Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఇత్యర్ధలు కూరా, ఇతిభావలు పులుసూ…

కబుర్లు, పుక్కిటి పురాణాలు, భారతదేశం Sriram
అనగనగా గోదావరీ తీరాన ఒక గ్రామంలో ఒక వేదపండితుడు. మహా జ్ఞాని. పొద్దునే లేచి స్నానం,సంధ్యా కానిచ్చి అనుష్ఠానం,స్వాధ్యాయం(సెల్ఫ్ స్టడీ) చేసుకోడం - ఆ తర్వాత విద్యార్ధులకి వేదమూ, “ఇత్యర్ధః (ఇదీ దీని అర్ధం), ఇతి భావః (ఇదీ దీని భావము)” అంటూ దానికి అర్ధమూ పాఠాలు చెప్పుకోడం - ఇదీ ఆయన దైనందిక జీవితం.   ఉన్న కాస్త భూమిలో పండే గింజలూ, పెరట్లో పండే కూరలూ ఆ కుటుంబానికి భోజ్యం. ఎప్పుడూ బయటకెళ్ళి రూపాయి సంపాదించిన వ్యక్తి కాదు. [...]
పూర్తిగా చదవండి

తెనాలిరాముడి వికటకవిత్వం, నా పైత్యం (కొనసాగింపు…)

కబుర్లు, తెలుగు పద్యం, తోటి బ్లాగర్లు, పుక్కిటి పురాణాలు Sriram
“కుంజరయూధంబు దోమ కుత్తుకజొచ్చెన్” దోమ నోట్లో మదపుటేనుగులు దూరాయి అని దీనర్ధం. తెనాలి రామకృష్ణ సినిమా చూసిన తెలుగువారందరికీ ఈ సమస్య సుపరిచితమే. తెనాలి రాముడిని చూసి ఓర్వలేని కొంతమంది తోటి పండితులు ఒక కాపలా వాడిచేత ఈ సమస్యని అడిగిస్తారు. ఈ విషయాన్ని గ్రహించలేకపోతే ఆయన తెనాలిరాముడెందుకౌతాడు. అందుకే కాపలా వాడిని అడ్డంపెట్టి వాళ్ళని బండబూతులు తిడతాడు. గంజాయి తాగి నానా జాతులతోటీ కలిసి కల్లుతాగి పేలుతున్నావా లం*కొడకా, ఎక్కడరా దోమనోట్లో ఏనుగులు దూరాయి? అని ఇలా [...]
పూర్తిగా చదవండి

తెనాలి రాముడి వికటకవిత్వం, నా పైత్యం!

కబుర్లు, తెలుగు పద్యం, తోటి బ్లాగర్లు, పుక్కిటి పురాణాలు Sriram
తెనాలి రాముడి పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చేవి చిన్నప్పుడు విన్న చమత్కారపు కధలూ అందులోని హాస్యమూను. నిజానికి ఇలా పిల్లలని ఆకట్టుకునే చారిత్రక పాత్రలు మనకి చాలానే ఉన్నాయి. బీర్బల్, మర్యాద రామన్న వగైరాలు. కానీ తెనాలి రాముడి ప్రత్యేకత ఏమిటంటే ఆయన పిల్లలతో పాటు పెరుగుతూ వస్తాడు. అమ్మ వారి చేతుల్లోని రెండు గిన్నెల్లో పాయసమూ తాగేసిన కధ వినే వయసు దాటేసరికి గూని చాకలి వాడి కధ దొరుకుతుంది. ఇంకొంచెం పెద్దయ్యేప్పటికి భావతురంగం కధ [...]
పూర్తిగా చదవండి

శ్రీనాధుని చమత్కారం

తెలుగు పద్యం, పుక్కిటి పురాణాలు Sriram
కవికీ కంసాలికీ సీసం లోకువంటారు. మరి కవిసార్వభౌముడైన శ్రీనాధుడికెంత లోకువో అనిపిస్తుంది ఈ సీస పద్యం చదివితే: సీ: రాజనందన రాజ రాజాత్మజులు సాటి                        తలప నల్లయ వేమ ధరణి పతికి      రాజనందన రాజ రాజాత్మజులు సాటి                        తలప నల్లయ వేమ ధరణి పతికి      రాజనందన రాజ రాజాత్మజులు సాటి                         తలప నల్లయ వేమ ధరణి పతికి      రాజనందన రాజ రాజాత్మజుల సాటి                         తలప నల్లయ వేమ ధరణి పతికి గీ: భావభవ భోగ సత్కళా భావములను      భావభవ భోగ [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS