Can't see Telugu? Learn here. More Questions? Ask here.

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌

ప్రత్యేక వ్యాసాలు భూమిక
వేములపల్లి సత్యవతి 20 వ శతాబ్ధం తెలుగు మహిళా లోకానికి అపూర్వమైన, అమూల్యమైన యిరువురు నారీశిరోమణులను ప్రసాదించింది.   ఒకరు డాక్టరు దుర్గాబాయి గారు  మరొకరు కొమఱ్ఱాజు అచ్చమా౦బ గారు.   వారు ఏపదవిని అలంకరించినా, ఏవృత్తి చేపట్టినా మహిళాభ్యుదయాన్ని మరచిపోలేదు.  తుది శ్వాస విడిచేవరకు మహిళల అభివృద్ధికి తపించి, శ్రమించి విజయాలు సాధించారు.  ఆ మాననీయ మహిళా మణులిరువురు తెలుగువారి ఆడపడుచులైనందుకు తెలుగువారంతా గర్వపడాలి.  1908 జులై నెల నుంచి దుర్గాబాయి గారి శతాబ్ది సంవత్సరం మొదలవుతుంది.  ఆ సందర్భంగా [...]
పూర్తిగా చదవండి

నాడీకణాలు

ప్రత్యేక వ్యాసాలు డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌
ప్రాణులకు తమ పరిసరాలను గురించి ఉండే స్పృహా, చైతన్యమూ ఎంతో ప్రత్యేకమైనవి. అవి లేనిదంతా “జడ” పదార్థమే. ముఖ్యంగా మనుషుల్లో “ఒళ్ళు తెలియకుండా పోవడం” చాలా అసహజమైనదిగా భావిస్తాం. ఎంత ప్రాథమిక జీవి అయినా బతికున్నంత కాలమూ తన చుట్టూ ఉన్న పరిస్థితులను గుర్తించి, వాటికి స్పందిస్తుంది. అయితే ఈ స్పందనల్లో తేడాలుంటాయి. ఏకకణజీవులైన అమీబా వంటివి ఎక్కువ “తెలివితేటలను” పొందలేవు.
పూర్తిగా చదవండి

ప్రాణుల మెదడు

ప్రత్యేక వ్యాసాలు డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌
మనుషులతోబాటు కనబడేవీ, కనబడనంత సూక్ష్మమైనవీ ఎన్నెన్నో ప్రాణులు సహజీవనం చేస్తున్నాయి. అయితే ఇటువంటివి భూగ్రహానికి వెలపల ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఇంతవరకూ జరిగిన జీవపరిణామంలో మనలాగా బుద్ధిజీవితానికి అలవాటుపడ్డ మరే ప్రాణీ కనబడదు. ఇటువంటి పరిణామానికి మూలకారణమైన మనిషి మెదడు ప్రాణికోటిలోనే ఎంతో ప్రత్యేకమైనది.
పూర్తిగా చదవండి

పెనం నుంచి పొయ్యికి…చైనా మహిళ ‘లాంగ్ మార్చ్‌’

ప్రత్యేక వ్యాసాలు భూమిక
డా. ఘంటా చక్రపాణి  ’నాకు నేను తలెత్తుకుని బతికేందుకు ఏ అవకాశం వచ్చినా వదులుకోను. ఇప్పుడు ఎంత కష్టం అనిపించినా భవిష్యత్‌ చింత లేకుండా వుండాలన్నదే నా కల’ అంటోంది యంగు ఫలింగు. చైనాలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోన్న హాంగ్జ నగరంలో కొత్తగా వెలిసిన ‘హూటర్స్‌’ రెస్టారెంట్లో ఆమె వెయిట్రెస్‌గా పనిచేస్తోంది.  ’హూటర్స్‌’ అన్న మాటకు ఒక రకమైన గుడ్లగూబలాంటి పక్షి అనే అర్థం వుంది.  ఈ గుడ్లగూబ  ప్రపంచంలో  యువతులను సెక్స్‌ సింబల్‌గా వాడుకుని అత్యంత అమానవీయమైన రీతిలో [...]
పూర్తిగా చదవండి

సర్రియలిజం అంటే…

ప్రత్యేక వ్యాసాలు, వ్యాసాలు ఆడెపు లక్ష్మీపతి
రాత్రిపూట ఇంట్లోని లైట్లన్నీ ఆర్పేసీ మంచం మీదికి వాలుతూ, చీకటి మూసిన బెడ్‌రూంలో కాళ్లవైపు ఫ్లోరింగు తెల్లగా మెరుస్తూ టైల్స్‌ మీది డిజైన్‌ సైతం కనపడటం గమనిస్తాము. ఇంకో క్షణం పోయాక చూపులు తిన్నగా పైకి పోనిస్తే, లోకప్పు మీద ఫ్యాను రెక్కల నీడలు నల్లటి వలయాలుగా, గబ్బిలాల గుంపులాగా స్పష్టంగా తిరుగాడటం కనిపించి ఇంకా ఆశ్చర్యపోతాము.
పూర్తిగా చదవండి

సూక్ష్మజీవుల ప్రతాపం

ప్రత్యేక వ్యాసాలు డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌
బాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులూ మన జీవితాలని ఎన్ని రకాలుగా ప్రభావితం చెయ్యగలవో పూర్తిగా అర్థం కావటంలేదు. పరిశోధనల్లో బైటపడుతున్న కొత్త విషయాల్లో వాటి గురించిన మంచీ, చెడూ కూడా తెలియవస్తోంది. ఒక్కటి మాత్రం నిజం. ప్రపంచంలో ప్రతిచోటా నిలదొక్కుకుని జీవిస్తున్న రకరకాల బాక్టీరియాను తప్పించుకోవడం అసాధ్యమైన పని. పనికిరాని చెత్తనూ, కుళ్ళిన జీవ పదార్థాలనూ ఎప్పటికప్పుడు విడగొట్టి మట్టిలో కలిపేసే బాక్టీరియా మనకు పనికొచ్చే ఆహారాన్ని కూడా “పాడు” చేస్తూ ఉంటాయి. మానవులు సమాజజీవితం మొదలుపెట్టిన నాటినుంచీ [...]
పూర్తిగా చదవండి

బాక్టీరియాతో మన సంబంధాలు

ప్రత్యేక వ్యాసాలు డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌
బాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులూ అనేవి అసలు ఉన్నాయని తెలియడానికి భౌతికశాస్త్రంలో కొంత ప్రగతి అవసరమైంది. రకరకాల కటకాలతో మైక్రోస్కోప్‌లు తయారైన తరవాతనే సంగతులన్నీ బైటపడసాగాయి. ఆధ్యాత్మిక ధోరణి ఉన్నవారు మానవమాత్రులను ఆడించే శక్తిని గురించి తలుచుకుంటూ ఉంటారు. ఎవరి కంటికీ కనబడని ఆ శక్తి ఏమిటో ఎవరికీ అంతుచిక్కదు గాని సైన్సుకు తెలిసినంతవరకూ అటువంటి శక్తేదో బాక్టీరియాకు ఉన్నట్టుగా కనిపిస్తుంది.
పూర్తిగా చదవండి

బత్కమ్మ మాకు దూరమాయె

ప్రత్యేక వ్యాసాలు ఖాదర్
జె.సుభద్ర గీమద్దెన డిల్లిల గడ గల్లుమన్నది తెలంగాణ బత్కమ్మంటే… శాన సంబురమనిపిచ్చింది. గా పొయినేడు భరత్‌భషణ్‌ తెలంగాణ పల్లెలు దిరిగి బత్కమ్మల్ని కెమెరా కండ్లనిండా వంచుకొని, అద్దాలల్ల మడులుగట్టి సూపిచ్చి శానమందికి పూలపండుగు యింట్లనే జేసిండు. గా పోటువలు జూసి పూలబత్కవ్మెలె నేను పొంగిపోయి పూసిన. కానేం ఫాయిద బత్కమ్మకు మా ఆడోల్లకున్న సమందం ‘ససుకోని మురువ సెప్పుకోనెడువ’ తీరే వుండె. గీ బత్కమ్మ తన సిబ్బి చాతిని పరిసి పూలల్ల అంటిముట్టని తంగేడు, జిల్లేడు, [...]
పూర్తిగా చదవండి

బత్కమ్మ మాకు దూరమాయె

ప్రత్యేక వ్యాసాలు ఖాదర్
జె.సుభద్ర గీమద్దెన డిల్లిల గడ గల్లుమన్నది తెలంగాణ బత్కమ్మంటే… శాన సంబురమనిపిచ్చింది. గా పొయినేడు భరత్‌భషణ్‌ తెలంగాణ పల్లెలు దిరిగి బత్కమ్మల్ని కెమెరా కండ్లనిండా వంచుకొని, అద్దాలల్ల మడులుగట్టి సూపిచ్చి శానమందికి పూలపండుగు యింట్లనే జేసిండు. గా పోటువలు జూసి పూలబత్కవ్మెలె నేను పొంగిపోయి పూసిన. కానేం ఫాయిద బత్కమ్మకు మా ఆడోల్లకున్న సమందం ‘ససుకోని మురువ సెప్పుకోనెడువ’ తీరే వుండె. గీ బత్కమ్మ తన సిబ్బి చాతిని పరిసి పూలల్ల అంటిముట్టని తంగేడు, జిల్లేడు, [...]
పూర్తిగా చదవండి

దళితస్త్రీలపై అత్యాచారాలు

ప్రత్యేక వ్యాసాలు భూమిక
ఎస్‌. శారద నేటి సమాజంలో స్త్రీలకు జరిగే అన్యాయలలో ఎక్కువభాగం దళిత స్త్రీల పైననే జరుగుతున్నాయి. అన్ని రంగాల్లో దళిత స్త్రీలు అన్యాయలకు అత్యాచారాలకు అవమానాలకు అవహేళనలకు గురి అవుతున్నారు. పురుషాధిక్య సమాజంలో దళిత స్త్రీలపై జరిగే దమనకాండను వివక్షతను దళితవాద ఉద్యమాలు ఎలా ఎదుర్కొంటున్నాయి, దళిత స్త్రీలు అగ్రకులాధిపతుల అత్యాచారాలకు ఎన్ని విధాలుగా గురి అవుతున్నారనే జండర్‌ విధానాన్ని కొన్ని అంశాల ద్వారా చర్చిస్తున్నాను. దళిత స్త్రీలు అన్ని రంగాల్లోను ఈనాటికీ అణగ ద్రొక్కబడుతనే [...]
పూర్తిగా చదవండి

ఆరోగ్యం, శుచీ, శుభ్రతల చరిత్ర

ప్రత్యేక వ్యాసాలు డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌
విజ్ఞానమనేది సమాజంలో అందరికీ సమానంగా అందుబాటులోకి రాదు. కేరళలో పల్లెపల్లెకూ తిరుగుతూ, సామాన్యప్రజలకు అంటురోగాల గురించీ, ఆహారం విషయంలోనూ, మరుగుదొడ్ల ఏర్పాటులోనూ పాటించవలసిన శుచీ శుభ్రత వగైరాల గురించీ, వివరించిన సంస్థ కేరళ శాస్త్రసాహిత్య పరిషత్తు. వీధి నాటికలూ, ప్రదర్శనల ద్వారా 1970లనుంచీ వామపక్ష బృందాలు నిర్వహించిన ఈ పెద్ద ఉద్యమంవల్ల గ్రామీణ ప్రాంతాల్లో అమ్మవారు మొదలైన గుడ్డినమ్మకాలు చాలావరకూ తగ్గిపోయాయని తెలిసింది.
పూర్తిగా చదవండి

పెనుచీకటిలో చిరుదీపం

ప్రత్యేక వ్యాసాలు భూమిక
కొండవీటి సత్యవతి 2006 మార్చి 16న భూమిక హెల్ప్లైన్ ప్రారంభమైంది. ఈ పదిహేను నెలల కాలంలో దాదాపు రెండు వేలకు పైచిలుకు స్త్రీలు ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పుకోవడం, వారికి కావలసిన సమాచారం, సలహాలను అందించడం జరిగింది. ఎన్నో సీరియస్ కేసులను పరిష్కరించుకునేలా దిశా నిర్దేశం యివ్వడం జరిగింది. అసలు ఈ హెల్ప్లైన్ ప్రారంభించాలన్న ఆలోచన ఎలా కలిగిందని చాలామంది అడుగుతుంటారు. మీకందరికి తెలుసు 1993 నుండి భూమిక పత్రిక విజయ వంతంగా నడుస్తోంది. పత్రికలో వుంటనే [...]
పూర్తిగా చదవండి

మాటలు - వెలివేసే పద్ధతులు

ప్రత్యేక వ్యాసాలు భూమిక
థెమ్సులా అఓ అనువాదం: ఓల్గా సమాజంలోని అన్ని రూపాలలో వున్న అధికార నిర్మాణాలకు వెలివేసే పద్ధతులు అవసరమైన ముందస్తు పరిస్థితిగా ఉండటమనేది మానవజాతి ఉనికిలోని ఒక స్వీయ వైరుధ్యంతో కూడిన సత్యం. ఈ సూత్రం ప్రకారం హక్కులను, అవకాశాలు కొద్దిమంది చేతిలోనే ఉండి చాలామందికి నిరాకరించబడతాయి. విశాల పరిధిలో చూసినపుడు సాంఘిక వెలి అనేది ప్రధానంగా జాతి కేంద్రంగా యేర్పడుత వచ్చింది. దాని మూలంగా కొన్ని గ్రూపులను సమాజపు అట్టడుగు వర్గాలుగా వుంచేందుకు అవసరమైన [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS