర్జరాధిపు డిడ్డ నెలవంక యొత్తులు                   చెక్కుటద్దములకు సిరిఘటింప తేటగీతి గతులు రాయంచమురిపంపు గతుల దెగడ నెదురు చనుదెంచుచున్న రాకెందువదన నాకపురిమెట్టు చెంత జిన్నారిచేడె నల్ల జూచె దిలోత్తమ నప్సరసను సో, ప్రతిపదార్థము ఎవరు ముందు వ్రాస్తున్నారు?
పూర్తిగా చదవండి

ఉదయనోదయము 2:

Telugu, ఉదయనోదయము, తెలుగు, పద్యములు chavakiran
ఉదయనోదయము 2: సీసము: ఆరబండిన క్రొత్తయల్లొనేరెడు పండ్లు :    కుంతలంబుల యొప్పు సంతరింప గమియబండిన పెద్ద గజనిమ్మపండులు                     పాలిండ్ల చెలువంబు ప్రస్తరింప ముదుర బండిన మంచిమాతులుంగపు బండు                   లంగంబు కాంతి చె న్నవధరింప దనియబండిన తీయద్రాక్షా ఫలంబులు                    కలికివాతఱ సోయగంబునాగ తేటగీతి: బలుచ బాఱిన లతవికా పల్లవములు గండపాళుల విభవంబు గమ్మిరింప బొలుచు వనలక్ష్మి యవయవంబులునుబోని వనవిశేషంబు వీక్షించె మనుజవిభుడు||
పూర్తిగా చదవండి

ఉదయనోదయము చదువుతున్నాను:

Telugu, ఉదయనోదయము, తెలుగు, పద్యములు chavakiran
ఉదయనోదయము చదువుతున్నాను: నారన సూరన ప్రణీతము సంశోధన పరిషారములు డాక్టర్ వాసిలి వేంకటలక్ష్మీనరసింహారావు సంపాదకీయం డాక్టర్ బి. అరుణకుమారి ప్రచురణ ఆంధ్రప్రదేశ్ ప్రభూత్వప్రాచ్య లిఖిత గ్రంథాలయం పరిశోధనాలయం, తార్నాక,హైదరాబాద్ 7 ఒకానొక బ్లాగర్ల మీటింగునకు ఉస్మానియా విశ్వవిధ్యాలయంనందు ఉన్న గ్రంథాలయంనకు వెళ్ళి కొనుక్కున పుస్తకాల్లో ఇది ఒకటి. అప్పుడప్పుడూ చదువుతున్నాను, నిఘంటువు లేకుండా టకా టకా చదువుతున్నాను. ఓ పాతిక శాతం అర్థం అవుతుంది, కొన్ని పద్యాలు బాగున్నాయి అని అనిపించినయి మీ ఆనందం కోసం రోజుకోటి టైపు చేస్తున్నాను (మరీ ఎక్కువ లేవు లేండి [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS