Can't see Telugu? Learn here. More Questions? Ask here.

విజయా వారి విజయపతాక

పద్యము, సాహిత్యం... రానారె
నేనింతవరకూ పాతాళభైరవి పూర్తిగా చూడలేదు. నాదగ్గరున్న పాత సీడీలను సర్దుతుండగా కంటబడిందీరోజు. చూద్దామని కుదురుగా కూర్చున్నాను. సెన్సారువారి యోగ్యతాపత్రం తరువాత విజయావారి పతాక. యుద్ధభేరి మోగుతుండగా రెపరెపలాడే జెండాపై కపిరాజు. మిస్సమ్మ, గుండమ్మకథ, మాయాబజార్లను ఎన్నోసార్లు చూసివుంటానుగానీ ఈ 'పతాక' సన్నివేశంలో మాత్రం ప్రతిసారీ కపిరాజును చూడటంతోనే సరిపోయేది. రెపరెపలాడే ఆ జెండా చుట్టూ ఒక సంస్కృత సూక్తము
పూర్తిగా చదవండి

గురుః దేవో నారాయణః

పద్యము రానారె
కం. సుందరమై జగమంతయు గంధపు పరిమళము నింపు కాంచనమయమౌ కందము నీకై కూర్చితి నందుకొనవయ్య మదీయ కవనాచార్యా! సర్లేగానీ ఇంతకూ ఆ కందమెక్కడ అంటారా!? తెలుగు పద్యరీతుల్లో కందపద్యాన్ని కడు రమ్యమైనదని చెబుతారు కదా! ఆ మాటను పట్టుకొని అటు కందమునూ, ఇటు దాని మూలాలను నాకు తెలియపరచిన మా గురువుగారినీ గుర్తుచేసుకుంటూ ఈ పద్యం రాశాను. పద్యం చెప్పడమే సరిగా అలవడని నాలాంటివాడి చేతిలో కందంకూడా కందిపోయి అంత అందంగా
పూర్తిగా చదవండి

బ్రౌను మహాశయునికి కందపు కైమోడుపు

పద్యము రానారె
కం . అంధతమసమున నుండిన గ్రంధము లెన్నియొ వెలుగును గాంచిన ఖ్యాతిన్ ఆంధ్ర నిఘంటువు కూర్చిన సాంద్రతమ ఘనతయు తలతు సతతము బ్రౌణ్యా!
పూర్తిగా చదవండి

ఇంటికెడితేను టీవీని పెట్టినారు!

పద్యము రానారె
మొన్నటిదాకా రేడియోలో సమస్యాపూరణం పద్యాలు వింటూ, "మన స్థాయి కాదులే" అనుకునేవాణ్ణి. జీవితసత్యాలనూ సన్మార్గాలనూ సరళమైన పద్యాలుగా అల్లి, పద్య ప్రక్రియను పామరుల నాలుకల మీదకు తెచ్చిన తెలుగు వైతాళికుడు మహానుభావుడు వేమన. సుజనరంజని వారి ప్రయత్నం ఇదే దిశలో ఉంది. కానీ, వారిచ్చిన సమస్యను నా స్థాయిలోనే పూరించినా ప్రోత్సహించి ప్రచురించినందుకు వారికి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా మరోసారి కొత్తపాళిగారికి ధన్యవాదాలు.
పూర్తిగా చదవండి

గురుభ్యో నమ:

పద్యము రానారె
ఆ.వె|| కొత్తపాళీ యొకటి కోరినంతనె వచ్చి చిత్తగించె నాదు చిన్ని కోర్కె! ఆటవెలది మదిని అంతర్యమేమిటో తేటతెల్లమాయె తెలిసికొనగ!! ఆ.వె|| నీరు తడుపలేదు నిప్పు కాల్పగలేదు హార్టువేరు చెడును "సాఫ్టు" చెడదు! ఆత్మ సాఫ్టువేరు అన్నాడు రానారె ఆలమేల! అన్ని ఆశలేల!? నాలుగు పాదాలలో యతి, గణాలు: 1 వ పాదం యతి - [నీరు - నిప్పు] నీరు - UI తడుప - III లేదు - UI నిప్పుకాల్ - UIU(ర) పగలేదు - IIUI(సల) 3ఇన 2ఇంద్ర 2 వ పాదం
పూర్తిగా చదవండి

ఉత్పలమాల – గురువు – లఘవు

పద్యము రానారె
భండన భీముడా ర్తజనబాంధవు డుజ్వల బాణ తూణ కో దండకళా రప్రచండ భుజతాండవ కీర్తికి రామ మూర్తికిన్ రెండవ సాటి దైవమిక లే డనుచున్ గడగట్టి భేరికా డాండ డడాండ డాండ నినదమ్ము లజాండము నిండ మత్త వేదండమునెక్కిచాటెదను దాశరథీ కరుణా పయోనిధీ! చిన్నప్పుడు మా నాయన నేర్పిన పద్యం ఇది. అర్థంతో సహా నేర్పారు కాబట్టి ఇంకా గుర్తుంది. పద్యం నాలుగు పాదాలూ రాశానుగానీ, పాదాలను ఎక్కడబడితే అక్కడ అమ్మతోడుకూడాలేకుండా అడ్డంగా
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS